Bigg Boss Final Voting : వెనుకబడ్డ నిఖిల్, అందనంత ఎత్తులో గౌతమ్ .. ఇక అంతా బిగ్‌బాస్ చేతుల్లోనే?
దాదాపు 100 రోజులుగా తెలుగు వారికి వినోదాన్ని పంచుతున్న బిగ్‌బాస్ తెలుగు 8కి మరో 48 గంటల్లో ఎండ్ కార్డ్ పడనుంది. దీంతో ఈ సీజన్ విజేత ఎవరు కానున్నారు? విజేతకు ప్రైజ్ మనీ ఎంత ఇస్తారు? గ్రాండ్ ఫినాలేకు చీఫ్ గెస్ట్ ఎవరు? స్టేజ్‌పై ఎలాంటి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశారు? లాంటి అంశాలపై సర్వత్రా డిస్కషన్ నడుస్తోంది. అన్నింటికి మించి బిగ్‌బాస్ ఫైనల్ ఓటింగ్ ఎలా జరుగుతోంది? ఎవరు లీడ్‌లో ఉన్నారో ఒకసారి పరిశీలిస్తే:
14 మందితో తొలుత బిగ్‌బాస్ తెలుగు 8 ప్రారంభమైంది. సీజన్ మధ్యలో 8 మంది కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లో అడుగుపెట్టారు. ఇప్పటి వరకు బెజవాడ బేబక్క, ఆర్జే శేఖర్ భాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల, కిర్రాక్ సీత, నాగ మణికంఠ, ఆదిత్య ఓం, నైనిక, మెహబూబ్, హరితేజ, గంగవ్వ, విష్ణుప్రియ, రోహిణి, పృథ్వీరాజ్ శెట్టి, టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యారు. దీంతో నిఖిల్, నబీల్, ప్రేరణ, అవినాష్, గౌతమ్‌లు టాప్ 5లో నిలిచి గ్రాండ్ ఫినాలేలో అడుగుపెట్టారు. వీరిలో ఒకరు బిగ్‌బాస్ తెలుగు 8 విజేత కానున్నారు.

బిగ్‌బాస్ తెలుగు 8లో 15వ వారం బుల్లితెర నటులు సుహాసినీ, ఆకర్ష్, దీపిక రంగరాజులు హౌస్‌లో అడుగుపెట్టి వారిని పలకరించారు. ఇక గురువారం నాటి ఎపిసోడ్‌లో అవినాష్ - నబీల్‌లు పాలకూర బజ్జీలు వేసి బిగ్‌బాస్‌కి పంపించారు. ఇంతలో వంటలక్క సీరియల్ టీమ్ హౌస్‌లో అడుగుపెట్టి ముచ్చట్లు చెప్పారు. వీళ్లతో పోటీ పడి గెలిస్తే రూ. 10,928 వేలు ప్రైజ్ మనీకి యాడ్ అవుతాయని చెప్పి ఓ టాస్క్ ఇస్తాడు బిగ్‌బాస్. ఇందులో ప్రేరణ - అవినాష్ గెలిచి ఆ డబ్బును ప్రైజ్ మనీకి యాడ్ చేస్తారు. వంటలక్క టీమ్ వెళ్లగానే.. మగువా ఓ మగువా సీరియల్ టీమ్ ఎంట్రీ ఇస్తుంది. వీళ్లతో ఓ టాస్క్ పెట్టిన బిగ్‌బాస్.. వీరితో గెలిస్తే రూ. 10,010 ప్రైజ్ మనీకి యాడ్ చేస్తానని చెబుతాడు. ప్రేరణ - గౌతమ్ అలవోకగా ఈ టాస్క్ గెలిచి ఆ డబ్బును బహుమతిలో కలుపుతారు.
ఈ రోజు అవినాష్ జర్నీని చూపించాడు బిగ్‌బాస్. హౌస్‌లో అడుగుపెట్టిన నాటి నుంచి అవినాష్ వేసిన పంచ్‌లు, జోకులతో ఈ ప్రోమో నిండిపోయింది. అవన్నీ చూసుకుని ఎమోషనల్ అయిన అవినాష్.. తాను బిగ్‌బాస్ గెలుస్తానో లేదో కానీ.. మనిషిగా గెలిచానని కామెంట్ చేశాడు. కమెడియన్స్‌ని కమెడియన్స్‌లాగే చూస్తారని, తాను ఇంత వినోదాన్ని పంచినా నన్ను ఎంటర్‌టైనర్ అనే అన్నారని అవినాష్ సుతిమెత్తగా చురకలు వేశాడు. సీజన్‌లో నన్ను ప్రజలు గెలిపిస్తారని అనుకుంటున్నానని అందరికీ థ్యాంక్స్ చెప్పి బయటికి వచ్చేశాడు అవినాష్.
కాగా.. టాప్ 5లో ఉన్న నిఖిల్, నబీల్, ప్రేరణ, గౌతమ్, అవినాష్‌లలో ఎవరు బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్ విజేత అవుతారన్నది ఉత్కంఠగా మారింది. బయట ఏ ఇద్దరు కలిసినా నిఖిల్ - గౌతమ్‌లలో ఎవరు విన్నర్ కాబోతున్నారో చర్చించుకుంటున్నారు. ఈ సీజన్ విజేత వీరిద్దరిలో ఒకరని అందరికీ క్లారిటీ వచ్చేసింది. కానఆ ఒక్కరు ఎవరు అనేది ఆదివారం తేలనుంది. ఇక సోషల్ మీడియాలో జరుగుతున్న ఓటింగ్‌లో గౌతమ్ (42 శాతం) అందనంత ఎత్తులో నిలిచాడు. ఇతనికి గట్టి పోటీ ఇస్తున్న నిఖిల్‌కి (36.82 శాతం) ఓట్లు పోలయ్యాయి. తర్వాత నబీల్ (11 .01శాతం) ప్రేరణ (8.25 శాతం), అవినాష్ (3.87 శాతం) ఓటింగ్‌తో నిలిచారు. మరి వీరిలో ఎవరు సీజన్ 8 విన్నర్ కానున్నారు? బిగ్‌బాస్ ఫైనల్ డెసిషన్ ఏంటీ ? అనేది త్వరలోనే తేలిపోనుంది.


Click it and Unblock the Notifications











