ఇంటిలో కట్టప్ప ఎవరంటే? మాట మార్చను.. అలా చేస్తే లంగాతనమే.. గంగవ్వ సూపర్ పంచ్
బిగ్‌బాగ్ తెలుగు రియాలిటీ షో చాలా బోరుగా సాగుతున్నది. ఎలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు లేకుండా గొడవలు, అర్ధం లేని అరుపులతో సెలబ్రిటీలు షోను నిస్సారంగా మార్చారు. గంగవ్వ లేకపోతే ఈ సీజన్ ఎంత దారుణంగా ఉండునో అనే అభిప్రాయానికి ఈ షో బలం చేకూరుస్తున్నది. బిగ్‌బాస్ ఇంటిలో నాలుగో రోజు ఏం జరిగిందంటే...

దివి వద్యాకు బిగ్‌బాస్ టాస్క్
ఎపిసోడ్ ఆరంభంలో దివి వద్యాకు ఓ టాస్క్ ఇచ్చారు. ఇంటి సభ్యుల ప్రవర్తన తీరు గురించి చెప్పమన్నారు. కల్యాణితోపాటు అందరి గురించి చెప్పుకొంటూ వెళ్లారు. అయితే కల్యాణి, లాస్య, మరో ఇద్దరు ముగ్గురు దివి కామెంట్స్‌ను ఒప్పుకోలేదు. అయితే ఇది నా అభిప్రాయం మాత్రమే కాబట్టి మీరు ప్రవర్తనను మార్చుకోవాలా వద్దా అనే మీ విషయం అంటూ చెప్పారు.

అరియానా, సోహైల్‌కు కొత్త టాస్క్
అరియానా గ్లోరి, సోహైల్‌ను సీక్రెట్ రూమ్‌లోకి బిగ్‌బాస్ పిలిచి ఓ టాస్క్ ఇచ్చారు. కట్టప్ప ఎవరు అనే విషయాన్ని ఇంటి సభ్యులను అడిగి తెలుసుకోమని చెప్పారు. మీరు సీక్రెట్ రూమ్‌లో ఇచ్చిన టాస్క్ ఫెయిల్ కావడం వల్ల లగ్జరీ బడ్జెట్ టాస్క్ పాయింట్లను కోల్పోయారని చెప్పారు. బయటకు వచ్చి కట్టప్ప ఎవరు అని అడిగితే కొందరు చెప్పారు.. మరికొందరు వీరిద్దరి టాస్క్‌ను బాయ్‌కాట్ చేశారు.

గంగవ్వ దులుపుడు మామూలుగా లేదే
ఇక కట్టప్ప ఎవరు అనే ప్రశ్నకు అరియానా, సోహైల్‌ను గంగవ్వ గట్టిగా దులిపిసేంది. కట్టప్ప అంటే నా దృష్టిలో అఖిల్ అంటూ చెప్పింది. అఖిల్ పేరే రాసి ఆ బాక్స్‌లో చిట్టి వేశాను అని చెప్పింది. అయితే అఖిల్ పేరు మారుస్తావా అంటే అలా మారిస్తే లంగాతనం అవుతుంది అని అరియానా, సోహైల్‌కు ఝలక్ ఇచ్చింది.
Recommended Video

అందరి జాతకాలు చెప్పిన గంగవ్వ
ఇంటి సభ్యుల గురించి ఎవరెవరు ఏంటి? ఎలా ఉంటారు అంటూ గంగవ్వ జాతకాలు చెప్పింది. సూర్య కిరణ్ భూస్వామి అని, అభిజిత్ యాపిల్ తిని కామ్‌గా ఉంటాడు.. దేవక్క అప్పుడు అందరికి సహాయం చేస్తుంటుంది. లాస్య ఇంటికాడ ఉన్న బాబును గుర్తు చేసుకొంటూ నాగార్జున ఇచ్చిన బొమ్మను ముద్దు పెట్టుకొంటుంద అంటూ అలా అందరి గురించి గంగవ్వ చెప్పింది. ఇంటి సభ్యులు కూడా గంగవ్వ చెప్పిన విషయాలకు హ్యాపీగా ఫీలయ్యారు. మనసులో ఏముంటే అదే చెప్పాలని గంగవ్వకు సూచించారు.


Click it and Unblock the Notifications











