Bigg Boss Voting : ఓటింగ్‌లో గౌతమ్ ఊచకోత .. చేతులెత్తేసిన నిఖిల్ , డేంజర్ జోన్‌లో ఎవరంటే?
బిగ్‌బాస్ తెలుగు 8 విజయవంతంగా 13వ వారం పూర్తి చేసుకుని 14వ వారంలోకి అడుగుపెట్టింది. మరికొద్దివారాల్లో సీజన్‌కు ఎండ్ కార్డ్ పడనుంది. ఈ వీక్‌తో విజేత ఎవరన్నది ఓ క్లారిటీ రానుంది. హౌస్‌మెట్స్ సైతం తమలో ఎవరు ఈ సీజన్ విన్నర్ అవుతారో తెలుసుకోవాలని టెన్షన్‌తో ఉన్నారు. ఇక ఈ వారం నామినేషన్స్‌లో బిగ్‌బాస్ ట్విస్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరి సోషల్ మీడియాలో జరుగుతున్న ఓటింగ్‌లో ఎవరు టాప్‌లో ఉన్నారు? ఎవరు డేంజర్ జోన్‌లో ఉన్నారో పరిశీలిస్తే.
ఈ వీక్ నామినేషన్స్ ఉండవని.. అంతా ప్రేక్షకుల ఇష్టప్రకారమే జరుగుతుందని బిగ్‌బాస్ ఆదివారం నాడే ప్రకటించిన సంగతి తెలిసిందే. మీలో ఎవరు టాప్ 5లోకి రావాలన్నది ఆడియన్సే నిర్ణయిస్తారని చెప్పాడు. అనంతరం ఇంటి సభ్యుల ఫోటోలను గార్డెన్ ఏరియాలో పెట్టి షాకిచ్చాడు బిగ్‌బాస్. నామినేషన్స్ నుంచి నేరుగా సేవ్ అయ్యే అవకాశం ఇవ్వడంతో పాటు సెకండ్ ఫైనలిస్ట్‌గా వెళ్లేందుకు ఛాన్స్ ఇచ్చాడు. ఫినాలే రేసు నుంచి ఎవరిని తప్పించాలని అనుకుంటున్నారో తగిన కారణం చెప్పి వాళ్ల ఫోటోని కాల్చేయాలని.. చివరికి ఎవరి ఫోటో మిగులుతుందో వారు నామినేషన్స్ నుంచి సేవ్ అవ్వడంతో పాటు ఫైనల్‌లో అడుగుపెడతారని అనౌన్స్ చేశాడు బిగ్‌బాస్.

తొలుత అవినాష్.. విష్ణుప్రియ ఫోటోను , విష్ణుప్రియ.. గౌతమ్ ఫోటోను కాల్చేశారు. అనంతరం గౌతమ్ వచ్చి నిఖిల్ ఫోటో కాల్చేయడంతో పెద్ద రాద్ధాంతం జరిగింది. ఈ క్రమంలో గౌతమ్ - నిఖిల్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. గౌతమ్‌ని ఎక్కడ కెలకాలో అక్కడ కెలకడంతో డాక్టర్ బాబు కంట్రోల్ తప్పిపోయాడు. తోటి కంటెస్టెంట్స్ ఎంతగా సర్ది చెబుతున్నా ఇద్దరూ ఎక్కడా తగ్గలేదు. తర్వాత నిఖిల్ వెళ్లి రోహిణి ఫోటోను కాల్చేసి ఆమెను ఫినాలే రేసు నుంచి తప్పించేశాడు.
చివరికి ప్రేరణ - నబీల్ మాత్రమే మిగలడంతో వారిద్దరినీ బిగ్‌బాస్ యాక్టివిటీ ఏరియాకు పిలుస్తాడు. మీ ఎదుట రెండు బ్లాంక్ చెక్‌లు ఉన్నాయని.. మీ ఇద్దరిలో ఒకరి మాత్రమే ఫైనల్‌కి వెళ్లే ఛాన్స్ ఉంటుందని చెబుతాడు. మీరు ఫినాలేలో అడుగుపెట్టాలంటే బ్లాంక్ చెక్ మీద రూ. 15 లక్షల వరకు ఎంతైనా రాయాలని.. ఎవరైతే ఎక్కువ మొత్తం రాస్తారో వారే సెకండ్ ఫైనలిస్ట్ అని చెబుతాడు. కానీ మీరు ఎంతైతే అమౌంట్ రాస్తారో.. అది విన్నర్ ప్రైజ్ మనీ నుంచి కట్ అవుతుందని కండీషన్ పెట్టాడు బిగ్‌బాస్. దీంతో వారిద్దరూ కొద్దిసేపు ఆలోచించి ఓ ఫిగర్ రాశారు.
ఆ వెంటనే బిగ్‌బాస్ మరో ట్విస్ట్ ఇచ్చారు. నబీల్ - ప్రేరణ ఇద్దరినీ ఇంటి సభ్యుల ముందు నిలబెట్టి వీరితో ఆ చెక్కులను చింపించేలా చేయాలని చెబుతాడు. లేదంటే వారు రాసిన మొత్తం విన్నర్ ప్రైజ్ మనీ నుంచి కట్ అవుతుందని అంటాడు. ఇంటి సభ్యుల సూచన మేరకు ఇద్దరూ చెక్‌లను చింపేయడానికి ఒప్పుకుంటారు. అయితే ఓసారి చెక్‌లను చెక్ చేద్దామని చూడగా.. ప్రేరణ రూ. 4.30 లక్షలు, నబీల్ బిగ్‌బాస్ చెప్పిన మొత్తం రూ. 15 లక్షలు రాసేశాడు.
ఇదిలాఉండగా .. బిగ్‌బాస్ తెలుగు 8లో 14వ వారం నామినేషన్స్ విషయానికి వస్తే . అవినాష్ తప్పించి నిఖిల్, నబీల్, ప్రేరణ, విష్ణుప్రియ, గౌతమ్, రోహిణిలు నేరుగా నామినేట్ అయ్యారు. సోషల్ మీడియాలో అనధికారికంగా జరుగుతున్న ఓటింగ్‌ను చూస్తే.. గౌతమ్ 32.21 శాతం మరోసారి ఓటింగ్‌తో అగ్రస్థానంలో నిలిచాడు. తర్వాత నిఖిల్ (20.27 శాతం), ప్రేరణ (14.85 శాతం), రోహిణి (12.38 శాతం), (విష్ణుప్రియ 10.21 శాతం) నబీల్ (10.08 శాతం) ఓటింగ్‌తో నిలిచారు. ప్రస్తుతానికి విష్ణుప్రియ, నబీల్‌లు డేంజర్ జోన్‌లో ఉన్నారు. అయితే ఓటింగ్ లైన్స్ క్లోజ్ కావడానికి ఇంకా టైం ఉండటంతో రిజల్ట్స్ ఎలా ఉంటాయో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











