Bigg Boss Telugu 7: చరిత్ర సృష్టించిన గౌతమ్.. దేశంలోనే ఏకైక కంటెస్టెంట్.. ఒక్క నిర్ణయంతో టాప్‌లోకి!
సాధారణంగా బుల్లితెరపై వచ్చే ఏ షో అయినా ఎలా నడుస్తుందో ఊహించవచ్చు. కానీ, ఒక్క కార్యక్రమం మాత్రమే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియకుండా ప్రేక్షకులను అయోమయానికి గురి చేస్తుంది. అదే రియాలిటీ ఆధారంగా నడిచే బిగ్ బాస్. తెలుగులో సూపర్ సక్సెస్ అయిన ఈ షో.. ఇప్పుడు ఏడో సీజన్‌ను జరుపుకుంటోంది. ఇందులో ఎన్నో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. అందుకు తగ్గట్లుగానే తాజాగా కెప్టెన్ గౌతమ్ కృష్ణ బిగ్ బాస్ చరిత్రలోనే ఏ కంటెస్టెంట్ చేయని విధంగా ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. ఆ సంగతులు మీరే చూడండి!
డాక్టర్ బాబు బాగా హైలైట్:ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుతో నడిచే సీజన్ అని ప్రకటించడంతో ఏడో దానిపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే కంటెంట్‌ను చూపిస్తున్నారు. ఇందులోకి మొత్తం 14 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. అందులో డాక్టర్ బాబు గౌతమ్ కృష్ణ ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించి హైలైట్ అయ్యాడు.

ఆటతో కేక.. అశ్వద్దామాగా:గౌతమ్ కృష్ణ ఆరంభం నుంచీ తనదైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా ఫిజికల్, మెంటల్ టాస్కులను దిగ్విజయంగా పూర్తి చేస్తూ సత్తా చాటుతున్నాడు. మధ్యలో సీక్రెట్ రూమ్‌కు వెళ్లొచ్చాడు. ఆ తర్వాత నుంచి అశ్వద్దామాగా తనలోని 2.O వెర్షన్‌ను చూపిస్తున్నాడు. ఇలా గతంలో కంటే మరింత స్ట్రాంగ్‌గా, మెచ్యూరిటీతో కనిపిస్తూ ఫాలోయింగ్‌ను పెంచుకుంటున్నాడు.
మద్దతుతో కెప్టెన్ గౌతమ్:సాధారణంగా ప్రతి వారం కెప్టెన్సీ టాస్కును ఏదో రకమైన టాస్కులతో ఇస్తుంటారు. అందుకు తగ్గట్లుగానే ఎనిమిదో వారం కూడా అలా కొన్ని టాస్కులు ఇచ్చి కెప్టెన్సీ పోటీదారులను ఎంపిక చేశారు. ఇందులో మొత్తం ఐదుగురు కంటెస్టెంట్లు కెప్టెన్సీ కోసం పోటీ పడ్డారు. కానీ, గౌతమ్ కృష్ణ మాత్రమే ఇంటి సభ్యులు అందరి మద్దతును కూడగట్టుకుని కెప్టెన్‌గా ఎంపిక అయ్యాడు.

ఆడవాళ్లకే ప్రాధాన్యతతో:బిగ్ బాస్ ఇంటికి కెప్టెన్ అయిన తర్వాత గౌతమ్ కృష్ణ ఎలా రూల్ చేస్తాడా అని అందరిలోనూ సందేహం ఉంది. కానీ, దాన్ని పటాపంచలు చేసేలా కొన్ని ఊహించని గొప్ప నిర్ణయాలు తీసుకుని ఔరా అనిపించాడు. ముఖ్యంగా గౌతమ్ కృష్ణ ఈ వారం తనకు డిప్యూటీలుగా లేడీ కంటెస్టెంట్లు రతికా రోజ్, శోభా శెట్టిని తీసుకుని ఆడవాళ్ల పట్ల తన గౌవరాన్ని చూపించుకున్నాడు.
కెప్టెన్‌గా గొప్ప నిర్ణయం:బిగ్ బాస్ ఇంటి కెప్టెన్‌గా గౌతమ్ ఎవరూ ఊహించని మరో నిర్ణయం తీసుకున్నాడు. 'ప్రతి ఇంట్లో ఆడవాళ్లు ఎన్నో రకాల పనులు చేస్తుంటారు. ఇంటి బాధ్యతలు చూసుకోవడంలో వాళ్లదే అప్పర్ హ్యాండ్. ప్రతి ఇంట్లో ఉన్న, ఇక్కడ ఉన్న, టీవీల్లో చూస్తున్న ఆడవాళ్లకు గౌరవంగా మన బిగ్ బాస్ హౌస్‌లో ఈ వారం ఫీమేల్ వీక్ జరుపుకుందాం. ఇందుకోసం ఈ వారం అంతా లేడీస్‌కు హాలీడేస్ ఇస్తున్నా' అని తెలిపాడు. దీంతో అతడి నిర్ణయాన్ని అందరూ మెచ్చుకుని ఓకే చెప్పారు.

కష్ట జీవి... పని దొంగ:తన కెప్టెన్సీలో గౌతమ్ మరో ఊహించని నిర్ణయం కూడా తీసుకున్నాడు. 'ప్రతి రోజూ లైట్స్ ఆఫ్ అయిన తర్వాత పని గురించి నిర్ణయం ఉంటుంది. అప్పుడు ఇంట్లో ఎవరు ఎక్కువ కష్టపడ్డారో వాళ్లకు కష్ట జీవి అని.. తక్కువ వర్క్ చేసిన వాళ్లకు పని దొంగ అని బిరుదులు ఇస్తాము. కష్ట జీవికి ఒక డ్రింక్ నేను ఇస్తాను. అలాగే, పని దొంగ తన రెండు గుడ్లను కూడా ఇవ్వాలి' అని చెప్పాడు.
నా మాటే శాసనం అని:గౌతమ్ కృష్ణ చెప్పిన రెండో దానికి కొందరు కంటెస్టెంట్లు ఒప్పుకోకపోవడంతో 'ఇది నా మాట.. నా మాటే శాసనం' అంటూ ఫన్నీగా చెప్పాడు. మొత్తానికి ఈ కుర్రాడు తీసుకున్న నిర్ణయంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అదే సమయంలో బిగ్ బాస్ చరిత్రలోనే ఇలాంటి నిర్ణయం ఏ కంటెస్టెంట్ తీసుకోలేదు. ఫలితంగా గౌతమ్ నేషనల్ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు.


Click it and Unblock the Notifications











