Bigg Boss Telugu 7: టాప్ 5లోకి గౌతమ్ కృష్ణ.. శివాజి, ప్రశాంత్‌కు బిగ్ షాక్.. డాక్టర్ తెలివి సూపర్

తెలుగు బుల్లితెరపై రికార్డులు క్రియేట్ చేస్తూ నెంబర్ వన్ షోగా దూసుకుపోతోంది బిగ్ బాస్. అందుకే నిర్వహకులు ఏమాత్రం బ్రేక్ తీసుకోకుండా వరుసగా సీజన్ల మీద సీజన్లను ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఇప్పటికే ఆరు రెగ్యూలర్, ఒక ఓటీటీ వెర్షన్ సీజన్లను కంప్లీట్ చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో దాన్ని విజయవంతంగా నడుపుతున్నారు. ఇందులోకి ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చి సెన్సేషన్ అయ్యాడు గౌతమ్ కృష్ణ. తాజాగా అతడు చేసిన పనితో శివాజి, ప్రశాంత్‌కు షాక్ తగిలింది. అసలేం జరిగింది? ఆ పూర్తి వివరాలను మీరే చూసేయండి!

ఏడో సీజన్ 12వ వారంలో కెప్టెన్సీ పోటీదారుల కోసం 'బిగ్ బాస్ మ్యాన్షన్' టాస్క్ ఇచ్చారు. ఇందులో ఓ హంతకుడు హత్యలు చేస్తుంటాడు. అతడిని కనిపెట్టి పోలీసులు అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఇందులో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిన వాళ్లు కెప్టెన్సీ టాస్కుకు కంటెండర్లు అవుతారు. బిగ్ బాస్ మ్యాన్షన్ టాస్కులో భాగంగా ప్రతి కంటెస్టెంట్‌కు ఒక్కో పాత్రను ఇచ్చారు.

Gautham Krishna Reveal Sivaji Secret.. High Chances to Get Top 5 Place In Bigg Boss Telugu 7

శివాజికి మిస్సెస్ బిగ్ బాస్‌ను మర్డర్ చేసిన హంతకుడి రోల్ ఇచ్చారు. అంతేకాదు, అతడికి సీక్రెట్ టాస్కును కూడా ఇస్తూ బిగ్ బాస్ సూచించిన ప్రతిసారి ఒకరిని డెడ్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఇందుకోసం శివాజికి ఓ మొబైల్‌ను కూడా ఇచ్చి తరచూ సంభాషణ జరుపుతూ వచ్చారు. మొత్తానికి ఈ టాస్కులో ప్రశాంత్‌ను డెడ్ చేసేశాడు. ఈ విషయం బిగ్ బాస్ ప్రకటించాడు.

ప్రశాంత్‌ను శివాజి డెడ్ చేసిన విషయాన్ని ఇంట్లోని ఎవరూ కనిపెట్టలేకపోయారు. కానీ, గౌతమ్ కృష్ణ మాత్రం తన తెలివితేటలను వాడి నిజం తెలుసుకున్నాడు. అంతేకాదు, దెయ్యంలా మారిపోయిన ప్రశాంత్‌తో 'ఏరా ప్రశాంత్.. నిన్ను డెడ్ చేసింది శివాజీ అన్ననే కదా' అంటూ వాళ్లిద్దరికీ షాక్ ఇచ్చేశాడు. కానీ, దీనికి ప్రశాంత్ స్పందించకుండానే వెళ్లిపోయాడు.

గౌతమ్ కృష్ణ తెలివితేటలను చూసిన వాళ్లంతా అతడి గురించే చర్చించుకుంటున్నారు. ఈ సీజన్‌లోకి డాక్టర్ బాబు ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చి.. మెంటల్, ఫిజికల్‌గా టాస్కులను ఆడుతూ 12 వారాల పాటు హౌస్‌లో కొనసాగుతున్నాడని చెప్తున్నారు. ముఖ్యంగా గౌతమ్ ఏ బ్యాచ్‌కు దగ్గరగా లేకపోవడం అతడికి ప్లస్ అవుతుందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

బిగ్ బాస్ హౌస్‌లో టాప్ కంటెస్టెంట్ అయిన శివాజిని ఎదురించే ప్రయత్నం ఎవరూ చేయడం లేదు. కానీ, ఒక్క గౌతమ్ కృష్ణ మాత్రమే ఆయన చేస్తున్న తప్పులను ఎత్తి చూపుతున్నాడు. ఇది కూడా గౌతమ్‌కు చాలా కలిసి వస్తోందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇది మాత్రమే కాదు.. ఈ డాక్టర్ బాబు బిగ్ బాస్ హౌస్‌లో ఎవరి గురించీ వాళ్ల ముందు కానీ వెనుక కానీ వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. కానీ, తనపైకి ఎవరు వచ్చినా ఊరుకోవడం లేదు. రానున్న వారాల్లో కూడా ఇదే పద్దతిని, ఆటతీరును కంటిన్యూ చేస్తే అతడు కచ్చితంగా టాప్ 5లో నిలిచి ఫినాలేలో అడుగు పెట్టే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఆ తర్వాత కూడా బలం పెంచుకుంటే మెరుగైన స్థానం దక్కించుకోవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X