బిగ్ బాస్-3లోకి నాని ఎంటరయ్యాడు...

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 నాగార్జున హోస్ట్‌గా విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ షో 49 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. బిగ్ బాస్ మొదటి సీజన్ హోస్ట్ చేసిన ఎన్టీఆర్, రెండో సీజన్ హోస్ట్ చేసిన నానితో పోలిస్తే... కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న తీరు చాలా భిన్నంగా ఉందని అంటున్నారు.

అయితే ఇపుడు ఈ షోలోకి 2వ సీజన్ హోస్ట్ చేసిన నాని ఎంటరవ్వడం హాట్ టాపిక్ అయింది. ఆదివారం ప్రసారం కాబోయే 50వ ఎపిసోడ్లో నాని కనిపించబోతున్నారు. నా..నీ టీవీలో అంటూ అతడు షోను హోస్ట్ చేస్తున్నట్లు ఓ ప్రోమో విడుదల చేశారు.

అయితే నాని వచ్చింది తన లేటెస్ట్ మూవీ 'గ్యాంగ్ లీడర్' ప్రమోషన్ కోసమే. మరి ఆదివారం జరిగే షో నాని ఒక్కడే హోస్ట్ చేస్తాడా? లేక నాగార్జున కూడా షోలో ఉంటారా? అనేది తెలియాల్సి ఉంది. ఆదివారం షో రసవత్తరంగా సాగుతుందనే విషయం స్పష్టమవుతోంది.

'గ్యాంగ్ లీడర్' మూవీ విషయానికొస్తే.. నాని హీరోగా డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మిస్తున్నారు. సెప్టెంబర్‌ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.

Gangleader movie star Nani in Bigg BossTelugu 3

ఇందులో ఆర్‌ఎక్స్‌ 100 ఫేమ్‌ కార్తికేయ కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్‌ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్‌, జైజా, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌, సినిమాటోగ్రఫీ: మిరోస్లా కుబా బ్రోజెక్‌, మాటలు: వెంకీ, రచనా సహకారం: ముకుంద్‌ పాండే, పొడక్షన్‌ డిజైనర్‌: రాజీవన్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌: రామ్‌కుమార్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, వి.ఎఫ్.ఎక్స్.: మకుట, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: ఉత్తర మీనన్‌, స్టిల్స్‌: జి.నారాయణరావు, కో-డైరెక్టర్‌: కె.సదాశివరావు, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: శేషు, సి.ఇ.ఓ.: చిరంజీవి(చెర్రీ), నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సివిఎం), కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విక్రమ్‌ కె.కుమార్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X