గంగవ్వ ఫ్లయింగ్ కిసెస్, డంబెల్స్‌తో హంగామా.. కరాటే కల్యాణి చెప్పుతో కొట్టు అంటూ సూర్య కిరణ్ రచ్చ
బిగ్‌బాస్ తెలుగు షోలో కరాటే కల్యాణి గొడవలు, గంగవ్వ నవ్వులతో మిశ్రమంగా సాగింది. అరియానా గ్లోరి, సోహెల్ వాగ్వాదం ఇంట్లో సభ్యుల మధ్య చిచ్చు పెట్టేవిధంగా మారింది. ఇలా ఇంటిలో సభ్యులు ఎవరికి తోచిన విధంగా వారు కట్టప్ప ఎవరు అనే విషయంపై చర్చ పెట్టారు. ప్రధానంగా గంగవ్వ తనదైన శైలిలో మరోసారి ఆకట్టుకొన్నారు. మూడో రోజు ఏం జరిగిందటే..
Recommended Video

సీక్రెట్ రూమ్ నుంచి అరియానా, సోహెల్
సీక్రెట్ రూమ్‌లో నుంచి ఇంటిలోకి ప్రవేశించిన అరియానా గ్లోరి, సయ్యద్ సోహైల్ ర్యాన్ సభ్యులతో వాగ్వాదానికి దిగారు. మేము ఫోన్ చేస్తే ఎందుకు స్పందించలేదు. మీరు ఫుడ్ పంపించకపోవడం వల్ల బ్రేక్‌ఫాస్ట్ మిస్ అయ్యాం అంటూ గొడవకు దిగారు. అయితే గ్లోరి, సోహైల్ వ్యవహారాన్ని చూసిన అభిజిత్ ఘాటుగా స్పందించారు. ఇద్దరు అరుస్తుంటే 14 మంది చూస్తూ ఉరుకోవాలా అంటూ ఫైర్ అయ్యారు.

అరియానాకు నోయెల్ గట్టి స్ట్రోక్
అరియానా, సోహెల్ ఇద్దరు అలానే గొడవను పెద్దగా చేస్తుంటే నోయల్ సీన్ రంగంలోకి దిగాడు. మీరు అరిస్తే మేము ఊరుకోవాలా? అంటూ అరియానాకు గట్టిగా స్ట్రోక్ ఇచ్చారు. దాంతో వారిద్దరూ తమ వాదనను ముగించారు. అనంతరం డిన్నర్ చేయడానికి సిద్దమవుతుంటే అరియానా నాకు ఎవరైనా తినిపించాలి అంటూ మొండికేసింది. చివరకు కరాటే కల్యాణి ఆమెకు ఓ ముద్ద పెట్డడంతో అలక మానింది.

కరాటే కల్యాణితో సూర్య కిరణ్
అరియానా గ్లోరికి కరాటే కల్యాణి అన్నం తినిపించడంపై గొడవ మొదలైంది. ఈ అంశంపై దేవీ, కల్యాణి మధ్య వాగ్వాదం చోటుచేసుకొన్నది. దీనిపై కల్యాణి ఇంట్లో రచ్చ చేసింది. ఓ దశలో తన మాట వినిపించుకోకపోవడంతో కల్యాణ్‌ను ఉద్దేశించి సూర్య కిరణ్ మాట్లాడుతూ.. ఒక్క నిమిషం నా మాట విను. ఒక్క నిమిషం దాటితే చెప్పుతో కొట్టు అన్నారు.

లాస్య, సుజాత, హారిక మీటింగ్
కట్టప్ప ఎవరు? ఇంట్లో గొడవ గురించి లాస్య, సుజాత, హారిక, దేవీ స్విమ్మింగ్ ఫుల్ వద్ద మీటింగ్ పెట్టారు. అమ్మలక్కలంతా కలిసి ఇంటిలోని విషయాలు చర్చించారు. మరో వైపు సీక్రెట్ టాస్క్ గురించి అరియానా, సోహెల్ చర్చించుకోవడం కనిపించింది. ఇలా గొడవలు, సీక్రెట్ మీటింగ్‌తో రెండో రోజు రాత్రి ముగిసింది. అర్ధరాత్రి వరకు మీటింగ్‌లో ఎవరికి వారు వ్యూహాలు పన్నుతూ కనిపించారు. కట్టప్ప గురించి అఖిల్, సుజాత, అభిజిత్ చర్చిస్తూ కనిపింంచారు.

గంగవ్వ వర్కవుట్లు
ఇక మూడో రోజు ఖైదీ నంబర్ 150లోని లెట్స్ డూ కుమ్ముడు పాట ప్లే అయింది. దాంతో ఎర్ర చొక్కాను నీకోసం వేశాను పాటకు రెచ్చిపోయి స్టెప్పులు వేశారు. ఇంటి సభ్యులందరూ ఉత్సాహంతో స్టెప్పులు వేసి ఊపు తెచ్చారు. అలా మూడో రోజు హ్యాపీగా ప్రారంభమైంది. గంగవ్వ ఉదయమే డంబెల్స్ కొడుతూ కనిపించింది. ఏకధాటిగా 10 రౌండ్లు డంబెల్స్ కొట్టారు. బిగ్‌బాస్ అంటూ చేతులు ఎత్తి ఎక్సర్‌సైజులు చేశారు. కెమెరాను చూస్తూ ముద్దులు పెట్టారు.


Click it and Unblock the Notifications











