Bigg Boss Telugu 7: షోలో గుండెలు పిండేసే సీన్.. గొప్ప పని చేసిన తల్లి.. ఈ సీజన్‌లో బెస్ట్ మూమెంట్
ఈ మధ్య కాలంలో తెలుగులోకి ఎన్నో రకాల వినూత్న కార్యక్రమాలు వచ్చాయి. అయితే, వాటిలో అన్నింటికీ ప్రేక్షకుల నుంచి ఆదరణ దక్కడం లేదు. కేవలం కొన్ని షోలు మాత్రమే సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్నాయి. అందులో బిగ్ బాస్ ఒకటి. రియాలిటీ అధారంగా నడిచే ఈ షోలో ప్రస్తుతం ఏడో సీజన్ ప్రసారం అవుతోంది. ఉల్టా పుల్టా కాన్సెప్టుతో నడుస్తోన్న ఈ సీజన్‌లో ఎన్నో ఊహించని పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇక, తాజాగా ఇందులో ఫ్యామిలీ వీక్‌ను తీసుకొచ్చారు. ఇందులో గౌతమ్ తల్లి గొప్ప మనసు చూపించారు. ఆ వివరాలను మీరే చూడండి!
ఎమోషనల్‌గా ఫ్యామిలీ వీక్:సాధారణంగా బిగ్ బాస్ షోలో ఎన్నో రకాల పరిణామాలు జరుగుతుంటాయి. అయితే, అన్నింటి కంటే ఫ్యామిలీ మెంబర్లు హౌస్‌లోకి వచ్చే వారం మాత్రం ఎంతో ఎమోషనల్‌గా, ఆసక్తికరంగా ఉంటుంది. ఏడో సీజన్‌లో భాగంగా ఫ్యామిలీ వీక్‌ను పదో వారంలోనే నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులను తీసుకు రావడంతో పాటు చాలా ప్లాన్లు చేశారు.

గిఫ్ట్ పంపిన తర్వాత ఎంట్రీ:బుధవారం జరిగిన ఎపిసోడ్‌లో గౌతమ్ కృష్ణ మదర్ బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టారు. ఆమె రావడానికి ముందే కొడుకు కోసం ఓ పంచెను పంపించారు. ఆ తర్వాత 'కన్నయ్య కన్నయ్య' అంటూ పిలిచారు. అప్పుడు గౌతమ్ తన తల్లి గొంతును గుర్తు పట్టి ఆమె కోసం ఇల్లంతా వెతకడం మొదలు పెట్టారు. అలా కొద్ది సేపటి తర్వాత ఆమె ఎమోషనల్‌గా ఎంట్రీ ఇచ్చారు.
గౌతమ్‌కు ఫ్యాన్స్ పెరిగారు:తన తల్లి బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వగానే గౌతమ్ కృష్ణ వెళ్లి ఆమెను ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు ఆ తర్వాత కంటెస్టెంట్లు అందరూ వచ్చి ఆమెకు వెల్‌కం చెప్పారు. అనంతరం గౌతమ్ తల్లి తన కొడుకుకు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగిందని చెప్పారు. ముఖ్యంగా లేడీ ఫాలోయింగ్ పెరిగిందని, అందరూ గౌతమ్‌ను పొగడుతూ తనతో ఫొటోలు దిగుతున్నారని వెల్లడించారు.

కొడుకుకు సలహాలు ఇచ్చి:బిగ్ బాస్ హౌస్‌లో గౌతమ్ ఆట తీరు గురించి ఆమె మాట్లాడారు. ఆ సమయంలోనే కొడుకుకు విలువైన సలహాలను ఇచ్చారు. 'నువ్వు నీ మాట మీదనే ఉండు. కరెక్ట్ పాయింట్ మాట్లాడినప్పుడు ఏమాత్రం వెనక్కి తగ్గకు. నువ్వు చాలా బాగా ఆడుతున్నావు. మేమంతా చాలా సంతోషంగా ఉన్నాము. కప్ కొట్టుకుని వస్తావని ఆశిస్తున్నాము' అంటూ గౌతమ్‌తో ఆమె చెప్పుకొచ్చారు.
అమ్మ ముద్ద.. ఎమోషనల్:గౌతమ్ మదర్ ఆ తర్వాత కిచెన్‌లోకి వెళ్లారు. అప్పుడామె 'మీరంతా చాలా రోజులుగా అమ్మ గోరుముద్దలు మిస్ అవుతున్నారు కదా. ఈరోజు మీ అందరికీ నేనే అన్నం తినిపిస్తాను' అంటూ కంటెస్టెంట్లు అందరికీ ముద్దలు తినిపించారు. ఆ సమయంలో భోలే షావలి, ప్రిన్స్ యావర్‌లు తమ తల్లిని గుర్తు చేసుకుని ఏడ్చేశారు. మిగిలిన వాళ్లు కూడా అమ్మలను యాదికి తెచ్చుకున్నారు.

నాకు అమ్మ లేదు అమ్మా:బిగ్ బాస్ హౌస్‌లో గౌతమ్ మదర్ ఎంతో సరదాగా గడిపారు. అనంతరం ఆమె కోసం ఓ అమ్మ పాటను ప్లే చేశారు. అప్పుడు గార్డెన్ ఏరియాలో ఒంటరిగా కూర్చున్న ప్రిన్స్ యావర్ గుండెలు పగిలేలా ఏడ్చాడు. అది గమనించిన ప్రశాంత్ ఓదార్చాడు. అనంతరం గౌతమ్ తల్లి అక్కడకు రావడంతో 'నాకు అమ్మ లేదు అమ్మా' అంటూ ఆమెను పట్టుకుని ప్రిన్స్ ఎమోషనల్ అయ్యాడు.
నువ్వూ నా కొడుకువేరా:ప్రిన్స్ ఏడుస్తున్నప్పుడు గౌతమ్ మదర్ 'నువ్వు నా కొడుకువే. ఎప్పుడైనా మా ఇంటికి రావొచ్చు' అంటూ దగ్గరకు తీసుకుని ఓదార్చారు. అనంతరం అందరూ కలిసి డ్యాన్స్ చేశారు. ఇక, షోలో గౌతమ్ - ప్రిన్స్ మధ్య ఎన్నో గొడవలు జరిగాయి. అయినప్పటికీ కొడుకుతో సమానంగా ఆమె యావర్‌పైన కూడా ప్రేమను చూపించారు. దీంతో ఆమెను అందరూ ప్రశంసిస్తున్నారు.


Click it and Unblock the Notifications











