నా స్కర్ట్ లో అతడు చేయిపెట్టి .. టీవీ నటికి చేదు అనుభవం
రంగుల రాట్నం లాంటి చిత్ర పరిశ్రమలో వెలిగిపోవాలని, తనకు జనమంతా జేజేలు పలకాలని కలలుగంటూ ఎంతోమంది అమ్మాయిలు ఊబిలో చిక్కుకుంటున్నారు. అవకాశాలు పేరుతో అమ్మాయిలను ట్రాప్ చేసి వారి జీవితాలను నాశనం చేస్తున్న ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. నిత్యం ఎవరో ఒక నటి తమ జీవితంలో ఎదురైన ఇబ్బందులను బయటపెడుతూ పైకి పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్నా వారి నిజ స్వరూపాలు బయటపెడుతున్నారు.

జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్‌తో కలకలం
వెండితెర మీదే కాదు.. బుల్లితెర ఇండస్ట్రీలోనూ క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు వంటివి చోటు చేసుకుంటున్నాయని నటీమణులు వాపోతున్నారు. మీటూ ఉద్యమం సమయంలో ఎంతో మంది బుల్లితెర నటీమణులు తమ జీవితాలు ఎలా నాశనమయ్యాయో బహిర్గతం చేశారు. ఇక గతేడాది మలయాళ చిత్ర పరిశ్రమలో జస్టిస్ హేమ్ కమిటీ రిపోర్ట్ ప్రకంపనలు సృష్టించింది. ఈ కమిటీ వంటిది తమకు కూడా కావాలని పలు పరిశ్రమలకు చెందిన నటీమణులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
చిన్నప్పుడే హీరోయిన్లపై లైంగిక వేధింపులు
అయితే కొందరు హీరోయిన్లు తమ చిన్నతనంలోనే లైంగిక వేధింపులను ఎదుర్కొన్నట్లు సంచలనం సృష్టించారు. కుటుంబ సభ్యులు, తెలిసిన వారే తమపై దారుణానికి ఒడిగట్టారని వాపోయారు. ఒకప్పటి టాప్ హీరోయిన్ ఖుష్బూ అయితే తన తండ్రే తమపై వేధింపులకు పాల్పడినట్లు చెప్పుకుని కన్నీటి పర్యంతమయ్యారు. వెలుగులోకి వచ్చినవి కొన్నే.. కానీ బయటికి రానివి ఇంకెన్నో. తాజాగా బుల్లితెర నటి గౌతమీ కపూర్ తన చిన్నతనంలో జరిగిన భయానక ఘటన గురించి బయటపెట్టారు.
హిందీ బుల్లితెరపై క్వీన్‌గా గౌతమీ కపూర్
గౌతమీ కపూర్ గురించి హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలియని వారుండరు. సాటర్‌డే సస్పెన్స్, ఫ్యామిలీ నెం 1, సీఐడీతో ఆమె దుమ్మురేపారు. స్టార్ ప్లస్‌లో ప్రసారమైన కేహ్తా హై దిల్‌లో జయ పాత్రతో గౌతమీ బాగా పాపులర్ అయ్యారు. ఆ తర్వాత ఘర్ ఏక్ మందిర్ సీరియల్‌లో లీడ్ రోల్ పోషించి ఆకట్టుకున్నారు. ఈ సీరియల్ చేస్తున్న సమయంలోనే నటుడు రామ్ కపూర్‌తో పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ రెండేళ్ల డేటింగ్ తర్వాత 2003లో ప్రేమికుల దినోత్సవం రోజున పెళ్లి పీటలెక్కారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. అయితే రామ్ కపూర్‌తో పెళ్లికి ముందే ఈమెకు మాధుర్ ష్రాఫ్‌తో విడాకులు అయ్యాయి.
ఆ వ్యక్తి నా స్కర్ట్‌లో చేయిపెట్టి
50 ప్లస్‌లోనూ చెక్కు చెదరని గ్లామర్‌తో మెరిసిపోతున్న గౌతమీ కపూర్ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. గతేడాది గ్యారహ్ గ్యారహ్ అనే వెబ్ సిరీస్‌లో నటించిన గౌతమీ కపూర్ కొత్తగా ఏ ప్రాజెక్ట్‌కు కమిట్ కాలేదు. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గౌతమీ తన చిన్నతనంలో జరిగిన సంఘటనను బయటపెట్టారు. తనకు 12 ఏళ్ల వయసులో ముంబైలోని ఓ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నానని .. ఓ రోజున స్కూల్ నుంచి బస్సులో ఇంటికి వస్తున్నానని తెలిపారు. ఈ సమయంలో ఓ వ్యక్తి తనను అసభ్యంగా తాకుతూ తన స్కర్ట్ లోపల చేయి పెట్టాడని.. దీంతో భయపడిన తాను వెంటనే బస్సు దిగి వెల్లిపోయానని గౌతమి వెల్లడించారు.
డౌట్ వస్తే పెప్పర్ స్ప్రే కొట్టండి
ఈ విషయాన్ని తన తల్లికి చెప్పగా ఆ వ్యక్తిని చెంపదెబ్బ కొట్టాల్సిందని.. ఎప్పుడూ భయపడొద్దని అమ్మ ధైర్యం చెప్పిందని ఆమె తెలిపారు. ఇలాంటి అనుభవం మీకు ఎదురైతే వెంటనే వారి చేతిని గట్టిగా పట్టుకుని బిగ్గరగా అరవాలని,పెప్పర్ స్ప్రేను ఆగంతకుండి ముఖంపై కొట్టాలని గౌతమీ సలహా ఇచ్చారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











