బిగ్‌బాస్ విజేత అతడే.. మరోసారి జాతకం చెప్పిన గంగవ్వ
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచిన గంగవ్వ అనూహ్య పరిస్థితుల్లో బయటకు వెళ్లిపోయారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో బిగ్‌బాస్ అనుమతి మేరకు ఆమె తన సొంతింటికి వెళ్లిపోయారు. తన సొంత గ్రామం జగిత్యాలకు సమీపంలో లంబాడిపల్లెకు చేరుకొన్న ఆమెకు ఘన స్వాగతం లభించింది. తన సొంత ఇంటి వద్ద మీడియాతో మాట్లాడుతూ అనేక విషయాలు పంచుకొన్నారు. గంగవ్వ చెప్పిన విషయాలు ఏమిటంటే...

టీవీ చూడటం మానేశారు
బిగ్‌బాస్ నుంచి ఇంటి చేరుకొన్న తర్వాత నా కొడుకు, మనవడిని చూసి హ్యాపీగా ఫీలయ్యాను. ఇంటికి రాగానే నా మనవళ్లు నాతో మాట్లాడుతూ.. ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుండు నానమ్మ అని అన్నారు. నేను ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంటి వాళ్లు బిగ్‌బాస్ చూడటం మానేశారు. నా పిల్లలను చూసుకొన్న తర్వాత చాలా హ్యాపీగా ఫీలయ్యాను అని గంగవ్వ చెప్పింది.

నాకు జరిమానా విధించలేదు
ఇంటి నుంచి వెళ్లిపోతానంటే బిగ్‌బాస్ ఏమనలేదు. వాళ్లు నా ఆరోగ్యం గురించి బాధపడ్డారు. నాగార్జున సార్ కూడా నన్ను మంచిగా చూసుకొన్నారు. మధ్యలో ఇంటి నుంచి వచ్చినందుకు నాకు ఫైన్ ఏమీ వేయ్యలేదు. నాతో అలాంటి ఒప్పందం లేదు. నా ఆరోగ్య పరిస్థితిని దృష్టిలోపెట్టుకొని పంపించారు అని గంగవ్వ చెప్పారు.

ఇంటి సభ్యులు బాగా చూసుకొన్నారు
ఇంటిలో నాకు అఖిల్ అంటే ఇష్టం. దివి, సుజాత కూడా నాకు బాగా ఇష్టం. ఇంట్లో వాళ్లు అందరూ నన్ను బాగా చూసుకొన్నారు. వారిలో అఖిల్ నాకు కొంచెం ఎక్కువ ఇష్టం. నేను వచ్చేటప్పుడు అందరూ చాలా బాధపడ్డారు. నాకు కూడా బాధవేసింది అంటూ గంగవ్వ చెప్పారు.

నాగార్జున నాకు మెసేజ్
ఇక నాగార్జున ఇంటిని కట్టిస్తారని మాట ఇచ్చారు. మొబైల్ ఫోన్‌లో నాకు మెసేజ్ చేస్తూనే ఉన్నారు. ఒక్కసారి వాళ్లు ఇళ్లు కట్టుకోమని చెబితే ముగ్గు పోసుకొంటాను. దసరాకు నేను ఇళ్లు కట్టుకోవడానికి ముగ్గు పోసుకొంటాననని ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు. దాంతో నాకు సొంత ఇళ్లు కట్టుకోవాలనే కోరిక తీరుతుంది. నేను ఇంటికి వచ్చిన తర్వాత కూడా మందులు పంపిస్తూ, డాక్లర్లు నా ఆరోగ్యం గురించి తెలుసుకొంటున్నారు అని గంగవ్వ చెప్పారు.
Recommended Video

అవినాష్ బిగ్‌బాస్ విజేత
ఇక బిగ్‌బాస్ ఇంటిలో ఎక్కువగా నవ్విచ్చేది ముక్కు అవినాష్. మస్తుగా జోకులు చేస్తుంటాడు. బిగ్‌బాస్‌లో అందరికి ఆయనంటే ఇష్టం. బిగ్‌బాస్‌లో చివరి వరకు ఉండేది అవినాషే. అతడే గెలిచే అవకాశం ఉంది అని గంగవ్వ చెప్పారు. గతంలో తాను ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు.. సుజాత నీవు ఈ వారం బయటకు వస్తావు అంటూ గంగవ్వ జాతకం చెప్పింది. ఇప్పుడు బిగ్‌బాస్ విజేత అవినాష్ అంటూ మరోసారి జాతకం చెప్పడంతో అదంతా నిజమవుతుందా అనే విషయం చర్చనీయాంశమైంది.


Click it and Unblock the Notifications











