Bigg Boss 7 Telugu: షోలో అసభ్య సన్నివేశం.. అవి పెరగడానికి ఇంజెక్షన్.. కంటెస్టెంట్‌ బాడీపై దారుణంగా!

బుల్లితెర చరిత్రలోనే అసాధారణ రెస్పాన్స్‌తో సూపర్ సక్సెస్ అయింది బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ చూడని కాన్సెప్టుతో వచ్చినా.. ఈ ప్రోగ్రామ్‌కు భారీ స్థాయిలో స్పందనను అందించారు. తద్వారా సూపర్ డూపర్ హిట్‌ షోగా మార్చేశారు. అందుకే ఇది రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోయింది. ఈ క్రమంలోనే గత ఆదివారం ఏడో సీజన్ కూడా అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ఒకరి బాడీ గురించి మరొకరు కామెంట్ చేశారు. అసలేం జరిగింది? ఆ పూర్తి వివరాలు మీరే చూడండి!

ఎంతో గ్రాండ్‌గా ఏడో సీజన్:బిగ్ బాస్ సీజన్ తెలుగులో ఎప్పుడు ప్రారంభం అయినా దానికి అదిరిపోయే స్పందన వస్తూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా ప్రీమియర్ ఎపిసోడ్‌ ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. అలాగే, గత ఆదివారం సాయంత్రం ఏడో సీజన్ కూడా అంచనాలకు తగ్గట్లుగానే మొదలైంది. ఇందులో కంటెస్టెంట్ల ఆటపాటలు, కొత్త టాస్కులతో ఎంతో సందడిగా సాగిపోయింది.

Gautham Krishna About Prince Yawar Body Transformation In Bigg Boss 7 Telugu Show

ఆరంభం నుంచే ఆసక్తిగా:బిగ్ బాస్ షో అంటే సాధారణంగా ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు ఉంటాయి. అందుకు అనుగుణంగానే ఏడో సీజన్‌పై ఆరంభం నుంచే భారీ బజ్ ఏర్పడింది. దీనికి తగ్గట్లుగానే దీన్ని ఉల్టా పుల్టా అంటూ సరికొత్త కంటెంట్, ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లతో నడుపుతూ ఆసక్తిని పెంచుతూనే ఉన్నారు. ప్రీమియర్ ఎపిసోడ్‌ నుంచి ఈ షో ఏ రేంజ్‌లో ఉండబోతుంది అనేది స్పష్టంగా చూపించారు.

చాలా మంది.. హైలైట్‌గా:బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి పద్నాలుగు మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా అడుగు పెట్టారు. అందులో ఏడుగురు మగవాళ్లు ఉండగా.. వీరిలో ఇద్దరు మాత్రం బాడీ బిల్డర్లుగా హైలైట్ అయ్యారు. వాళ్లే ప్రిన్స్ యావర్, గౌతమ్ కృష్ణ. ఇందులో మొదటి వ్యక్తి ఫిట్‌నెస్ ఫ్రీక్‌గా చాలా ఏళ్ల నుంచి బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ చేస్తున్నాడు. రెండో వ్యక్తి డాక్టర్‌ నుంచి యాక్టర్‌గా మారి బాడీని పెంచేశాడు.

రతికా టాస్క్.. తేజ రచ్చ:బిగ్ బాస్ ప్రీమియర్ ఎపిసోడ్‌లో రతికా రోజ్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే సమయంలో ఆమెకు నాగార్జున బ్రోకెన్ హార్ట్ బొమ్మను ఇచ్చాడు. దానితో ఈ బ్యూటీ తనకు సీక్రెట్ టాస్క్ ఇచ్చారని పలువురితో చెప్పింది. మొత్తానికి టేస్టీ తేజను ఆ టాస్క్ చేసేందుకు ఒప్పించింది. దీని ప్రకారం.. అతడు ప్రిన్స్ యావర్, గౌతమ్ కృష్ణ మధ్య గొడవ పెట్టడానికి రెడీ అయిపోయాడు.

షో చేస్తున్నావ్ అన్నాడు:సోమవారం జరిగిన ఎపిసోడ్‌లో టేస్టీ తేజ తన సీక్రెట్ టాస్కును తెలివిగా మొదలు పెట్టాడు. ఇందులో భాగంగానే ప్రిన్స్ యావర్ దగ్గరకు వచ్చి 'నిన్ను ఆ గౌతమ్ అన్న మాట బాధగా అనిపించింది బ్రో. నువ్వు బాగా షో చేస్తున్నావంట. బాడీ చూపించి బిల్డప్ కొడుతున్నావంట' అంటూ లేనిపోనివి అన్నీ చెప్పాడు. అయినా ప్రిన్స్ మాత్రం చాలా కామ్‌గా ఉండిపోయాడు.

బాడీ కోసం ఇంజెక్షన్లని:ఆ తర్వాత టేస్టీ తేజ వచ్చి గౌతమ్ కృష్ణతో 'అసలు ప్రిన్స్‌కు నీ గురించి ఎందుకు బ్రో. నువ్వు ఇమిటేటర్ అని అంటున్నాడు. అతడు బాడీ చూపిస్తుంటే ఓర్చుకోలేక నువ్వు కూడా చూపిస్తున్నావ్ అంటున్నాడు' అని చెప్పాడు. దీంతో గౌతమ్‌ 'నేను డాక్టర్‌ను. నా బాడీ సహజమైన పద్దతిలో వచ్చింది. అతడిలా బాడీ పెరగడానికి ఇంజెక్షన్లు చేయించుకోలే' అని అన్నాడు.

నామినేషన్స్‌తో నిజం:సోమవారం ఎపిసోడ్‌లో టేస్టీ తేజ వాళ్లిద్దరికీ పుల్లలు పెట్టడంతో ఇది నామినేషన్స్ వరకూ వచ్చింది. ప్రిన్స్ వంతు వచ్చినప్పుడు 'గౌతమ్ నన్ను ఇలా అన్నాడని తేజ చెప్పాడు' అని అన్నాడు. అది చూసిన గౌతమ్‌కు సీన్ అర్థం అయింది. ఆ తర్వాత బయట దీనిపై పంచాయతీ పెట్టగా.. తేజ కావాలనే చేసినట్లు తేలింది. దీంతో గౌతమ్, ప్రిన్స్ ఒకరికొకరు రియలైజ్ అయిపోయారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X