Gautham Krishna: ఆడకపోయినా శివాజీ ఇంకా ఉండటానికి కారణమదే.. గౌతమ్ సెన్సేషనల్ కామెంట్స్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో గతవారం గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక లో ఉన్న శివాజీపై సంచలన ఆరోపణలు చేశారు. బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న గౌతమ్ కృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక శివాజీ గేమ్ ఆడకపోయినా.. ఆ ఒక్క కారణంతో ఇంకా హౌస్ లో కొనసాగుతున్నాడని ఆరోపించాడు. అంతే కాదు.. శివాజీని బిగ్ బాస్ గెలిపించే అవకాశం ఉందని చెప్పుకువచ్చాడు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఆసక్తిగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ వారం గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ అయ్యాడు. ఆయనకు హౌస్ లోని శివాజీకి మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతునే ఉండేవి. మొదటి నుంచి ఏ బ్యాచ్ లో ఉండకపోయేది గౌతమ్. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చాక బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న గౌతమ్.. ఆసక్తికర కామెంట్స్ చేశారు. బిగ్‌ బాస్‌లో నటుడు శివాజీ మాట మీద నిలబడే మనిషి కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Gautham Krishna Comments on Sivaji About Bigg Boss Telugu 7 Show Full Details Here

ఇంటర్వూలో పాల్గొన్న గౌతమ్... శివాజీ అన్న మొదటి సారి నన్ను నామినేట్‌ చేస్తూ కొన్ని పాయింట్లు చెప్పుకువచ్చాడు. తాను స్థితిమంతుడనని... ఒక సినిమా కూడా చేశాడు. బయటకు వెళ్లి ఎలాగైనా బతుకుతాడు... వేరే వాళ్లకు ఈ షో చాలా అవసరమంటూ చెప్పుకువచ్చాడని గుర్తు చేశాడు. గతంలో ఓ షూటింగ్‌ సందర్భంగా ఆయన్ను కలిసినప్పుడు... చాలా మంచి వ్యక్తిగా అనిపించారు. బాగా మాట్లాడారు కానీ, హౌస్‌లో ఇలా మాట్లాడే సరికి నాకు మాటలు రాలేదని గౌతమ్ చెప్పుకువచ్చాడు.

తనకు ఎన్ని సమస్యలు ఉన్నాయో ఆయనకు తెలియదు కదా... నేను నీతి, నిజాయతీలతో ఉంటా. నేను సరైన నిర్ణయాలే తీసుకుంటా అని శివాజీ చెబుతుంటారు. కానీ, ప్రశాంత్‌, యావర్‌ లు తప్పు చేస్తే, వాళ్లకు అది తప్పు అని చెప్పరు. అవన్నీ చూసే సరికి నాకు చికాకు వచ్చేసిందని గౌతమ్ చెప్పుకువచ్చాడు.. చేయికి దెబ్బ తగిలిన తర్వాత ఆయన ఫిజికల్‌ గేమ్స్‌ పెద్దగా ఆడింది లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Gautham Krishna Comments on Sivaji About Bigg Boss Telugu 7 Show Full Details Here

శివాజీ అన్న ఎక్కువగా సంచాలకుడిగానే చేశారని చెప్పుకువచ్చాడు గౌతమ్. ప్రశాంత్‌, యావర్‌ లను సపోర్ట్‌ చేయడం ద్వారా ప్రేక్షకుల నుంచి సానుభూతి పొందడం ద్వారా ఇన్ని రోజులు ఉండగలుగుతున్నారేమో అని నాకు అనిపిస్తుందని గౌతమ్ చెప్పుకువచ్చాడు. అది ఆయన స్ట్రాటజీ కావచ్చని వెల్లడించారు. ఒకవేళ నేను అనుకుంటున్నది తప్పు కూడా కావచ్చని వ్యాఖ్యానిచారు..

ఆయన ఎవరితోనైనా చర్చ పెడతే, ఆయన చెప్పిందే కరెక్ట్‌ అనుకుంటారని గౌతమ్ వెల్లడించారు. ఎదుటి వ్యక్తి అభిప్రాయాన్ని గౌరవించరన్నారు. నేను ఏదైనా మాట్లాడితే ఎవరు నమ్ముతారు చెప్పండని అని చెప్పుకువచ్చాడు. ఆ స్థాయి వ్యక్తి మాటలను అందరూ చాలా మంది నమ్ముతారన్నారు. అందుకే కరెక్ట్‌గా మాట్లాడాలని అనుకుంటానని వెల్లడించారు. హౌస్‌లోనూ, నాగార్జునగారికి చెప్పలేకపోయిన ఒక మాట ఇక్కడ చెబుతా. శివాజీ అన్న హౌస్‌లో మాట మీద నిలబడే మనిషి కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X