Bigg Boss Telugu 7: ఏడిపించిన గౌతమ్ తల్లి.. ఆ మేటర్ లీక్ చేసి మరీ.. కొడుకు కంటే అతడితో ప్రేమగా!
జనరేషన్లు మారుతుండడంతో తెలుగు బుల్లితెరపై రకరకాల కాన్సెప్టులతో షోలు వస్తున్నాయి. అయితే వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్నాయి. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది బిగ్ బాస్ షో గురించే. అంతలా ఇది తెలుగు బుల్లితెరపై ప్రభావాన్ని చూపిస్తూ దూసుకుపోతోంది. అందుకే నిర్వహకులు వరుస సీజన్లతో వస్తున్నారు. ఇలా ఇప్పుడు ఏదో దాన్ని విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. ఇక, ఇప్పుడు ఈ షోలో భాగంగా గౌతమ్ మదర్ హౌస్‌లోకి అడుగు పెట్టారు. మరి ఆమె ఏం చేశారో మీరే చూసేయండి మరి!
బిగ్ బాస్ షోలో ఎన్నో రకాల పరిణామాలు జరుగుతూ ఉంటాయి. అయితే, అన్నింటి కంటే ఫ్యామిలీ మెంబర్లు హౌస్‌లోకి వచ్చే వారం మాత్రం ఎంతో ఎమోషనల్‌గా, ఆసక్తికరంగా సాగుతూ ఉంటుంది. ఏడో సీజన్‌లో భాగంగా ఫ్యామిలీ వీక్‌ను పదో వారంలోనే తీసుకు వచ్చారు. ఇందులో భాగంగా కంటెస్టెంట్లకు ఎన్నో రకాల సర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

ఏడో సీజన్ ఫ్యామిలీ వీక్‌లో భాగంగా మంగళవారం జరిగిన ఎపిసోడ్‌లో ముందుగా శివాజి కుమారుడు కెన్నీ హౌస్‌లోకి అడుగు పెట్టాడు. ఆ తర్వాత అంబటి అర్జున్ భార్య ఎంట్రీ ఇచ్చారు. ఆమె ప్రెగ్నెంట్ కావడంతో హౌస్‌లోనే సీమంతం కూడా చేశారు. ఇక, ఎపిసోడ్ చివర్లో అశ్విని మదర్ కూడా షోలోకి వచ్చారు. వీళ్ల రాకతో హౌస్‌లో ఎన్నో రకాల ఎమోషన్స్ కనిపించాయని చెప్పాలి.
ఈ వారం మొత్తం జరగనున్న ఫ్యామిలీ వీక్‌లో బుధవారం జరగనున్న ఎపిసోడ్ కోసం గౌతమ్ కృష్ణ మదర్ బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టబోతున్నారు. దీన్ని తాజాగా వచ్చిన ప్రోమోలో రివీల్ చేశారు. ఆమె హౌస్‌లోకి అడుగు పెట్టే ముందుగానే గౌతమ్ కోసం ఓ పంచెను పంపించారు. ఆ తర్వాత 'కన్నయ్య కన్నయ్య' అంటూ పిలుస్తూ ఎమోషనల్‌గా ఎంట్రీ ఇచ్చారు.

బిగ్ బాస్ హౌస్‌లోకి తన తల్లి అడుగు పెట్టగానే గౌతమ్ కృష్ణ వెళ్లి ఆమెను ఆప్యాయంగా హత్తుకున్నాడు. ఆ తర్వాత కంటెస్టెంట్లు అందరూ వచ్చి ఆమెకు సాదర స్వాగతం పలికారు. అనంతరం గౌతమ్ తల్లి తన కొడుకుకు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగిందని అక్కడున్న వాళ్లతో చెప్పారు. ముఖ్యంగా లేడీ ఫాలోయింగ్ పెరిగిందని, అందరూ గౌతమ్ గురించి అడుగుతున్నారని చెప్పారు.
గౌతమ్ కృష్ణ తల్లి ఆ తర్వాత హౌస్‌లోని కంటెస్టెంట్లు అందరికీ అన్నం ముద్దలు కలిపి తినిపించారు. అనంతరం అక్కడ ఉన్న కంటెస్టెంట్లు అందరితో సరదాగా డ్యాన్సులు చేశారు. ఆ సమయంలో ప్రిన్స్ యావర్ తన తల్లి గుర్తుకు వచ్చి ఏడ్చేశాడు. అప్పుడు గౌతమ్ మదర్ 'నువ్వు నా కొడుకువే. ఎప్పుడైనా మా ఇంటికి రావొచ్చు' అని చెప్పి అతడికి ప్రేమను పంచారు.
మొత్తానికి గౌతమ్ తల్లి రాకతో బిగ్ బాస్ హౌస్ మొత్తం కాసేపు సందడిగా, కాసేపు ఎమోషనల్‌గా కనిపించినట్లు ప్రోమో ద్వారా అర్థం అయింది. దీంతో ఈరోజు ఎపిసోడ్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.


Click it and Unblock the Notifications











