Bigg Boss Voting : నిఖిల్‌కి దెబ్బేసిన డాక్టర్ బాబు .. ఓటింగ్‌లో టాప్ ప్లేస్‌కి, డేంజర్‌ జోన్‌లో ఎవరంటే?

బిగ్‌బాస్ తెలుగు 8 విజయవంతంగా 9 వారాలు పూర్తి చేసుకుని 10వ వారంలోకి అడుగుపెట్టింది. వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చి, స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న నయని పావని ఎలిమినేట్ కావడంతో అంతా షాక్ అయ్యారు. ఎప్పటిలాగే సోమవారం నామినేషన్స్ ఓ రేంజ్‌లో జరిగాయి. మరి ఈ వీక్ నామినేషన్స్‌లో ఎవరెవరు ఉన్నారు.. ఓటింగ్‌లో ఎవరు టాప్‌లో ఉన్నారు? ఎవరు లీస్ట్‌లో ఉన్నారో ఒకసారి పరిశీలిస్తే :

ప్రస్తుతం పాత ఓజీ టీమ్‌లో విష్ణుప్రియ, నిఖిల్, నబీల్, ప్రేరణ, యష్మిగౌడ, పృథ్వీ ఉండగా.. వైల్డ్ కార్డ్ ఎంట్రీదారులలో గంగవ్వ, హరితేజ, గౌతమ్, అవినాష్, టేస్టీ తేజ, రోహిణిలు కలిపి మొత్తం 12 మంది ఉన్నారు. సోమవారం నామినేషన్స్‌కి శ్రీకారం చుట్టిన బిగ్‌బాస్.. ఒకరిని మాత్రమే నామినేట్ చేయాలని మెగా చీఫ్ అయిన కారణంతో అవినాష్‌ని నామినేట్ చేయడానికి వీల్లేదని ఆదేశించారు. నిఖిల్ .. గౌతమ్‌ని, గౌతమ్ .. యష్మి గౌడని, యష్మి.. గౌతమ్‌ని, టేస్టీ తేజ .. పృథ్వీని, గంగవ్వ .. యష్మిని, పృథ్వీ - రోహిణిని, హరితేజ.. ప్రేరణని, విష్ణుప్రియ - ప్రేరణని, రోహిణి.. యష్మిని, నబీల్ .. విష్ణుప్రియని , ప్రేరణ .. హరితేజని నామినేట్ చేశారు.

gautham krishna place top in 10th week voting in bigg boss telugu 8

దాంతో యష్మి గౌడ, ప్రేరణ, గౌతమ్, హరితేజ, విష్ణుప్రియ, రోహిణి, పృథ్వీలు నామినేషన్స్‌లో ఉన్నారు. అయితే చివరిలో బిగ్‌బాస్ ఓ మెలిక పెట్టాడు. మెగా చీఫ్‌గా ఉన్న అవినాష్.. నామినేషన్స్‌లో ఉన్న ఒకరిని సేవ్ చేసి, మరొకరిని నామినేట్ చేయొచ్చని చెప్పాడు. దాంతో అవినాష్ తన పవర్ ఉపయోగించి తన స్నేహితురాలు రోహిణిని సేవ్ చేసి.. అసలు నామినేషన్స్‌లో లేని నిఖిల్‌ని అగ్రెస్‌వ్ బిహేవియర్ పేరుతో లిస్ట్‌లోకి తీసుకొచ్చాడు. ఇది కంటెస్టెంట్స్‌తో పాటు ప్రేక్షకులను షాక్‌కు గురిచేసింది.

దీంతో 10 వారం మొత్తం ఏడుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో నిలిచినట్లుగా బిగ్‌బాస్ అధికారికంగా ప్రకటించాడు . వారు గౌతమ్ కృష్ణ, యష్మి గౌడ, హరితేజ, విష్ణుప్రియ, ప్రేరణ, నిఖిల్, పృథ్వీ. సోషల్ మీడియాలో అనధికారికంగా జరుగుతున్న ఓటింగ్‌ను ఒకసారి పరిశీలిస్తే.. నిఖిల్, గౌతమ్‌లు హౌస్‌తో పాటు ఓటింగ్‌లోనూ నువ్వా నేనా అన్నట్లుగా పోటీపడుతున్నారు. కానీ 26.7 శాతం ఓటింగ్‌తో డాక్టర్ బాబు ఓటింగ్‌లో నెంబర్‌వన్‌గా నిలిచాడు. తర్వాత 20.15 శాతం ఓటింగ్‌తో నిఖిల్‌ రెండో స్థానంలో ఉన్నాడు.

gautham krishna place top in 10th week voting in bigg boss telugu 8

అనంతరం ప్రేరణ (19.39 శాతం), యష్మిగౌడలు (12.04 శాతం) ఓటింగ్‌తో సేఫ్ జోన్‌లో ఉన్నారు. అయితే ఈసారి ఏకంగా ముగ్గురు కంటెస్టెంట్స్ విష్ణుప్రియ (7.61 శాతం ), హరితేజ (7.21 శాతం), పృథ్వీ (6.9 శాతం) డేంజర్ జోన్‌లో ఉండటం గమనార్హం. ఇక ఎప్పుడు నామినేషన్స్‌‌లో ఉన్నా ఓటింగ్‌లో టాప్‌లో నిలిచే నిఖిల్ గత కొద్దిరోజులుగా వెనుకబడిపోతున్నాడు. తన ఆటతీరును మెరుగుపరచుకోకుంటే ఇబ్బందులు తప్పవని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అయితే ఓటింగ్ లైన్స్ క్లోజ్ కావడానికి ఇంకా చాలా టైమ్ ఉండటంతో ఫలితాలు ఎలా మారుతాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X