Bigg Boss Voting : ఎదురేలేని గౌతమ్. చేతులెత్తేసిన K బ్యాచ్, డేంజర్ జోన్‌లో ఏకంగా ముగ్గురు ?
బిగ్‌బాస్ తెలుగు 8వ సీజన్ విజయవంతంగా 12 వారాలు పూర్తి చేసుకుని 13వ వారంలోకి అడుగుపెట్టింది. మరో మూడు వారాల్లో బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్ ముగియనుంది. దీంతో ఫైనలిస్టులను ఎంపిక చేసే పనికి శ్రీకారం చుట్టారు బిగ్‌బాస్. గత కంటెస్టెంట్స్‌ని హౌస్‌లోకి పంపించి వారితో టికెట్ టూ ఫినాలే టాస్కులు ఆడిస్తున్నారు . ఇప్పటికే అఖిల్ - దేత్తడి హారికలు అలరించగా.. తాజాగా మానస్ - ప్రియాంక జైన్ హౌస్‌లో అడుగుపెట్టాడు. మరి ఈ వారం ఓటింగ్‌లో ఎవరు టాప్‌లో ఉన్నారు? ఎవరు డేంజర్ జోన్‌లో ఉన్నారో చూస్తే:
మానస్- ప్రియాంక జైన్ హౌస్‌లోకి వచ్చి విష్ణుప్రియ - నిఖిల్‌లను పలకరించారు. తనకు కొడుకు పుట్టిన విషయాన్ని వాడికి ధ్రువ అని పేరు పెట్టినట్లు హౌస్‌మెట్స్‌కి చెప్పాడు మానస్. ప్రియాంక .. గౌతమ్, ప్రేరణలతో ముచ్చటించింది. ఆ వెంటనే టికెట్ టూ ఫినాలే టాస్క్‌లు ఆడించాలని బిగ్‌బాస్ వారిద్దరికీ చెప్పాడు. ఇందులో గెలిచిన ప్రేరణ, నబీల్‌లను కంటెండర్‌షిప్ గెలిచేందుకు పోటీదారులుగా ఎంపిక చేశారు. అయితే ఇక్కడే బిగ్‌బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. టాస్క్‌లు ఆడేందుకు నలుగురు ఉండాలని.. మరో ఇద్దరిని మీరే సెలెక్ట్ చేసుకోవాలని చెప్పాడు.

వెంటనే ప్రేరణ - నిఖిల్‌లు మాట్లాడుకుని నిఖిల్ - పృథ్వీలను సెలెక్ట్ చేద్దామని ప్రేరణ చెప్పగా.. పృథ్వీ - అవినాష్‌లైతే బెటర్ అని నబీల్ అంటాడు. దీంతో అతని ప్రపోజల్‌కి ప్రేరణ ఓకే చెబుతుంది. అనంతరం నబీల్ - ప్రేరణ- పృథ్వీ - అవినాష్‌లకి సుడోకు టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. నాది ఫినిష్ అని నబీల్ చెప్పగా.. అందరూ వెళ్లి చూసేసరికి అన్నీ తప్పులే పెట్టాడు. చివరికి అవినాష్ ఈ టాస్క్‌లో గెలిచాడు. మరో గేమ్‌లో స్కోర్ బోర్డ్‌పై బంతిని బ్యాలెన్స్ చేస్తూ రన్స్ కొట్టాలి. ముందు టాస్క్‌లో గెలిచిన అవినాష్‌కి ఎక్కువ బాల్స్ ఇవ్వడంతో ఇందులోనూ గెలిచి కంటెండర్‌షిప్ బ్యాడ్జ్ దక్కించుకున్నాడు. నబీల్‌కి బ్లాక్ బ్యాడ్జ్ రావడంతో అతను ఇక టికెట్ టూ ఫినాలే టాస్క్‌లు ఆడటానికి వీల్లేదు. ఇప్పటికే విష్ణుప్రియకి ఈ తరహా బ్యాడ్జ్ వచ్చిన సంగతి తెలిసిందే.
ఇకపోతే.. 13వ వారం నామినేషన్స్ విషయానికి వస్తే .. ఈ వారం నబీల్, నిఖిల్, ప్రేరణ, విష్ణుప్రియ, పృథ్వీ, అవినాష్, టేస్టీతేజ, గౌతమ్‌లు నామినేషన్స్‌లో ఉన్న సంగతి తెలిసిందే. మెగా చీఫ్ కావడంతో ఒక్క రోహిణి మాత్రమే నామినేషన్స్‌లో లేరు. ఈ నేపథ్యంలో 13వ వారానికి సంబంధించి సోషల్ మీడియాలో అనధికారికంగా జరుగుతున్న ఓటింగ్‌ని ఒకసారి పరిశీలిస్తే . గౌతమ్ కృష్ణ దాదాపు 29 శాతం ఓటింగ్‌తో టాప్ ప్లేస్‌లో నిలిచాడు.

తర్వాత ప్రేరణ (14.92 శాతం), నిఖిల్ (14.24 శాతం), టేస్టీ తేజ (9.16 శాతం), అవినాష్ (8.76 శాతం), నబీల్ (8.21 శాతం), పృథ్వీ (8.02 శాతం), విష్ణుప్రియ (8 శాతం) ఓటింగ్‌తో నిలిచారు. ఎప్పుడు నామినేషన్స్‌లో ఉన్నా టాప్‌లో నిలిచే నబీల్ ఓటింగ్‌లో లీస్ట్‌లో ఉండటం గమనార్హం. పృథ్వీ, విష్ణులతో కలిసి ఈ కుర్రాడు డేంజర్ జోన్‌లో నిలిచారు. ఓటింగ్ లైన్స్ క్లోజ్ కావడానికి ఇంకా సమయం ఉండటంతో ఎలాంటి ఫలితాలు వస్తాయో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











