Bigg Boss Voting : మరోసారి డాక్టర్ బాబు హవా .. వరుసగా రెండోసారి టాప్ ప్లేస్‌కి, డేంజర్ జోన్‌లో ఎవరంటే?

బిగ్‌బాస్ తెలుగు 8కి సంబంధించి 11వ వారం నామినేషన్స్ హోరాహోరీగా జరిగాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఇప్పటికే ఓటింగ్ మొదలుపెట్టేశారు . దీని ప్రకారం ఓటింగ్‌లో ఎవరు టాప్‌లో ఉన్నారు? ఎవరు లీస్ట్‌లో ఉన్నారు? అసలు ఈ వీక్ నామినేషన్స్‌లో ఎవరెవరు ఉన్నారు .. ఏ ఇంటి సభ్యుడిని కంటెస్టెంట్స్ ఎక్కువగా టార్గెట్ చేశారో ఒకసారి పరిశీలిస్తే :

సోమవారం నామినేషన్స్‌కి శ్రీకారం చుట్టారు బిగ్‌బాస్. దీని ప్రకారం ఇంట్లో ఉండటానికి అర్హత లేని కంటెస్టెంట్ పెయింటింగ్‌ను పాడు చేయాల్సి ఉంటుంది. మెగా చీఫ్ కావడంతో ప్రేరణను ఎవరూ నామినేట్ చేయకూడదని చెప్పాడు బిగ్‌బాస్. గార్డెన్ ఏరియాలో ఒక పెయింట్ బ్రష్ ఉంచి.. బజర్ మోగినప్పుడు ఎవరైతే ముందుగా ఆ బ్రష్ పట్టుకుని పెయింట్ పాడు చేయవచ్చు. ఒక సభ్యుడు ఒకసారి మాత్రమే నామినేట్ చేయాలని బిగ్‌బాస్ తెలిపాడు.

Gautham Krishna Placed top in 11th week voting in bigg boss telugu 8

అయితే నామినేషన్స్‌ డే సందర్భంగా టేస్టీ తేజని టార్గెట్ చేసింది కన్నడ బ్యాచ్. ఎవిక్షన్ పాస్ ప్రక్రియ సమయంలో తేజ తెలిసి తప్పు చేశాడంటూ నిఖిల్ అతనిని నామినేట్ చేయగా.. తప్పు చేసినట్లు తెలిసి రియలైజ్ అయ్యానని తేజ అంగీకరించాడు. తర్వాత స్మోక్ జోన్‌లో స్మోక్ చేసినందుకు పృథ్వీని ఎందుకు నామినేట్ చేశావని తేజని నిఖిల్ నిలదీశాడు. అది మనసులో పెట్టుకుని నన్ను నామినేట్ చేస్తున్నావా? మీరంతా కలిసే ఆడుతున్నారా అని తేజ పాయింట్ లాగాడు. దీంతో పృథ్వీ, యష్మి, నిఖిల్‌లు తేజని రౌండప్ చేశారు.

చివరిలో విష్ణుప్రియని అటాక్ చేసింది రోహిణి. మెగా చీఫ్ అవ్వడానికి నాకు సపోర్ట్ చేస్తానని చెప్పి, పృథ్వీ కోసం ఆడావ్ అంటూ మండిపడింది. దీనికి తెలివిగా ఆన్సర్ ఇచ్చింది విష్ణుప్రియ. నేను నీకు హెల్ప్ చేద్దామని అనుకున్నానని, కానీ నువ్వు నా గురించి కొందరికి చెప్పిన విషయాలు తెలిసి వెనక్కి తగ్గానని అంటుంది. అయినప్పటికీ ఉడతా భక్తిగా కొన్ని సంచులు తీసి హెల్ప్ చేశానని చెప్పింది. ఎవరు ఏమనుకున్నా సరే .. పృథ్వీయే నా ఫస్ట్ ప్రయారిటీ అని తేల్చి చెప్పింది విష్ణుప్రియ. మొత్తంగా 11వ వారం బిగ్‌బాస్ తెలుగు 8లో ఆరుగురు నామినేషన్స్‌లో ఉన్నారు. వారు గౌతమ్, టేస్టీ తేజ, యష్మి గౌడ, అవినాష్, పృథ్వీ, విష్ణుప్రియ. వీరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ కానున్నారు.

Gautham Krishna Placed top in 11th week voting in bigg boss telugu 8

ఇక నామినేషన్స్ పూర్తి కాగానే సోషల్ మీడియాలో 11వ వారానికి సంబంధించి ఓటింగ్ ప్రారంభమైంది. దీని ప్రకారం.. వరుసగా రెండోసారి గౌతమ్ ఓటింగ్‌లో టాప్‌లో నిలిచారు. దాదాపు 25 శాతం ఓటింగ్‌తో డాక్టర్ బాబు లిస్ట్‌లో నెంబర్‌వన్‌గా నిలిచాడు. తర్వాత యష్మి గౌడ 21 శాతం ఓటింగ్‌తో సెకండ్ ప్లేస్‌లో, పృథ్వీరాజ్ శెట్టి 15 శాతం ఓటింగ్‌తో థర్డ్ ప్లేస్‌లో , టేస్టీ తేజ 14 శాతం ఓటింగ్‌తో ఫోర్త్ ప్లేస్‌లో నిలిచారు. ఇక విష్ణుప్రియ, అవినాష్‌లు 13 శాతం ఓటింగ్‌తో ప్రస్తుతానికి డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఓటింగ్ లైన్లు క్లోజ్ కావడానికి ఇంకా టైం ఉండటంతో ఫలితాలు ఎలా మారుతాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X