Bigg Boss Voting : బుల్లెట్‌లా గౌతమ్ .. పడిపోతున్న నబీల్ గ్రాఫ్, డేంజర్ జోన్‌లో ఎవరంటే?
బిగ్‌బాస్ తెలుగు 8 విజయవంతంగా 13 వారాలు పూర్తి చేసుకుని 14 వారంలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు? గత వారం మాదిరిగానే డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా? టాప్ 5లో ఎవరెవరు ఉండబోతున్నారు? టికెట్ టూ ఫినాలేలో ఎంత మంది ఛాన్స్ దక్కించుకున్నారు? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ వారం ఓటింగ్‌లో ఎవరు టాప్‌లో ఉన్నారు? ఎవరు డేంజర్ జోన్‌లో ఉన్నారో చూస్తే :
ఇప్పటికే అవినాష్ టికెట్ టు ఫినాలే టాస్క్ ద్వారా ఫైనల్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇక తాను నోరు జారినందుకు గాను నిఖిల్‌కు గౌతమ్ సారీ చెప్పాడు. అటు నిఖిల్ కూడా అతనికి, ఇతర హౌస్‌మెట్స్‌కి క్షమాపణలు చెప్పడంతో కాసేపు హౌస్‌లో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. ఇక సీజన్ ఫైనల్‌కు రావడంతో ప్రేక్షకులను ఓటింగ్ అప్పీల్ చేసుకునేందుకు కంటెస్టెంట్స్‌కి అవకాశం కల్పించాడు బిగ్‌బాస్. ఇందుకోసం క్రాసింగ్ పాత్ ఛాలెంజ్‌ను ఇచ్చారు.

అయితే ఈ టాస్క్‌లో నబీల్ చిందర వందరగా తాడుని పోల్‌కి చుట్టడంతో ప్రేరణ అభ్యంతరం చెప్పింది. నేను సరిగానే ఆడానని, నువ్వు ఎప్పుడూ ఇలాగే గొడవ పెట్టుకుంటావంటూ రంకెలు వేశాడు . నబీల్ అరుపుల దెబ్బకి ప్రేరణ చెవులు మూసుకుంది. గొడవ శృతిమించే పరిస్ధితులు రావడంతో బిగ్‌బాస్ కల్పించుకుని మీలో ఎవరు గెలిచారో మీరే డిస్కస్ చేసుకోమని చెబుతాడు. చివరికి అంతా కలిసి నబీల్ గెలిచినట్లు చెప్పగా.. ప్రేరణ కన్నీటి పర్యంతమైంది. దీంతో ప్రేరణకు మద్ధతు బిగ్‌బాస్ బరిలోకి దిగి మీ నిర్ణయం సరిచూసుకోమని చెప్పగా.. అంతా ప్రేరణ గెలిచిందని అంటారు.
తర్వాత టర్ఫ్ వార్ అనే ఛాలెంజ్ ఇచ్చాడు. దీని ప్రకారం ఇంటి సభ్యులు తోస్తున్నా కంట్రోల్ చేసుకుని సర్కిల్ లోపలే ఉండి ఎవరైతే చివరి వరకు లోపలే ఉంటారో వారే గెలిచినట్లు. చివరి వరకు విష్ణు ప్రియ - నబీల్ ఉండటంతో వారు గెలిచినట్లు చెప్పి ట్విస్ట్ ఇచ్చాడు. అదేంటంటే ఇద్దరిలో ఒకరు మాత్రమే ప్రేక్షకులతో ఓట్లు అప్పీల్ చేసుకునే ఛాన్స్ ఉందన్నాడు. ఈ ఎంపిక బాధ్యతని హౌస్‌మెట్స్ చేతుల్లో పెట్టగా.. అంతా నబీల్‌ని సెలక్ట్ చేశారు. 2016 నుంచి నేటి వరకు వీడియోలు చేస్తున్నా తనకు సరైన బ్రేక్ రాలేదని .. బిగ్‌బాస్ రూపంలో తనకు అవకాశం వచ్చిందని, తనకు మద్ధతుగా నిలబడాలని నబీల్ ఆడియన్స్‌ని కోరాడు. అనంతరం సెలబ్రెటీ చెఫ్ సంజయ్ తుమ్మా హౌస్‌లోకి అడుగుపెట్టి అందరికీ స్పెషల్ ఫుడ్ పెట్టాడు.

ఇదిలాఉండగా .. బిగ్‌బాస్ తెలుగు 8లో 14వ వారం నామినేషన్స్ విషయానికి వస్తే . అవినాష్ తప్పించి నిఖిల్, నబీల్, ప్రేరణ, విష్ణుప్రియ, గౌతమ్, రోహిణిలు నేరుగా నామినేట్ అయ్యారు. సోషల్ మీడియాలో అనధికారికంగా జరుగుతున్న ఓటింగ్‌ను చూస్తే.. గౌతమ్ 27.22 శాతం మరోసారి ఓటింగ్‌తో అగ్రస్థానంలో నిలిచాడు. తర్వాత నిఖిల్ (21.25 శాతం), ప్రేరణ (15.84 శాతం), రోహిణి (12.75శాతం), (విష్ణుప్రియ 12.15 శాతం) నబీల్ (10.79 శాతం) ఓటింగ్‌తో నిలిచారు. ప్రస్తుతానికి విష్ణుప్రియ, నబీల్‌లు డేంజర్ జోన్‌లో ఉన్నారు. అయితే ఓటింగ్ లైన్స్ క్లోజ్ కావడానికి ఇంకా టైం ఉండటంతో రిజల్ట్స్ ఎలా ఉంటాయో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











