twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా బిడ్డ ప్రాణాలు నా చేతిలోనే.. జీవిత విషాదాన్ని చెప్పిన గంగవ్వ.. ఇంటిసభ్యుల కంటతడి

    |

    బిగ్‌బాస్ హౌస్‌లో 32వ రోజు మంచి హుషారైన పాటతో మొదలైంది. వాటే బ్యూటీ పాటతో మొదలైన తర్వాత ఇంటి సభ్యులు మార్నింగ్ మస్తీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటిలో తమ మనసుకు నచ్చిన ఓ విషయాన్ని బిగ్‌బాస్‌తో పంచుకోవాలి. ఆ క్రమంలో నోయల్ సీన్ తన తల్లి గురించి, అవినాష్ తన అప్పులు, ఆర్థిక సమస్యలు వెల్లడించి ఇంటి సభ్యులను భావోద్వేగానికి గురిచేశారు. అలాగే గంగవ్వ తన జీవితంలోని ఓ విషాదాన్ని పంచుకోగా ఇంటి సభ్యులు కంటతడి పెట్టారు. గంగవ్వ చెప్పిన విషాద గాథ ఏమిటంటే..

    ఊళ్లో వాళ్లు నాపై నిందలు

    ఊళ్లో వాళ్లు నాపై నిందలు

    నా పెద్ద బిడ్డకు పెళ్లి సంబంధాలు వచ్చాయి. కానీ చేతిలో డబ్బులు లేకపోవడంతో నేను చేయలేకపోయాను. అయితే ఊళ్లో వాళ్లు నాపై నిందలు వేశారు. గంగవ్వ పిల్లల పెళ్లి చేయరని నాపై కామెంట్లు చేశారు. అలాంటి పరిస్థితుల నుంచి బయటపడేందుకు ప్రయత్నం చేశాను. కాయకష్టం చేయడం మొదలుపెట్టాం అని గంగవ్వ అన్నారు.

     నా బిడ్డ అనారోగ్యంతో బాధపడటంతో

    నా బిడ్డ అనారోగ్యంతో బాధపడటంతో

    ఇల్లు గడవడం కష్టంగా మారడంతో నేను కూలీ పనికి వెళ్లేదానిని. ఓక రోజు నాతోపాటు నా కూతురు కూడా పనికి వచ్చింది. తను స్కూల్‌కు వెళ్లే పిల్ల అయినప్పటికి నా కష్టాల్లో పాలుపంచుకొనేది. ఆ రోజు సాయంత్రం నాతో పాటు పల్లికాయ ఉడకపెట్టి తిన్నాం. రాత్రి కడుపులో నొప్పి అంటూ బాధపడింది. హాస్పిటల్‌కు తీసుకెళ్లే ప్రయత్నం చేశాను అని గంగవ్వ బాధతో చెప్పడం ప్రారంభించారు.

     నా బిడ్డ శవంతో అలా ప్రయాణం

    నా బిడ్డ శవంతో అలా ప్రయాణం

    మా ఊర్లో దవాఖాన లేకపోవడం వల్ల పక్క ఊరికి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేశాను. అప్పటికే నా బిడ్డ శరీరం చల్లగా మారిపోయింది. హాస్పిటల్‌కు తీసుకెళ్లే వరకు నా బిడ్డ ప్రాణాలు వదిలింది. చేతిలో డబ్బులు లేవు. ఒంటిపై ఉన్న నగలు, చేతిలొ ఉన్న చిల్లర డబ్బులతో ఇంటికి వెళ్లడానికి ప్రయత్నించాను. దాంతో నా బిడ్డను చేతుల్లో ఎత్తుకొని ఇంటికి వెళ్లడానికి బస్టాండుకు పోయాను. శవంతో బస్సులో ప్రయాణించవద్దని కండక్టర్ దించేశాడు అని గంగవ్వ చెప్పారు.

    గంగవ్వ కష్టాలు విని కంటతడి

    గంగవ్వ కష్టాలు విని కంటతడి

    నా భుజంపై శవాన్ని మోసుకొంటూ వాళ్లను, వీళ్లను బతిలాడాను. అంతలో మారు ఊరికి వెళ్లే లారీ రావడంతో దాంట్లో ఇంటికి తీసుకెళ్లి దహనం చేశాం. అలా నా బిడ్డ ప్రాణాలు నా చేతిలోనే పోయాయని అని చెప్పగానే ఇంటి సభ్యులు కంటతడి పెట్టారు. ఇప్పుడు ఇంటిలో అందరూ నన్ను బాగా చూసుకొంటున్నారు. నాకు సంతోషంగా ఉంది అంటూ గంగవ్వ ఎమోషనల్ అయ్యారు.

    Recommended Video

    #HBDSSRajamouli : Pan India Director With No Flop Till Date ఓటమి ఎరుగని దర్శక ధీరుడు | RRR
     గంగవ్వ గురించి కుమార్ సాయి

    గంగవ్వ గురించి కుమార్ సాయి

    చివర్లో గంగవ్వ గురించి మాట్లాడుతూ.. అవ్వ జీవితం ఓ సందేశంగా ఉంది. జీవితంలో ఎన్నో కష్టాలు చూశారు. జీవితం ఎలా మొదలైందనేది కాదు. ఎలా ముగిసిందనేది ముఖ్యం. కాబట్టి ప్రతీ ఒక్కరు గంగవ్వ జీవితాలను, కష్టాలను ఎదురించే తీరును స్పూర్తిగా తీసుకోవాలి అని కుమార్ సాయి అన్నారు.

    English summary
    Bigg Boss Telugu Season 4: In the 32th day, Gangavva reveals her tragic life incidents. Gangavva told that, about her daughter death. That tragic story make cry of Bigg Boss house contestant.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X