బిగ్‌బాస్‌ షోలోకి గంగవ్వ.. వైల్డ్ కార్డు ద్వారా మరో 7 గురు ఎవరంటే? వారి ఎంట్రీలు ఎప్పుడంటే?

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 రసవత్తరంగా సాగుతున్నది. ఊహించని విధంగా ఈ షోలో ఎలిమినేషన్ జరగడంతో టాప్ అనుకొన్న కంటెస్టెంట్లు బయటకు వెళ్లిపోయారు. స్టాంగ్ కంటెస్టెంట్లు అనుకొన్న బేజవాడ బేబక్క, అభయ్ నవీన్, సోనియా ఆకుల ఎలిమినేట్ కావడంతో అభిమానులు షాక్ గురయ్యారు. అయితే 5వ వారం వీకెండ్ ముగింపులో నాగార్జున వెళ్లూ వెళ్తూ వైల్డ్ కార్డు ఎంట్రీలను ప్రస్తావించి ఆసక్తికరంగా మార్చారు. ఈ సీజన్‌లో వైల్డ్ కార్డుల ఎన్నీ? ఎంత మంది? ఎవరు షోలికి వస్తున్నారనే విషయంలోకి వెళితే..

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ఎన్నడూ లేని విధంగా ట్విస్టులు, టర్నులతో సాగుతున్నది. సరికొత్తగా ప్రయోగాలు, గేమ్స్‌తో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ షో ముందుకు సాగుతున్నది. అయితే తాజాగా ఆట మధ్యలో ఇంటిలోకి 12 మంది కంటెస్టెంట్లు వైల్డ్ కార్డుల ద్వారా ఇంటిలోకి వస్తున్నారు అని బాంబు పేల్చారు.

Gangavva wild Card entry in Bigg Boss Telugu 8 Here other 7 wild Card entry list

అయితే ఎక్కువ సంఖ్యలలో వైల్డ్ కార్డు ఎంట్రీలు రాకుండా ఉండే అవకాశం మీ చేతుల్లోనే ఉంది. మీ ఆటల ద్వారా వైల్డ్ కార్డు ఎంట్రీలను అడ్డుకొనేందుకు ప్రయత్నించండి. ఎన్ని ఎక్కువ గేమ్స్ గెలిచి 12 మంది వైల్డ్ కార్డుల్లో ఎంత తక్కువ మందిని ఇంటిలోకి తెచ్చుకొంటారో అది మీ చేతుల్లోనే ఉంది అని అన్నారు. అయితే చివరకు 8 మందిని వైల్డ్ కార్డుల ద్వారా ఇంటిలోకి పంపించే ఏర్పాట్లు జరుగుతున్నాయి.

బిగ్‌బాస్ తెలుగు 8 ఇంటిలోకి వైల్డ్ కార్డుల రూపంలో గత 8 సీజన్లలో పాల్గొన్న సీనియర్ కంటెస్టెంట్లను సిద్దం చేసినట్టు తెలుస్తున్నది. సీజన్ 1లో టాప్ 5 కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచిన హరితేజ మరోసారి బిగ్‌బాస్‌లోకి వెళ్తున్నట్టు సమాచారం. సీజన్ 6లో మెహబూబ్, సీజన్ 7 పాల్గొన్న నయని పావని కూడా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టనున్నారు.

Gangavva wild Card entry in Bigg Boss Telugu 8 Here other 7 wild Card entry list

ఇక గత సీజన్‌ 6 లో టాప్ కంటెస్టెంట్‌గా నిలిచిన ముక్కు అవినాస్ (జబర్దస్త్), సీజన్ 7లో తనదైన మార్కు చూపించిన గౌతమ్ కృష్ణ, సీజన్ 3లో కనిపించిన రోహిణి, సీజన్ 4 కంటెస్టెంట్ గంగవ్వ, సీజన్ 7లో టాప్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చిన టేస్టీ తేజ కూడా వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నారు అని తెలిసింది. ఇప్పటికే వీరి వీడియోలు కూడా సిద్దం చేసినట్టు తెలుస్తున్నది.

బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్‌లో మరోసారి ఈ శనివారం (అక్టోబర్ 5వ తేదీన) వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉండోతున్నాయి. మినీ గ్రాండ్ ఓపెనింగ్ సెలబ్రేషన్ ద్వారా మరోసారి హోస్ట్ నాగార్జున వైల్డ్ కార్డు కంటెస్టెంట్లను ఇంటిలోకి పంపుతారు. ఇక ఈ టాప్ కంటెస్టెంట్లతో బిగ్‌బాస్ ఇల్లు మార్మోగిపోయే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X