Bigg Boss Telugu 7: మిత్ర ద్రోహి గౌతమ్ కాదు అమర్.. డాక్టర్ బాబుకు ఫుల్ సపోర్ట్.. ఇదే హాట్ టాపిక్
బుల్లితెరపై ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ తిరుగులేని విధంగా దూసుకుపోతోన్న షోనే బిగ్ బాస్. కొత్త కంటెంట్‌తో వచ్చినా ప్రతిసారీ భారీ రేటింగ్‌ను రాబడుతూ ఇది సత్తా చాటుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఏడో సీజన్ కూడా విజయవంతంగా రన్ అవుతోంది. ఇందులో ఉల్టా పుల్టాగా సాగే ఎన్నో అంశాలు ఆడియెన్స్‌ను ఖుషీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో గౌతమ్ కృష్ణ - అమర్‌దీప్ మధ్య జరిగిన గొడవ పెద్ద వివాదంగా మారుతోంది. ఇంతకీ ఇందులో తప్పు ఎవరిది? ఎవరికి ప్రేక్షకులు సపోర్ట్ చేస్తున్నారో చూద్దాం పదండి!
బిగ్ బాస్ ఏడో సీజన్‌లో 11వ వారానికి సంబంధించిన కెప్టెన్సీ టాస్కును శుక్రవారం ఎపిసోడ్‌లో చూపించారు. ఇందులో ఇంటి సభ్యులు అందరినీ కంటెండర్లగా పెట్టి వాళ్లకు ఓ టాస్కును ఇచ్చారు. పలు రౌండ్లలో జరిగిన ఈ టాస్కులో అమర్‌దీప్ చౌదరి, అంబటి అర్జున్, ప్రియాంక జైన్, పల్లవి ప్రశాంత్‌లు చివరి రౌండ్‌కు చేరుకున్నారు. అందులో ప్రశాంత్, అర్జున్ ఔట్ అయ్యారు.

బిగ్ బాస్ ఇంటి కొత్త కెప్టెన్‌ను నిర్ణయించే టాస్కులో అమర్‌దీప్, ప్రియాంక జైన్‌లు పోటీ పడ్డారు. ఇందులో చాలా మంది అతడినే టార్గెట్ చేశారు. ఫలితంగా అమర్‌దీప్ ఎంతో ఎమోషనల్ అయ్యాడు. అంతేకాదు, పోరాటం చేయకుండా బ్రతిమాలుతూ, ఏడుస్తూ కనిపించాడు. అతడు వ్యవహరించిన తీరు కొందరికి బాధగా అనిపించినా.. చాలా మందికి చిరాకు తెప్పించింది.
కెప్టెన్సీ టాస్కు జరుగుతున్న సమయంలో గౌతమ్ కృష్ణ.. ప్రియాంకకు సపోర్టు చేస్తానని చెప్పి అమర్ బ్రిక్స్‌ను పడేసేందుకు ప్రయత్నించాడు. అప్పుడు వీళ్లిద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. ఓ సందర్భంలో అయితే గౌతమ్‌ను అమర్ 'మిత్ర ద్రోహి' అని తిట్టాడు. ఆ తర్వాత కూడా అలా పలుమార్లు నోరు జారాడు. దీంతో ఇది పెద్ద వివాదంగా మారిపోయింది.
మొత్తానికి సోదరిలా భావించే ప్రియాంకను కెప్టెన్‌గా చేసే వరకూ గౌతమ్ కృష్ణ పోరాటం చేశాడు. ఆ సమయంలోనే అమర్‌దీప్‌కు శత్రువులా మారిపోయాడు. ఈ వ్యవహారం హౌస్‌లో కంటే బయటే చర్చనీయాంశం అయింది. ఇందులో చాలా మంది గౌతమ్‌కు మద్దతు ప్రకటిస్తున్నారు. అదే సమయంలో గతంలో జరిగిన ఎన్నో పాయింట్లను ఎత్తి చూపిస్తూ అమర్‌ను విమర్శిస్తున్నారు.
వాస్తవానికి గౌతమ్, అమర్ ఆరంభం నుంచీ స్నేహితుల్లా ఉంటున్నారు. కానీ, ఓ సందర్భంగా డాక్టర్ బాబు ఎలిమినేట్ అవ్వాలని అతడు కూడా ఓట్ వేశాడు. అలాగే, ఓ కెప్టెన్సీ టాస్కులో శోభా శెట్టి కోసం ఆడుతూ గౌతమ్‌ను ఔట్ చేశాడు. ఇలా అమర్‌దీప్ చాలాసార్లు అతడికి ద్రోహం చేశాడు. కానీ, గత టాస్కులో తనను ఓడించబోతే మాత్రం తట్టుకోలేక నిందలు వేసేశాడు.
ఇవే అంశాలను చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ప్రస్తావిస్తూ అమర్‌దీప్‌ను ఏకిపారేస్తున్నారు. అదే సమయంలో గౌతమ్ కృష్ణకు మద్దతు కూడా తెలుపుతున్నారు. అంతేకాదు, గౌతమ్ ఒక వారియర్ అంటూ.. ఈ సీజన్‌లో గెలిచేందుకు అతడికి పూర్తి అర్హతలు ఉన్నాయంటూ కొనియాడుతున్నారు. దీంతో అతడు Xలో ట్రెండ్ అవుతున్నాడు.


Click it and Unblock the Notifications











