Bigg Boss Final Voting : ఓటింగ్‌లో తెలుగు సెంటిమెంట్ .. విన్నర్ అతనేనా?.. సూట్‌కేస్ ఎవరికంటే?

దాదాపు 100 రోజులకు పైగా తెలుగు వారిని అలరిస్తున్న బిగ్‌‌బాస్ తెలుగు 8కి మరో 24 గంటల్లో ఎండ్ కార్డ్ పడనుంది. ఎన్నో గొడవలు, వివాదాల నడుమ సాగిన ఈ సీజన్‌ విజేత ఎవరు కానున్నారు? ప్రైజ్ మనీ‌తో పాటు విజేతకు ఏం ఇవ్వనున్నారు? గ్రాండ్ ఫినాలేకు చీఫ్ గెస్ట్ ఎవరు? సూట్ కేస్ ఆఫర్‌కి ఎవరు టెంప్ట్ కానున్నారు? లాంటి అంశాలపై సర్వత్రా డిస్కషన్ నడుస్తోంది. అన్నింటికి మించి చివరి రోజు బిగ్‌బాస్ ఫైనల్ ఓటింగ్ ఎలా జరుగుతోంది? ఎవరు లీడ్‌లో ఉన్నారు, లాస్ట్ డే ఎవరికి షాక్ తగలనుంది? ఒకసారి పరిశీలిస్తే.

14 మందితో తొలుత బిగ్‌బాస్ తెలుగు 8 ప్రారంభమైంది. సీజన్ మధ్యలో 8 మంది కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లో అడుగుపెట్టారు. ఇప్పటి వరకు బెజవాడ బేబక్క, ఆర్జే శేఖర్ భాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల, కిర్రాక్ సీత, నాగ మణికంఠ, ఆదిత్య ఓం, నైనిక, మెహబూబ్, హరితేజ, గంగవ్వ, విష్ణుప్రియ, రోహిణి, పృథ్వీరాజ్ శెట్టి, టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యారు. 15వ వారం నాటికి నిఖిల్, నబీల్, ప్రేరణ, అవినాష్, గౌతమ్‌లు టాప్ 5లో నిలిచి గ్రాండ్ ఫినాలేలో అడుగుపెట్టారు. వీరిలో అవినాష్ ముందే గ్రాండ్ ఫినాలేలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఐదుగురిలో ఒకరు బిగ్‌బాస్ తెలుగు 8 టైటిల్ విజేత కానున్నారు.

gautam krishna continuous leading in bigg boss telugu 8 final voting

ఇక ఫినాలే వారంలో గొడవలు, డిస్కషన్స్‌కి బిగ్‌బాస్ ఫుల్‌స్టాప్ పెట్టాడు. కేవలం సరదా ఆటలు, ఇంటి సభ్యుల జర్నీ చూపిస్తూ వారిని ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. అలాగే బుల్లితెర నటులు సుహాసినీ, ఆకర్ష్, దీపిక రంగరాజుతో పాటు వంటలక్క, మగువా ఓ మగువా సీరియల్ నటులు హౌస్‌లో అడుగుపెట్టి కంటెస్టెంట్స్‌తో సరదా సరదా గేమ్స్ ఆడించారు. శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో తొలుత నిఖిల్ జర్నీని చూపించారు బిగ్‌బాస్. కన్నీటిని ఆపుకుంటూనే తనను ఈ స్థాయిలో నిలబెట్టినందుకు తెలుగు ప్రేక్షకులకు ఆయన థ్యాంక్స్ చెప్పారు. ఎవరినీ తాను వాడుకోలేదని.. నా కష్టం, మీ ఆదరణతోనే ఇక్కడి దాకా వచ్చానని నిఖిల్ వెల్లడించారు.

తర్వాత ప్రేరణను గార్డెన్ ఏరియాలోకి పిలిపించిన బిగ్‌బాస్ ఆమెను ఆకాశానికి ఎత్తేశాడు. ఈ సీజన్‌కే బెస్ట్ మెగా చీఫ్ అంటూ పొగడ్తల వర్షం కురిపించాడు. మీలోని పట్టుదల, ఓటమికి వెన్నుచూపని తత్వమే మిమ్మల్ని టాప్ 5లో నిలబెట్టాయని.. పెళ్లయిన ఆడవాళ్లు కూడా ఎంతో సాధించొచ్చని ఎంతో మందికి ప్రేరణగా నిలిచారని బిగ్‌బాస్ అన్నాడు. దీంతో ఎమోషనలైన ప్రేరణ కంటతడిపెట్టింది. ఇక చివరిగా నబీల్ అఫ్రిది జర్నీని చూపించాడు బిగ్‌బాస్. వరంగల్ కా షేర్ అనే పేరు ఇప్పుడు ప్రతి తెలుగు ఇంటికి తెలుసునని ... మీ వ్యక్తిత్వంతో కోట్లాది మందిని గెలుచుకున్నారని ప్రశంసించాడు బిగ్‌బాస్. సెలబ్రెటీల మధ్య సామాన్యుడిగా వచ్చి టాప్ 5లో నిలిచినందుకు గర్వంగా ఉందని అన్నాడు.

gautam krishna continuous leading in bigg boss telugu 8 final voting

ఈ నేపథ్యంలో టాప్ 5లో ఉన్న నిఖిల్, నబీల్, ప్రేరణ, గౌతమ్, అవినాష్‌లలో ఎవరు బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్ విజేత అవుతారన్నది ఉత్కంఠగా మారింది. కానీ ప్రధానంగా గౌతమ్ - నిఖిల్ మధ్యే హోరాహోరీ పోరు జరుగుతున్నట్లుగా సోషల్ మీడియా టాక్. అయితే ఓటింగ్‌లో తెలుగు సెంటిమెంట్ బాగా కనెక్ట్ అయి గౌతమ్‌కి ఓట్లు గుద్దినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఆన్‌లైన్‌లో జరుగుతున్న ఓటింగ్‌లో గౌతమ్‌ (41 శాతం) టాప్‌లో నిలిచాడు. ఇతనికి గట్టి పోటీ ఇస్తున్న నిఖిల్‌కి (35.14 శాతం) ఓట్లు పోలయ్యాయి. తర్వాత నబీల్ (13.27 శాతం) ప్రేరణ (10 శాతం), అవినాష్ (4.03 శాతం) ఓటింగ్‌తో నిలిచారు. మరి వీరిలో ఎవరు సీజన్ 8 విన్నర్ కానున్నారు? బిగ్‌బాస్ ఫైనల్ డెసిషన్ ఏంటీ ? అనేది త్వరలోనే తేలిపోనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X