Bigg Boss Telugu 7: శివాజి బండారం బయటపెట్టిన గౌతమ్.. నాగార్జునతో తేల్చుకుంటా అంటూ బిగ్ బాస్‌కే షాక్
Bigg Boss Telugu 7: బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ షో ఆధారంగా వచ్చి.. ఇండియాలోనూ సూపర్ సక్సెస్ అయిందే బిగ్ బాస్. ముందుగా హిందీలో మొదలైన ఈ కార్యక్రమం.. ఆ తర్వాత చాలా భాషల్లోకి వచ్చింది. ఇందులో భాగంగానే తెలుగులోకి కూడా పరిచయం అయింది. మన దగ్గర చాలా తక్కువ సమయంలోనే సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో నిర్వహకులు వరుసగా సీజన్లను నడుపుతున్నారు. ఇలా ఇప్పుడు ఏడో దాన్ని ప్రసారం చేస్తున్నారు. ఇక, ఇందులో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో గౌతమ్ కృష్ణ ఊహించని విధంగా ప్రవర్తించాడు. అది మీరే చూడండి!
రంజుగా సాగుతోన్న ఏడో సీజన్:ప్రారంభానికి ముందే భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకున్న బిగ్ బాస్ ఏడో సీజన్ (Bigg Boss Telugu 7).. అందుకు అనుగుణంగానే యమ రంజుగా సాగుతోంది. ఇందులో గతంలో కంటే కొత్త కంటెంట్‌ను చూపించడంతో పాటు టాస్కులను మరింత హైలైట్ చేస్తున్నారు. ఫలితంగా ఇది ప్రేక్షకులకు మజాను అందిస్తోంది. ఫలితంగా రెస్పాన్స్‌ను రాబడుతూ దూసుకెళ్తోంది.

కెప్టెన్సీ టాస్కు.. గొడవలతోనే:9వ వారానికి సంబంధించిన కెప్టెన్సీ పోటీదారుల కోసం 'హాల్ ఆఫ్ బాల్' అనే టాస్కును ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో యావర్, గౌతమ్, భోలే, తేజ, శోభా, రతికలను వీర సింహాలు టీమ్‌గా, అర్జున్, ప్రశాంత్, శివాజీ, అమర్, ప్రియాంక, అశ్వినిలను గర్జించే పులులు జట్టును చేశారు. వీళ్లకు రకరకాల టాస్కులను ఇచ్చారు. వీటిలో గౌతమ్ కెప్టెన్సీలోని వీర సింహాలు గెలిచింది.
కెప్టెన్సీ టాస్కులో ట్విస్ట్ ఇచ్చి:తొమ్మిదో వారానికి సంబంధించిన కెప్టెన్సీ టాస్కులో పాల్గొనే అర్హతను వీర సింహాలు టీమ్ సభ్యులు అందుకున్నారు. వీళ్లకు బీన్ బ్యాగ్ టాస్కును ఇచ్చారు. అయితే, ఆఖరిలో అదిరిపోయే ట్విస్ట్ ఇస్తూ.. ఈ టాస్కులో వీర సింహాలు టీమ్ సభ్యులకు బదులుగా గర్జించే పులులు ఆడాల్సి ఉంటుందని చెప్పాడు. ఇందుకోసం ఆ టీమ్ సభ్యులను తమ బదులు ఆడేలా ఒప్పించాలని చెప్పాడు.

గౌతమ్‌ను తీసేయాలని ప్లాన్:గర్జించే పులులు టీమ్‌లో ఐదుగురు సభ్యులు మాత్రమే ఉండడంతో వీర సింహాలు టీమ్‌లోని ఆరుగురు కంటెస్టెంట్లు ఆడడం కుదరలేదు. దీంతో ఒకరు తప్పుకోవాలని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో అమర్‌దీప్, శివాజి, ప్రియాంక, భోలే షావలిలు కలిసి గౌతమ్‌ను తీసేయాలని అనుకున్నారు. ఇదే విషయం అశ్వినికి చెప్పారు. దీనిపై గౌతమ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ వాదనకు దిగాడు.
శివాజితో గొడవ.. యావర్ ఔట్:కెప్టెన్సీ టాస్కు సమయంలో శివాజి (Sivaji) రూల్స్ పాటించలేదని, తనను తప్పించాలని చూశాడని గౌతమ్ ఆరోపించాడు. ఇలా వీళ్లిద్దరి మధ్య చాలా సార్లు గొడవలు జరిగాయి. కెప్టెన్సీ పోటీదారుల విషయంలోనూ శివాజి, గౌతమ్ వాదనకు దిగారు. దీంతో యావర్ ఈ టాస్క్ నుంచి తప్పుకున్నాడు. అప్పుడు అర్జున్ కోసం శివాజి ఆడగా.. గౌతమ్ కోసం అశ్విని బరిలోకి దిగింది.

డైరెక్టుగా ఎలిమినేట్ చేసేలా:కెప్టెన్సీ టాస్క్‌లో మనస్థాపానికి గురైన గౌతమ్ కృష్ణ.. అది పూర్తైన తర్వాత కెమెరా దగ్గరకు వచ్చి 'బిగ్‌బాస్ నన్ను ఒకసారి కన్ఫెషన్ రూమ్‌కు పిలవండి. చాలా విషయాలు రాంగ్‌గా బయటికి వెళ్తున్నాయి. నేను వీటిని యాక్సెప్ట్ చేయలేను. అదే జరిగితే నేను షో నుంచి బయటికి వెళ్లిపోవడానికి కూడా సిద్ధం బిగ్‌బాస్. నన్ను డైరెక్ట్‌గా ఎలిమినేట్ చేసేయండి' అని రిక్వెస్ట్ చేశాడు.
గౌతమ్ సంచలన ఆరోపణలు:ఆ తర్వాత గౌతమ్ 'శివాజి అన్న గేమ్ మొదలయ్యే ముందు అందరినీ పిలిచి గౌతమ్ ఎలిమినేట్ చేసేద్దాం అనుకున్నారు. మరి అర్జున్, యావర్ కూడా కెప్టెన్ అయ్యారు కదా.. అదే లాజిక్‌తో వెళ్లితే వాళ్లు కూడా గేమ్ ఆడొద్దు కదా. ఒక ఫిజికల్ గేమ్‌ను కూడా ఆయన మ్యాచ్ ఫిక్సింగ్ చేసి.. నీతి నిజాయితీ, ధర్మం అని నీతులు చెబుతుంటారు' అంటూ ఆరోపనలు చేశాడు.
కప్ కొట్టినా.. నాగ్ సార్‌తోనూ:అనంతరం గౌతమ్ 'శివాజి చాలా తప్పులు చేస్తున్నారు. మాకు క్లియర్‌గా కనిపిస్తున్నాయి. ఈ సీజన్ ఆయన విన్ అవ్వొచ్చేమో.. కప్పు కొట్టొచ్చేమో.. ప్రైజ్ మనీ తీసుకోవచ్చేమో.. అది కాదు నాకు మేటర్. అట్లాంటిది ఏమైనా ఉంటే నన్ను పంపించేయండి. నేను నామినేషన్స్‌లో లేను నన్ను డైరెక్ట్‌గా ఎలిమినేట్ చేయండి. నాగ్ సార్‌ని కూడా ఇదే కొశ్చన్ వేస్తా. న్యాయం కావాలి' అన్నాడు.


Click it and Unblock the Notifications











