Bigg Boss Voting : రీ ఎంట్రీలో గంగవ్వ మాస్ రచ్చ.. ఓటింగ్‌లో టాప్‌లో, డేంజర్ జోన్‌లో బిగ్‌బాస్ దత్తపుత్రిక
డల్‌గా సాగుతున్న బిగ్‌బాస్ తెలుగు 8లో పెద్ద ట్విస్ట్ ఇచ్చారు నిర్వాహకులు . ఏకంగా 8 మందిని వైల్డ్ కార్డ్ ద్వారా లోపలికి పంపి ఇక చూసుకోండి అన్నట్లుగా గేమ్‌ని మార్చేశారు. ఇప్పటికే హౌస్‌లో ఉన్న వారిని ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్స్ (ఓజీ) అని , వైల్డ్ కార్డ్ ద్వారా లోపలికి వచ్చినవారిని రాయల్ క్లాన్‌గా పేరు పెట్టారు. ఆరో వారం నామినేషన్స్ విషయంలోనూ బిగ్‌బాస్ బిగ్‌షాకిచ్చాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు మాత్రమే నామినేట్ చేసే ఛాన్స్ ఇవ్వడంతో వాళ్లు దబిడిదిబిడి చేశారు. మరి ఈ వారం నామినేషన్స్, ఓటింగ్ విషయాలను చూస్తే :
14 మందితో ప్రారంభమైన బిగ్‌బాస్ సీజన్ 8లో 5వ వారం ముగిసే నాటికి ఆరుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. బెజవాడ బేబక్క, ఆర్జే శేఖర్ భాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల తొలి నాలుగు వారాల్లో ఎలిమినేట్ కాగా.. ఐదో వారం మిడ్ వీక్‌లో ఆదిత్య ఓం, ఆదివారం నాడు నైనిక హౌస్‌ను వీడారు. ఆ వెంటనే వైల్డ్ కార్డ్ ద్వారా 8 మందిని లోపలికి పంపిస్తున్నట్లుగా బిగ్‌బాస్ అనౌన్స్ చేశాడు. హరితేజ, నయని పావని, గంగవ్వ, మెహబూబ్, గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజా, రోహిణి, ముక్కు అవినాష్‌లు ఎంట్రీ ఇచ్చారు. వీరంతా బిగ్‌బాస్ గత సీజన్‌లలో కంటెస్టెంట్స్ కావడం గమనార్హం.

బిగ్‌బాస్ హౌస్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉన్న వీళ్లను ఎదుర్కోవడం అంత తేలిక కాదని.. మన ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్స్‌కి అర్ధమైపోయింది. సోమవారం నామినేషన్స్‌కు శ్రీకారం చుట్టిన బిగ్‌బాస్.. హౌస్‌లో ఉండటానికి అనర్హులు అనుకునే వారిని నామినేట్ చేయాల్సిందిగా రాయల్ క్లాన్‌ను ఆదేశిస్తాడు బిగ్‌బాస్. దీంతో నయని పావని .. విష్ణుప్రియ, సీతలను, మెహబూబ్.. సీత, యష్మీలను, టేస్టీ తేజా.. సీత, మణికంఠలను, హరితేజ... యష్మీ, పృథ్వీరాజ్‌లను , గౌతమ్ కృష్ణ.. విష్ణుప్రియ, యష్మీలను నామినేట్ చేశారు.
నామినేషన్స్ ప్రక్రియ సోమవారం నాటి ఎపిసోడ్‌లో పూర్తి కాలేదు, మంగళవారంతో ఐదో వారం నామినేషన్స్‌ను ఎండ్ చేయనున్నారు. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి ఆరో వారం ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో ఉన్నారు. వారిలో విష్ణుప్రియ, కిరాక్ సీత, పృథ్వీ, యష్మీగౌడ నామినేట్ అయ్యారు. అయితే ఓజీ క్లాన్‌కి బిగ్‌బాస్ ఓ పవర్ ఇస్తారు.. దీని ప్రకారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన వారిలో ఇద్దరిని నామినేట్ చేయొచ్చు. దీంతో గంగవ్వ, మెహబూబ్‌లు నామినేషన్స్‌లోకి వచ్చారు.
ఆన్‌లైన్‌లో అనధికారికంగా జరుగుతున్న ఓటింగ్‌లో షాకింగ్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. బిగ్‌బాస్‌లో మరోసారి రీ ఎంట్రీ ఇచ్చిన గంగవ్వ ఈ వారం ఓటింగ్‌లో టాప్‌లో నిలవడం విశేషం. ఆమెకు 29 శాతం ఓట్లు రాగా.. విష్ణుప్రియకు 20 శాతం, పృధ్వీరాజ్‌కి 16 శాతం ఓట్లు వచ్చాయి. మరో ఓల్డ్ కంటెస్టెంట్ మెహబూబ్‌కి 14 శాతం, యష్మీగౌడకి 14 శాతం ఓట్లు వచ్చినప్పటికీ ఓట్ల సంఖ్యలో మెహబూబ్ ముందున్నాడు. కిరాక్ సీత 7 శాతం ఓటింగ్‌తో లిస్ట్‌లో అట్టడుగున నిలిచారు. ప్రస్తుతానికి యష్మి, సీతలు డేంజర్ జోన్‌లో నిలవడంతో బిగ్‌బాస్ లవర్స్ షాకవుతున్నారు. అయితే ఓటింగ్ లైన్స్ కొన్ని రోజులు ఓపెన్‌లోనే ఉంటాయి కాబట్టి వీరిద్దరూ పుంజుకునే అవకాశం లేకపోలేదు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.


Click it and Unblock the Notifications











