నయనీతో గౌతమ్ కృష్ణ డేటింగ్: యావర్‌కు హ్యాండ్ ఇచ్చేసిందా.. డాక్టర్ బాబు రియాక్షన్ చూశారంటే!
తెలుగు బుల్లితెరపైకి అంచనాలు లేకుండానే వచ్చినా.. అనతి కాలంలోనే సెన్సేషన్ అయిన షోనే బిగ్ బాస్. ఇది రికార్డులు బ్రేక్ చేసి దేశంలోనే టాప్ షోగా మారడంతో పాటు ఎంతో మంది బిగ్ సెలెబ్రిటీలుగానూ మార్చేసింది. అలాంటి వారిలో ఏడో సీజన్ కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ ఒకడు.
బిగ్ బాస్ షోలో తనదైన ఆటతీరుతో సత్తా చాటిన అతడు.. యమ పాపులర్ అయ్యాడు. షో తర్వాత కొన్ని ప్రాజెక్టులు చేస్తోన్న గౌతమ్.. తాజాగా నయనీ పావనీతో ఓ కవర్ సాంగ్ చేశాడు. దీంతో వీళ్లిద్దరిపై ట్రోల్స్ వస్తున్నాయి. తాజాగా దీనిపై అతడు ఎలా రియాక్ట్ అయ్యాడో మీరే చూడండి!

గౌతమ్ అలా.. నయనీ ఇలా: బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి కంటెస్టెంట్లుగా వచ్చిన గౌతమ్ కృష్ణ ఇప్పటి వరకూ అధికారికంగా ఒక్క ప్రాజెక్టును కూడా ప్రకటించలేదు. కానీ, అతడు కొన్నింట్లో నటిస్తున్నట్లు తెలిసింది. ఇక, నయనీ పావనీ మాత్రం కవర్ సాంగ్‌లతో యమ హల్చల్ చేస్తోంది. ముఖ్యంగా ప్రిన్స్ యావర్‌తో కలిసి సాంగ్స్, ఫొటో షూట్ చేస్తోంది. దీంతో ఈ అమ్మడు గతంలో కంటే ఎక్కువగా సెన్సేషన్ అవుతోంది.

గౌతమ్, నయనీ.. తెలియదే: కవర్ సాంగ్‌లతో యమ ఫేమస్ అయిన నయనీ పావనీ.. తాజాగా ఏడో సీజన్ కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణతో కూడా 'తెలియదే' అంటూ సాంగే పాటను చేసింది. ఇది జనవరి 18వ తేదీనే విడుదల అయింది. దీనికి అన్ని వర్గాల ఆడియెన్స్ నుంచి అదిరిపోయే స్పందన కూడా లభించింది. ఫలితంగా ఈ సాంగ్ చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్‌గా మారిపోయింది.

ఆ సాంగ్‌పై ట్రోల్స్ చేస్తూ: బిగ్ బాస్ ఏడో సీజన్ తర్వాత నయనీ పావనీ.. ప్రిన్స్ యావర్‌తో ఎక్కువగా క్లోజ్‌గా ఉంటోంది. అతడితో కలిసి 'కుర్చీ మడతపెట్టి' సాంగ్ చేయడంతో పాటు పలు ఫొటోషూట్లను కూడా చేసింది. దీంతో వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అలాంటిది ఇప్పుడు నయనీ.. గౌతమ్‌తో సాంగ్ చేయడంపై కొందరు నెటిజన్లు ట్రోల్స్ చేస్తూ ఆమెను దారుణంగా విమర్శిస్తున్నారు.
యావర్‌కు హ్యాండిచ్చింది: గౌతమ్ కృష్ణతో నయనీ పావనీ సాంగ్ చేయడంపై కొందరు శృతి మించి మరీ కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఆమె ప్రిన్స్ యావర్‌కు హ్యాండ్ ఇచ్చిందని, గౌతమ్‌తో డేటింగ్ చేస్తుందని ఆరోపిస్తూ దారుణమైన పోస్టులు పెడుతున్నారు. దీంతో ఇది సోషల్ మీడియాలో వివాదంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ వ్యవహారంపై గౌతమ్ కృష్ణ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.

మాట్లాడడం తప్పు మచ్చా: తాజాగా గౌతమ్ కృష్ణ ఇన్‌స్టాలో నయనీ పోస్ట్ కింద 'మచ్చా అందరికీ ఒక విషయం చెప్తాను. నేను నెగిటివిటీకి ఎక్కువగా రియాక్ట్ కాను. కానీ, ఇక్కడ ఒక అమ్మాయి ఉంది. ఆమె (నయనీ) నాకు మంచి ఫ్రెండ్. మేమంతా నటులం. ఒక మనిషితో అయినా.. బొమ్మతో అయినా అదే రకంగా నటిస్తాం. దాన్ని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం తప్పు మచ్చా' అని రాసుకొచ్చాడు.

మీ లైఫ్ సరిగా చూడండి: అదే కామెంట్‌లో గౌతమ్ కృష్ణ 'నేను ఏమైనా అన్నా తీసుకోగలుగుతాను. కానీ, అందరూ అదే రకంగా తీసుకోలేరు. ఎండ్ ఆఫ్ ది డే అందరూ మనుషులే. ఎవరి లైఫ్ వాళ్ల ఇష్టం. అర్ధం చేసుకోండి. మీరు ఏమన్నా కూడా ఒకరి క్యారెక్టర్ మారిపోదు. మేం మంచి స్నేహితులం అని గుర్తు పెట్టుకోండి. నెగిటివ్‌గా మాట్లాడే వాళ్లు మీ లైఫ్‌ను మీరు సరిగ్గా చూసుకుంటే బాగుపడతారు' అన్నాడు.


Click it and Unblock the Notifications











