Bigg Boss 7 Telugu: షోలో ఇంజక్షన్స్ కలకలం.. గేట్లు తీయండి.. ఇంటికి వెళ్లిపోతా అంటూ ఏడుపు

అసలు అంచనాలు లేకుండానే వచ్చినా.. సరికొత్త కాన్సెప్టే అయినా తెలుగు ప్రేక్షకులు ఇచ్చిన మద్దతుతో సక్సెస్‌ఫుల్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఇలా ఇప్పటికే ప్రతి ఏడాది ఒక సీజన్ చొప్పున ఆరింటిని పూర్తి చేసుకున్న ఇది.. ఇప్పుడు ఏడో దానితో వినోదాన్ని పంచుతోంది. ఈ సీజన్ ఆరంభంలోనే మంచి రేటింగ్‌ను అందుకుని పాత రికార్డులను కూడా బ్రేక్ చేసేసింది.

గతంలో వచ్చిన సీజన్లు సూపర్ హిట్ అవడంతో ఏడో దానిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఆరంభం నుంచే ఆసక్తికరంగా నడుపుతున్నారు. మరీ ముఖ్యంగా ఇందులో ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుకు అనుగుణంగా సరికొత్త టాస్కులు, ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లతో కూడిన అంశాలను హైలైట్ చేస్తున్నారు. తద్వారా దీన్ని కూడా సక్సెస్‌ఫుల్‌గా నడుపుతున్నారు.

Gautham Krishna and Prince Yawar Argument in Bigg Boss 7 Telugu Show

'మాయ అస్త్ర' టాస్కులో గెలిచిన రణధీర టీమ్ సభ్యుల్లో 'పవర్ అస్త్ర' కోసం జరిగే పోటీకి ఎవరు అర్హులో చెప్పాలని మహాబలి టీమ్‌కు టాస్క్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఇందులో వాళ్లు విఫలం అవడంతో టాస్క్ రచ్చ రచ్చగా సాగింది. ఇక, దీన్ని శుక్రవారం ఎపిసోడ్‌లోనూ కంటిన్యూ చేయబోతున్నట్లు తాజాగా వదిలిన ప్రోమోలో చూపించారు.

రణధీర టీమ్‌లో అమర్‌దీప్, శోభా శెట్టి, ప్రియాంక జైన్ టాస్క్ నుంచి ఎలిమినేట్ అవడంతో శివాజి, షకీలా, ప్రిన్స్ యావర్‌లు మాత్రమే మిగిలారు. ఈ సమయంలో మహాబలి టీమ్ సభ్యుడు గౌతమ్ కృష్ణ వచ్చి ప్రిన్స్ యావర్ అనర్హుడు అని చెప్పాడు. దీంతో అతడికి కోపం వచ్చింది. అంతేకాదు, సరైన కారణం లేకుండా టాస్కు నుంచి ఎలిమినేట్ అయ్యేలా చేశావని గౌతమ్‌పై ఫైర్ అయ్యాడు.

గౌతమ్ తనను టాస్క్ నుంచి తప్పించడంతో ప్రిన్స్ యావర్ రగిలిపోయాడు. దీంతో ఇద్దరూ ఒకరి మీదకు ఒకరు వెళ్లి నెట్టుకున్నంత పని చేశారు. కొద్ది సేపటి తర్వాత తన బాడీ చూసి మీదకు రావాలి అన్నట్లుగా ప్రిన్స్ యావర్ సవాల్ చేశాడు. అప్పుడు గౌతమ్ 'ఇంజక్షన్లు' చేసుకుని యావర్ బాడీని పెంచాడని సైగల ద్వారా ఆరోపించాడు. దీంతో ఇది పెద్ద వివాదంగా మారింది.

సిక్స్ ప్యాక్ కోసం ఇంజక్షన్లు చేయించుకున్నట్లు గౌతమ్ ఆరోపించడంతో ప్రిన్స్ యావర్ తట్టుకోలేకపోయాడు. దీంతో బిగ్ బాస్‌తో 'ప్లీజ్ గేట్లు ఓపెన్ చేయండి. నేను మా ఇంటికి వెళ్లిపోతాను' అంటూ ఏడుస్తూ ప్రాధేయపడ్డాడు. ఆ తర్వాత అమర్‌దీప్ సహా కొందరు వచ్చి ప్రిన్స్‌ను ఓదార్చారు. ఇప్పుడీ ప్రోమో రావడంతో నేటి ఎపిసోడ్‌పై అందరిలోనూ ఆసక్తి రెట్టింపు అయిపోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X