Bigg Boss Voting : గౌతమ్ ఊచకోత.. దరిదాపుల్లో లేని కన్నడ గ్యాంగ్ , డేంజర్ జోన్‌లో ఎవరంటే?

బిగ్‌బాస్ తెలుగు 8వ సీజన్‌ విజయవంతంగా 12 వారాలు పూర్తి చేసుకుని 13వ వారంలోకి అడుగుపెట్టింది. మరో మూడు వారాల్లో సీజన్‌కు ఎండ్ కార్డ్ పడనుంది. దీంతో విన్నర్ ఎవరు? టాప్ 5లో ఎవరుంటారు అంటూ పెద్ద ఎత్తున డిస్కషన్స్ నడుస్తున్నాయి. సోమవారం నామినేషన్స్ ముగియడంతో ఓటింగ్ ఎలా జరుగుతోంది.? ఎవరు టాప్‌లో ఉన్నారు? 13వ వారం ఎవరు ఎలిమినేట్ కానున్నారు అనే దానిపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ వివరాల్లోకి వెళితే..

యష్మి గౌడ ఎలిమినేట్ అయిన వెంటనే బిగ్‌బాస్ 13వ వారం నామినేషన్స్‌కు శ్రీకారం చుట్టారు. ఎవరైతే ఫైనలిస్టులుగా ఉండకూడదని అనుకుంటున్నారో వారిపై రంగు పోసి నామినేట్ చేయాలని చెప్పాడు బిగ్‌బాస్. ఒక్కో కంటెస్టెంట్‌ ఇద్దరు ఇంటి సభ్యులను నామినేట్ చేయొచ్చని.. మెగా చీఫ్ అయినందున రోహిణిని ఎవ్వరూ నామినేట్ చేయకూడదని ఆదేశించాడు. ముందుగా పృథ్వీ వచ్చి అవినాష్‌ని నామినేట్ చేశాడు.

gautam krishna place top in voting of 13th week of Bigg Boss Telugu 8

విష్ణుప్రియ- రోహిణిల గొడవని మెగా చీఫ్ హోదాలో పట్టించుకోకపోవడాన్ని తప్పబడుతూ తన నామినేషన్‌కి రీజన్ చెప్పాడు. అంతేకాదు .. నబీల్ ఎవిక్షన్ పాస్ వాడకపోయుంటే నువ్వు ఎలిమినేట్ అయ్యేవాడివంటూ హాట్ కామెంట్స్ చేశాడు. తర్వాత నామినేషన్‌ని గౌతమ్‌కి వేశాడు పృథ్వీ. మొత్తంగా ఈ వారం నబీల్ .. గౌతమ్‌, విష్ణుప్రియలని, ప్రేరణ.. విష్ణుప్రియ, గౌతమ్‌లని, పృథ్వీ.. గౌతమ్, అవినాష్‌లని, టేస్టీ తేజ.. పృథ్వీ, విష్ణుప్రియలని, విష్ణుప్రియ.. టేస్టీ తేజ, ప్రేరణలని, గౌతమ్.. నిఖిల్‌, పృథ్వీలని, నిఖిల్.. గౌతమ్‌, ప్రేరణలని, అవినాష్.. పృథ్వీ, విష్ణుప్రియ, రోహిణి.. నబీల్, విష్ణుప్రియలని నామినేట్ చేసింది.

ఈ వారం నబీల్‌ని ఎవరూ నామినేట్ చేయరని అనుకున్నారు. కానీ రోహిణి చివరిలో షాక్ ఇచ్చింది. మొత్తంగా 13వ వారం నబీల్, నిఖిల్, ప్రేరణ, విష్ణుప్రియ, పృథ్వీరాజ్, అవినాష్, గౌతమ్, టేస్టీతేజలు నామినేషన్స్‌లో ఉన్నారు. అంటే రోహిణి మినహా మొత్తం ఇంటి సభ్యులు అన్నమాట.

ఇక 13వ వారానికి సంబంధించి సోషల్ మీడియాలో అనధికారికంగా జరుగుతున్న ఓటింగ్‌ని ఒకసారి పరిశీలిస్తే .. గౌతమ్ కృష్ణ దాదాపు 33 శాతం ఓటింగ్‌తో టాప్ ప్లేస్‌లో నిలిచాడు. తర్వాత ప్రేరణ (19.14 శాతం), నిఖిల్ (11.37 శాతం), టేస్టీ తేజ (9.80 శాతం), అవినాష్ (6.97 శాతం), నబీల్ (6.45 శాతం), పృథ్వీ (6.27 శాతం), విష్ణుప్రియ (6.23 శాతం) ఓటింగ్‌తో నిలిచారు. ప్రస్తుతానికి ప్రేమ పక్షులు పృథ్వీ, విష్ణుప్రియలు డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఓటింగ్ లైన్స్ క్లోజ్ కావడానికి ఇంకా సమయం ఉండటంతో ఎలాంటి ఫలితాలు వస్తాయో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X