Bigg Boss Telugu 7 ఇద్దరం సీక్రెట్ రూంలో ఉంటే.. మనసులో మాట బయటపెట్టిన గౌతమ్, శుభశ్రీ!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి వారంలో 14 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపిన బిగ్ బాస్.. వారి మధ్య బంధాలు బలపడేలా చేయడమే కాకుండా గొడవలు కూడా పెట్టాడు. అయితే ముందు వారంలోనే వచ్చేసిన గౌతమ్ కృష్ణ, శుభశ్రీ రాయగురులు.. ఒకరితో ఒకరు చక్కగా ఉండేవారు. వారిద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం ఉన్నా సరే ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా సీక్రెట్ గా మెయింటేన్ చేసేవారు. ముఖ్యంగా జనాలు ఏమైనా తప్పుగా అనుకుంటారో ఏమోనని.. శుభ శ్రీ గౌతమ్ కృష్ణకు చాలా దూరంగా ఉండేది. కానీ మాట్లాడిన కాసేపు మాత్రం చక్కగా మాట్లాడేది.
గౌతమ్ కృష్ణ చాలా సార్లే శుభ శ్రీ అంటే ఇష్టం అని చెప్పకనే చెప్పాడు. కానీ లెటర్ టాస్క్ లో మాత్రం తనకు ఇష్టమైన అమ్మాయి కోసం సాక్రిఫైజ్ చేయకుండా... తన స్వార్థాన్ని చూసుకున్నాడు. ఆ తర్వాతి వారమే శుభశ్రీ ఎలిమినేట్ అయి బయటకు వెళ్లిపోవడం... తనను మోసం చేసిన వాడిగా మిగిలిపోయానంటూ గౌతమ్ అనుకోవడం జరిగంది. కానీ ఆమె ఇంట్లోంచి వచ్చేశాకా తన గురించి మాట్లాడితే ఏమైనా నెగిటివ్ అవుతుందేమోనని భావించిన అతడు... కామ్ గా ఉండిపోయినట్లు చెప్పాడు. అయితే గౌతమ్ 13వ వారమే బయటకు రాగా.. ఇప్పటికే ఆరు రోజులు అవుతుంది. బిగ్ బాస్ ఇంట్లోంచి బయటకు వచ్చిన వెంటనే తాను శుభ శ్రీని కలుస్తానని బిగ్ బాస్ బజ్ షోలో చెప్పాడు.

అలాగే తననే కలుస్తానంటూ తన మనసులో ఉన్న ప్రేమను వెల్లడించాడు. అలాగే తాను అనుకున్నట్లుగానే ఇంట్లోంచి వచ్చిన వెంటనే శుభశ్రీనే కలిసినట్లు వెల్లడించాడు. అయితే ఇద్దరూ సెపరేట్ గా ఇంటర్వ్యూలు ఇవ్వడంతో.. అందరికీ చెప్పాల్సి వస్తోందని... నేరుగా శుభ శ్రీయే గౌతమ్ కృష్ణను ఇంటర్వ్యూ చేసింది. తన యూట్యూబ్ ఛానెల్ లోనే ఆ ఇంటర్వ్యూను పోస్ట్ చేసింది. ఈక్రమంలోనే తమ మధ్య రిలేషన్ షిప్ పై క్లారిటీ ఇచ్చారు. అంతేకాదండోయ్ చాలా హాట్ హాట్ కామెంట్లు కూడా చేసి వైరల్ అయ్యారు. అయితే వారేం కామెంట్లు చేశారు, వారి మధ్య బంధం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

హాయ్ సార్.. వెల్ కమ్ అంటూ శుభశ్రీ గౌతమ్ తో ఇంటర్య్యూ స్టార్ట్ చేసింది. ఫుల్ బ్లష్ అయిపోతూనే అనేక ప్రశ్నలు అడిగింది. ముందుగా గౌతమ్ అనాలా, అశ్వత్థామా అనాలా, జీకే అనాలా, కృష్ణ అనాలా, డాక్టర్ బాబు అని పిలవాలా అంటూ అడగ్గా.. ప్రేమగా ఏమని పిలిచినా సరే పలుకుతానంటూ గౌతమ్ కృష్ణ చెప్పుకొచ్చాడు. నేనైతే గౌతమ్ అని పిలుస్తా.. అప్పుడప్పుడూ కృష్ణ అని పిలుస్తానంటూ వెల్లడించింది. దీనికి డాక్టర్ బాబు తెగ సిగ్గు పడిపోయాడు. అలాగే తామిద్దరినీ కలిసి సీక్రెట్ రూంలో వేస్తో ఏం చేసేవాడివంటూ కన్నుగీటి మరి అడిగింది సుబ్బు.

దానికి మంచి కాఫీ తాగుతూ.. బాగా ముచ్చట్లు పెడుతూ ఎంజాయ్ చేసేవాళ్లమని గౌతమ్ అనగా.. అంతేనా అంటూ శుభ శ్రీ అడిగింది. దానికి ఇద్దరూ నవ్వుకున్నారు. నిజంగానే అలా వేస్తే బాగుండేది అంటూ తమ మనసులోని కోరికను బయట పెట్టారు. దీన్ని బట్టే వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. నా గురించి నీవు ఏమనకున్నావో తెలియదు కానీ.. ఇకపై నిజమైన గౌతమ్ ను చూస్తావంటూ వివరించాడు. శుభశ్రీ కూడా అతడిపై ఇష్టాన్ని చెప్పకనే చెబుతున్నట్లుగా అనిపిస్తోంది. మీరూ ఓసారి ఆ ఇంటర్వ్యూ చూసేయండి.


Click it and Unblock the Notifications










