గౌతమ్ కృష్ణ బిగ్ బాస్ రెమ్యూనరేషన్ లీక్: 13 వారాలకే అన్ని లక్షలు.. జాక్‌పాట్ కొట్టేశాడుగా!

దేశంలోని ఎన్నో భాషల్లో వస్తున్నా.. తెలుగులో మాత్రమే అత్యధిక టీఆర్పీ రేటింగ్‌ను సొంతం చేసుకుని నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతోంది బిగ్ బాస్. అందుకే ఇక్కడ నిర్వహకులు ఏమాత్రం గ్యాప్ లేకుండా సీజన్లను తీసుకు వస్తున్నారు. ఇలా ఇప్పుడు ఏడో సీజన్‌ను ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పుడు ఇది చివరి దశకు చేరడంతో టాప్ 5 ఎవరు అన్న దానిపైన కూడా ఆసక్తి నెలకొంది. ఈ పరిస్థితుల్లో 13వ వారంలో గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ అయినట్లు ఇప్పటికే న్యూస్ లీకైంది. మరి అతడు ఈ సీజన్ కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో చూద్దాం పదండి!

ఉల్టా పుల్టా కావడంతో మజా
సాధారణంగా బిగ్ బాస్ షో ఎప్పుడు వచ్చినా తెలుగులో సూపర్ హిట్ అవుతుంది. అలాంటిది ఇప్పుడు ఉల్లా పుల్టా కాన్సెప్టుతో నడుస్తోన్న ఏడో సీజన్ మరింత సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. దీనికి కారణం ఇందులో గతంలో ఎన్నడూ చూపించని కంటెంట్‌ను ప్రసారం చేస్తుండడమే. అందుకే దీనికి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఈ సీజన్ ద్వారా ప్రేక్షకులకు మజా కూడా వస్తోంది.

 Gautham Krishna Bigg Boss Season 7 Remuneration Details Leaked

డాక్టర్ బాబు బాగా హైలైట్
బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి మొదట 14 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా అడుగు పెట్టారు. ఆ తర్వాత మరో ఐదుగురు వైల్డ్ కార్డు ద్వారా అడుగు పెట్టారు. వీళ్లంతా తమ తమ విభాగాల్లో ఎనలేని క్రేజ్‌ను తెచ్చుకున్నారు. అందులో కొందరు మాత్రమే బాగా హైలైట్ అయ్యారు. వారిలో డాక్టర్ బాబు గౌతమ్ కృష్ణ ఒకరు. ఆరంభంలోనే ఆటతీరుతో అతడు బాగానే ఆకట్టుకున్నాడు.

మంచి పేరు.. గొడవలతో
బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా వచ్చినప్పటి నుంచే గౌతమ్ కృష్ణ తన మార్కు చూపించే ప్రయత్నాలు చేశాడు. ముఖ్యంగా షోలో ఇచ్చే టాస్కుల్లో ఎంతో యాక్టివ్‌గా పాల్గొన్నాడు. అలాగే, తన గొంతును వినిపిస్తూ చాలా సార్లు గొడవలు కూడా పెట్టుకున్నాడు. మొత్తంగా సోలో ప్లేయర్‌గా ప్రేక్షకుల మనసులు గెలిచాడు. కానీ, శివాజితో గొడవలు అతడికి మైనస్‌గా మారిపోయాయి.

 Gautham Krishna Bigg Boss Season 7 Remuneration Details Leaked

13వ వారంలో ఎలిమినేట్
బిగ్ బాస్ ఏడో సీజన్‌లో ఎక్కువగా షాకింగ్ ఎలిమినేషన్స్ కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే 11వ వారంలో ఎలిమినేషన్ లేకపోవడంతో 12వ వారంలో డబుల్ ట్రబుల్ పెట్టారు. ఇక, ఫినాలే వీక్‌కు ఎంతో ముఖ్యమైన 13వ వారం ఎలిమినేషన్‌లో సంచలనం కనిపించింది. ఇందులో స్ట్రాంగ్ ప్లేయర్‌గా పేరొందిన గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ అయినట్లు ఇప్పటికే న్యూస్ లీకైంది.

గౌతమ్ రెమ్యూనరేషన్ లీక్
బిగ్ బాస్ హౌస్‌లోకి ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చి సత్తా చాటిన డాక్టర్ బాబు గౌతమ్ కృష్ణ 13 వారంలో ఎలిమినేట్ అయ్యాడు. దీంతో అతడికి బిగ్ బాస్ నిర్వహకులు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారన్న దానిపై అప్పుడే పలు రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. గౌతమ్ కృష్ణ ఒక్కో వారానికి రూ. 1.75 లక్షలు తీసుకున్నాడని తెలిసింది.

 Gautham Krishna Bigg Boss Season 7 Remuneration Details Leaked

అన్ని లక్షలతో జాక్‌పాట్
బిగ్ బాస్ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం.. గౌతమ్ కృష్ణ బిగ్ బాస్ ఏడో సీజన్ కోసం రోజుకు రూ. 25 వేల చొప్పున వారానికి రూ. 1.75 లక్షలు చార్జ్ చేశాడట. అలా 13 వారాల పాటు ఉన్న గౌతమ్ మొత్తంగా రూ. 22.75 లక్షలు రెమ్యూనరేషన్‌గా తీసుకున్నాడని టాక్ వినిపిస్తోంది. చాలా మంది కంటెస్టెంట్లతో పోల్చుకుంటే ఇది చాలా ఎక్కువే అని పలువురు అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X