Bigg Boss Voting : గౌతమ్ సునామీ, K బ్యాచ్ అడ్రస్ గల్లంతు .. ఆ స్టార్ కంటెస్టెంట్‌కి డేంజర్ బెల్స్

బిగ్‌బాస్ తెలుగు 8 ఎండింగ్ స్టేజ్‌కి వచ్చేసింది . ఆల్రెడీ 11వ వారంలోకి ప్రవేశించిన ఈ మెగా రియాలిటీ షో రెండ్రోజుల్లో మరో వీక్‌లోకి అడుగుపెట్టనుంది. ప్రస్తుతం హౌస్‌లో ఫ్యామిలీ వీక్ నడుస్తుండగా ఇప్పటికే రోహిణి , నబీల్, యష్మి గౌడ, నిఖిల్, అవినాష్ కుటుంబ సభ్యులు వచ్చి సందడి చేశారు. 11వ వారం ఆరుగురు కంటెస్టెంట్స్‌ నామినేషన్స్‌లో ఉండగా.. ఆన్‌లైన్‌లో జరుగుతున్న ఓటింగ్‌లో ఎవరు టాప్‌లో ఉన్నారు? ఎవరు డేంజర్ జోన్‌లో ఉన్నారు? ఈ వివరాల్లోకి వెళితే..

గురువారం నాటి ఎపిసోడ్‌లో విష్ణుప్రియ తండ్రి మోహన్ హౌస్‌లోకి వచ్చారు. తండ్రిని చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్లిన విష్ణుని హత్తుకున్న ఆయన.. తర్వాత కంటెస్టెంట్స్ అందరినీ పేరు పేరునా పలకరించారు. పుషప్స్ విషయంలో టేస్టీ తేజతో పందెం కాసిన ఆయన ఏకంగా 20 పుషప్స్ తీయగా.. తేజ మాత్రం ఆపసోపాలు పడ్డాడు. తర్వాత కూతురితో విడిగా మాట్లిడిన మోహన్.. నువ్వు పృథ్వీ చుట్టూ తిరుగుతుండటంతో వీక్ అయిపోతున్నావని హెచ్చరించాడు. తాను విష్ణుకి, వాళ్ల అమ్మకి అన్యాయం చేసిందని.. తన కష్టమే ఇక్కడి దాకా తీసుకొచ్చిందని మోహన్ అందరి ముందు ఎమోషనల్ అయ్యాడు.

gautam krishna gets excellent results in 11th week voting in bigg boss telugu 8

తన భర్త రాక కోసం ఎదురుచూస్తున్న ప్రేరణని స్క్రీన్‌పై నుంచి పలకరించాడు ఆమె భర్త శ్రీపాద్. అలాగే నేను రాలేదని బాధపడొద్దు నేను పంపించిన కటౌట్ నీ దగ్గరే ఉంచుకో అని లెటర్‌లో రాస్తాడు. దీంతో ప్రేరణ బాగా తిట్టుకుంటుంది. ఆ వెంటనే శ్రీపాద్ కటౌట్ తీసుకుని హౌస్ మొత్తం తిప్పుతూ సందడి చేస్తారు తేజ, అవినాష్. ఆ కాసేపటికి పృథ్వీ అమ్మగారు హౌస్‌లో అడుగుపెట్టారు. దోశ, చికెన్ కర్రీని బిగ్‌బాస్ పంపించడంతో విష్ణుప్రియకి కూడా తినిపించమని ఆమెకు చెబుతాడు పృథ్వీ. కాసేపటికి గౌతమ్ బ్రదర్ కూడా ఇంట్లోకి వస్తారు. నీతో క్లోజ్‌గా ఉండి నిన్ను దెబ్బ తీయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని , జాగ్రత్తగా ఉండాలంటూ పరోక్షంగా కన్నడ బ్యాచ్ గురించి ఆయన హెచ్చరించారు.

ఇకపోతే.. 11వ వారం బిగ్‌బాస్ తెలుగు 8లో ఆరుగురు నామినేషన్స్‌లో నిలిచారు. వారు గౌతమ్, టేస్టీ తేజ, యష్మి గౌడ, అవినాష్, పృథ్వీ, విష్ణుప్రియ. వీరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ కానున్నారు. ఆన్‌లైన్‌లో అనధికారికంగా జరుగుతున్న ఓటింగ్ ప్రకారం.. గౌతమ్ తన టాప్ ప్లేస్‌ని నిలబెట్టుకున్నాడు. దాదాపు 34.05 శాతం ఓటింగ్‌తో డాక్టర్ బాబు నెంబర్‌వన్‌గా నిలిచాడు. నిన్న అతనికి గట్టి పోటీ ఇచ్చిన యష్మి గౌడ నేడు కనుచూపు మేరలో కనిపించకుండా పోయారు. ఆమె 17.35 శాతం ఓటింగ్‌తో సెకండ్ ప్లేస్‌లో నిలిచారు.

తర్వాత టేస్టీ తేజ (13.34 శాతం), పృథ్వీరాజ్ (12.07 శాతం), అవినాష్ (11.94 శాతం) ఓటింగ్ సాధించారు. అయితే గేమ్‌ను పక్కనబెట్టి.. పృథ్వీతో ప్రేమలో మునిగిపోయిన స్టార్ యాంకర్ విష్ణుప్రియ ఓటింగ్ నానాటికీ దిగజారిపోయింది. 11.02 శాతం ఓటింగ్‌తో విష్ణు డేంజర్ జోన్‌లో నిలిచారు. ఓటింగ్ లైన్స్ క్లోజ్ కావడానికి సమయం దగ్గరపడుతుండటంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X