Bigg Boss Final Voting : దిమ్మతిరిగేలా ఫైనల్ ఓటింగ్ .. అవినాష్ ఆశలు ఆవిరి, విన్నర్ అతనే?

దాదాపు 100 రోజులకు పైగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న మెగా రియాలిటీ షో బిగ్‌బాస్‌ తెలుగు 8కి మరో నాలుగు రోజుల్లో ఎండ్ కార్డ్ పడనుంది. గ్రాండ్ ఫినాలేకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. హోస్ట్ అక్కినేని నాగార్జున కూడా తన కొడుక్కి పెళ్లి చేసి మంచి జోష్‌లో ఉన్నారు. ఫినాలే ఎపిసోడ్‌కి ఆయన కూడా బాగా రెడీ అవుతున్నట్లుగా ఫిలింనగర్‌ టాక్. అయితే ఈసారి విన్నర్ ఎవరు కాబోతున్నారు? తెలుగోడిని విజేతగా చేస్తారా? కన్నడిగుడికి పట్టం కడతారా? అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది.

14 మందితో తొలుత బిగ్‌బాస్ తెలుగు 8 ప్రారంభమైంది. మధ్యలో 8 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లో అడుగుపెట్టారు. ఇప్పటి వరకు బెజవాడ బేబక్క, ఆర్జే శేఖర్ భాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల, కిర్రాక్ సీత, నాగ మణికంఠ, ఆదిత్య ఓం, నైనిక, మెహబూబ్, హరితేజ, గంగవ్వ, విష్ణుప్రియ, రోహిణి, పృథ్వీరాజ్ శెట్టి, టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యారు. దీంతో నిఖిల్, నబీల్, ప్రేరణ, అవినాష్, గౌతమ్‌లు టాప్ 5లో నిలిచి గ్రాండ్ ఫినాలేలో అడుగుపెట్టారు. వీరిలో ఒకరు బిగ్‌బాస్ తెలుగు 8 విజేత కానున్నారు.

gautam krishna gets lead in bigg boss telugu 8 final voting

బిగ్‌బాస్ ఫైనల్ వీక్‌లో టాస్క్‌లు, నామినేషన్స్, గొడవలు ఏమీ ఉండవు.. కేవలం హౌస్‌మెట్స్ జర్నీ, వారు ప్రైజ్ మనీతో ఏం చేయబోతున్నారు అనేది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. మధ్యలో కొందరు గెస్టులు హౌస్‌లో ఎంట్రీ ఇచ్చి అలరిస్తారు. ఈ వారం కూడా మా పరివారం గెస్టులు ఇంటి సభ్యులను పలకరిస్తున్నారు. మామగారు సీరియల్‌ నుంచి ఆకర్ష్ - సుహాసినీలు ఎంట్రీ ఇచ్చి ఇంటి సభ్యులను పలకరించారు. ఈ సందర్భంగా వీరు హౌస్‌మేట్స్‌ని వారి ఫస్ట్ బ్రేకప్స్‌ గురించి అడగ్గా ఒక్కొక్కరు ఒక్కో స్టోరీ చెబుతారు.

తర్వాత మంగళవారం నాటి ఎపిసోడ్‌లో బ్రహ్మముడి సీరియల్‌లో కావ్య పాత్ర పోషిస్తున్న దీపిక రంగరాజు హౌస్‌లో అడుగుపెట్టారు. ఆమె వచ్చి రావడంతోనే నిఖిల్ - కావ్యల బ్రేకప్ గురించి అడిగింది. నాకు ప్రేమ ముఖ్యం.. అది ఒరిజినల్ అయితే ఎన్నేళ్లయినా వెయిట్ చేస్తానని నిఖిల్ చెప్పాడు. వెళ్తూ వెళ్తూ నీ కష్టానికి తగిన ప్రతిఫలం తప్పక దక్కుతుందని చెప్పి నిఖిల్‌కి హగ్ ఇచ్చి వెళ్తుంది కావ్య. అనంతరం బిగ్‌బాస్ ముగిశాక ఖచ్చితంగా కలుస్తానని ఆమె చెబుతాడు నిఖిల్.

కాగా.. టాప్ 5లో ఉన్న నిఖిల్, నబీల్, ప్రేరణ, గౌతమ్, అవినాష్‌లలో ఎవరు ఈ సీజన్ విజేత అవుతారన్నది ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ఓటింగ్‌ను పరిశీలిస్తే.. అందరూ ఊహించినట్లుగానే నిఖిల్ - గౌతమ్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. గౌతమ్‌కి (37.41 శాతం), నిఖిల్‌కి (37.19 శాతం) ఓట్లు పోలవ్వగా.. వీరిద్దరి మధ్య కొన్ని పాయింట్ల తేడా మాత్రమే ఉండటం ఉత్కంఠగా నిలిచింది. తర్వాత నబీల్ (11.41 శాతం) ప్రేరణ (11.29 శాతం), అవినాష్ (2.7 శాతం) ఓటింగ్‌తో నిలిచారు. మరి వీరిలో ఎవరు విన్నర్ కానున్నారు? బిగ్‌బాస్ ఫైనల్ డెసిషన్ ఏంటీ ? అనేది త్వరలోనే తేలిపోనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X