Bigg Boss Telugu 7: ప్రియాంక జోలికి రావద్దంటూ అమర్‌దీప్‌కు గౌతమ్ వార్నింగ్.. ఎందుకో తెలుసా?
బిగ్ బాస్ తెలుగు సీజన్ షో ఏ ముహూర్తాన ప్రారంభం అయిందో తెలియదు కానీ అద్భుతమైన రెస్పాన్స్ తో దూసుకెళ్తోంది. ముఖ్యంగా బిగ్ బాస్ నిర్వాహకులు అదిరిపోయే టాస్క్ లు ఇస్తూ.. ఆటను మరింత రసవత్తరంగా మారుస్తున్నారు. టికెట్ టు ఫినాలే టాస్క్ వల్ల అయితే ఇంట్లో చాలానే గొడవలు జరుగుతున్నాయి. ఇన్నాళ్లూ ఒకే గ్రూపుగా ఉండి గేమ్ ఆడిన స్పా బ్యాచ్ లో విపరీతమైన గొడవలు చెలరేగుతున్నాయి. ముఖ్యంగా అమర్ దీప్, ప్రియాంక జైన్ మధ్య కోల్డ్ వారే సాగుతోంది. ఈక్రమంలోనే ప్రియాంక జైన్ కు తన సోదరుడు గౌతమ్ కృష్ణ అండగా నిలబడుతున్నాడు.
ఇక తాజాగా జరిగిన ఎపిసోడ్ లో అయితే ప్రియాంక జైన్ కోసం గౌతమ్ కృష్ణ.. అమర్ దీప్ కు గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇంకోసారి నువ్వు ప్రియాంకను ఏమీ అనొద్దని, ఆమె జోలికి కూడా రావద్దంటూ హెచ్చరించాడు. అలా ఎందుకు అన్నాడు, ఏం జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. షఓ మొదటి వారంలో బిగ్ బాస్ ఇంట్లో అడుగు పెట్టిన అమర్ దీప్, ప్రియాంక జైన్, శోభా శెట్టిలు... ముగ్గురూ కలిసి గేమ్ ఆడుతున్నారు. ఇన్నాళ్లూ వారు ముగ్గురే ఓ జంటగా ఉండి మిగతా కంటెస్టెంట్లను టార్గెట్ చేస్తూ గేమ్ ఆడారు. దాదాపు 12 వారాల పాటు వీరి గేమ్ బాగానే సాగింది.

అయితే 13వ వారంలో అడుగు పెట్టినప్పటి నుంచి వీరి మధ్య చిన్న చిన్న గొడవలు వస్తున్నాయి. ముఖ్యంగా టికెట్ టు ఫినాలే టాస్క్ నుంచి వీరి మధ్య గొడవలు ప్రారంబం అయ్యాయి. గాలం వెయ్ బాలు లాగెయ్ టాస్క్ లో అమర్ దీప్.. ఓ స్ట్రాటెజీ వాడాడు. బాల్ ను లాగిన తర్వాత వారి వద్ద నుంచి లాక్కుంటూ గేమ్ ఆడాడు. అలా యావర్, ప్రియాంకల వద్ద నుంచి పైట్ చేసి మరీ లాక్కునే ప్రయత్నం చేశాడు. ప్రియాంక నుంచి బాల్ లాక్కునే సరికి ఆమె చాలా హర్ట్ అయింది. ఆ తర్వాత కూడా అతను ఓదార్చకుండా ఇది గేమ్ అంటూ సర్దిచెప్పాడు.

అయితే ఈ తర్వాతి టాస్క్ లలో తనను మోసం చేసిన.. అంటే ఓడిపోయేలా చేసిన అమర్ దీప్ కు కాకుండా ఆమె తనకు సపోర్టింగ్ గా నిలిచిన గౌతమ్ కృష్ణకు తన పాయింట్లు ఇచ్చేసింది. దీంతో అమర్ చాలా హర్ట్ అయ్యాడు. రోజూ ఇదే విషయాన్ని ఆమె వద్ద ప్రస్తావిస్తూ.. ఆమెను బాధ పెడుతున్నాడు. గౌతమ్ తో తన బాధను చెప్పుకుంటూ ప్రియాంక చాలా ఫీల్ అవుతోంది. అయితే టికెట్ టు ఫినాలే టాస్క్ లో చివరకు చేరుకున్న అంబటి అర్జున్, అమర్ దీప్ లలో.. గౌతమ్ ఎవరో ఒకరికి తన పాయింట్లు ఇచ్చేయాలి. అయితే ప్రియాంక అమర్ కు పాయింట్లు ఇవ్వాలని చెప్పింది.

అదే విషయాన్ని గౌతమ్.. అంబటి అర్జున్ కు చెబుతూ.. ప్రియాంక నాకు పాయింట్లు ఇచ్చింది కదా.. వాటిని అమర్ కు ఇవ్వమని తను అంటుంది అనగా.. అర్జున్ నీ ఇష్టం అని చెప్పాడు. బిగ్ బాస్ కు.. తన పాయింట్లు అమర్ దీప్ కు ఇస్తున్నట్లు గౌతమ్ చెప్పాడు. ఆ తర్వాత అమర్ దీప్ వైపు తిరిగి.. ఒరేయ్ నీవు ఇంకోసారి ప్రియాంకను ఏమైనా అంటే బాగుండదని హెచ్చరించాడు. ప్రియాంక జోలికి రావద్దని సూచించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే పూర్తిగా ఏం జరిగిందో తెలియాలంటే ఈరోజుటి ఎపిసోడ్ చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











