Gautam Krishna: బిగ్‌బాస్ ఇంట్లో గౌతమ్ సీక్రెట్ క్రష్ ఆమే.. తొలిసారిగా బయట పెట్టిన అశ్వత్థామ 2.0!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో అద్భుతంగా సాగుతోంది. ఎవరూ ఊహించని విధంగా సాగుతున్న ఈ షో బుల్లితెర ప్రేక్షకులను అలరించడంలో ఎప్పుడూ ముందుంటుంది. మొదటి వారం 14 మంది కంటెస్టెంట్లు ఇంట్లో అడుగు పెట్టగా.. నాలుగు వారాలు కాగానే మరో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు. ముఖ్యంగా ఐదో వారంలో గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ అవుతున్నట్లు ప్రకటించారు. అందరికీ గుడ్ బై చెప్పాక సీక్రెట్ రూంకి పంపించారు. ఆ తర్వాత మరో ఐదుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీలను హౌస్ లోకి పంపించారు. ఇక ఆ తర్వాత ఒక్క రోజులోనే గౌతమ్ కృష్ణను తిరిగి ఇంట్లోకి పంపారు.
ఇలా సీక్రెట్ రూం నుంచి బయటకు వచ్చిన గౌతమ్ కృష్ణ తన ఆటను మొత్తం మార్చుకున్నాడు. ముఖ్యంగా రెండోసారి ఇంట్లో అడుగు పెట్టిన అతడు.. రాననుకున్నారా రాలేననుకున్నారా అంటూ తీవ్రమైన డైలాగ్స్ కొట్టాడు. అశ్వాత్థామ 2.0 అంటూ కాస్త ఓవర్ చేశాడు. కానీ ఆ తర్వాత చక్కగా గేమ్ ఆడాడు. తాజాగా 13వ వారం ఎలిమినేట్ అయిపోయి ఇంట్లోంచి బయటకు వచ్చేశాడు. ఇంట్లోంచి ఎలిమినేట్ అయి షాకింగ్ కామెంట్లు చేశాడు. ముఖ్యంగా తనకు ఇంట్లో ఉన్న ఓ అమ్మాయి అంటే ఇష్టం అని ప్రకటించాడు. ఆ విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసకుందాం.

మొదటి నుంచి శుభ శ్రీ అంటే తనకు ఇష్టం అని... ఆమెతో స్నేహం చాలా చక్కగా ఉండేదని పేర్కొన్నాడు. హౌస్ లో ఉన్నన్ని రోజులు శుభ శ్రీతో చాలా నిజాయితీగా మాట్లాడానని... ఎలాంటి రిలేషన్ షిప్ అయినా, ఫ్రెండ్ షిప్ తోనే మొదలు అవుతుందంటూ గౌతమ్ కృష్ణ పేర్కొన్నాడు. అయితే శుభ శ్రీతో తన బంధం ఎక్కడి వరకు వెళ్తుందనేది తనకు తెలియదని.. అలాగే ఐదు వారాల్లో దీన్ని డిసైడ్ చేయలేమంటూ చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా శుభ శ్రీ ఇంట్లోంచి వెళ్లిపోయేటప్పుడు ఆమెతో మాట్లాడే సమయం లేదని వివరించాడు.
శుభ శ్రీ ఇంట్లోంచి వెళ్లాక ఆమెతో మాట్లాడితే... అది ఆమెకు నెగిటివ్ అవుతుందని భావించే తాను ఆమె గురించి మాట్లాడలేదని చెప్పాడు. ఎన్నిసార్లు ఆమె గుర్తుకు వచ్చినా ఒక్కసారి కూడా ఆమె గురించి చర్చ తీసుకురాలేదని వెలల్లడించాడు. లెటర్ త్యాగం చేసే సమయంలో తాను చాలా ఎమోషనల్ అయ్యానని పేర్కొన్నారు. ఈ విషయంలో తనను స్వార్థ పరుడు అని అంతా అనుకున్నా తాను అంగీకరిస్తానని చెప్పుకొచ్చాడు. అప్పుడు తాను నిజంగానే అర్థం చేసుకోలేకపోయానని... సందర్భం వచ్చినప్పుడు శుభ శ్రీకి థాంక్స్ చెప్పాలనుకున్నానని అన్నాడు.

తాను లోపలికి వచ్చేలోపే శుభ శ్రీ వెళ్లిపోయిందని లేకపోతే తననే సేవ్ చేసేవాడినని అన్నాడు. ఎవరో ఒకరిని ఎలిమినేట్ చేయడం కంటే కూడా సేవ్ చేయడమే బెటర్ అనిపించి సందీప్ మాస్టర్ ను సేవ్ చేసినట్లు గౌతమ్ కృష్ణ వెల్లడించాడు. మరి ఇంట్లోంచి బయటకు వచ్చిన ముందుగా శుభశ్రీనే కలుస్తానని అన్నారు. వారి బంధం ఎలా ఉంటుంది, ఎక్కడి వరకు కొనసాగుతుందనేది తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











