Bigg Boss Telugu 7: శివాజికి కంటెస్టెంట్ షాక్.. అమ్మాయిలకు అన్యాయం అంటూ.. ఎలిమినేషన్ కుట్ర లీక్

చాలా అనుమానాల నడుమ తెలుగు బుల్లితెరపైకి వచ్చినా.. అనూహ్యంగా అందరి ఆదరాభిమానాలను సొంతం చేసుకుని నెంబర్ వన్ షోగా ఎదిగిపోయింది బిగ్ బాస్. కొత్త కాన్సెప్టుతో ప్రసారం అయ్యేదే అయినా దీనికి ప్రేక్షకులు భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను అందించారు. ఫలితంగా ఇది భారీ స్థాయిలో టీఆర్పీ రేటింగ్‌ను సొంతం చేసుకుంటూ రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇలా ఎన్నో సీజన్లను పూర్తి చేసుకుని.. ఇప్పుడు ఏడో దానితో మజాను పంచుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో హీరో శివాజికి ఓ కంటెస్టెంట్ షాకిచ్చాడు. ఆ వివరాలు మీకోసమే!

బిగ్ బాస్ ఏడో సీజన్‌ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ముఖ్యంగా ఇది ఉల్టా పుల్టా కాన్సెప్టుతో నడుస్తుండడంతో ఇందులో ఎన్నో ఊహించని సంఘటనలు కనిపిస్తున్నాయి. అయితే, నామినేషన్స్ ప్రక్రియ మాత్రం ఎప్పటిలాగే ఫైర్‌తో సాగుతోంది. ఇలా ఈ సీజన్‌లో జరిగిన అన్ని వారాల్లోనూ హీట్ పెంచేసే గొడవలే జరిగాయి. ముఖ్యంగా ఏడో వారంలో అయితే యుద్దాలే జరిగాయి.

 Gautham Krishna Unexpected Words on Sivaji in Bigg Boss Telugu 7 Show

ఏడో వారానికి సంబంధించిన నామినేషన్స్ టాస్కును కుండలు పగలగొట్టే కాన్సెప్టుతో తీసుకు వచ్చారు. దీన్ని సోమ, మంగళవారాల్లో ప్రసారం చేశారు. ఇందులో కొందరి మధ్య ఎన్నో బీభత్సమైన మాటల యుద్దాలే జరిగాయి. ఇక, తాజాగా ప్రసారం అయిన ఎపిసోడ్‌లో హీరో శివాజిని గౌతమ్ కృష్ణ నామినేట్ చేస్తూ చెప్పిన రీజన్ పెద్ద వివాదానాకి కారణం అయింది.

తన వంతు వచ్చినప్పుడు గౌతమ్ 'అన్నా.. మీరు మీ గాయం వల్ల సరిగా గేమ్ ఆడలేకపోయారు. మీరు వెళ్లిపోతే చక్కగా ఆడే నయనీ పావని, శుభశ్రీ అన్యాయం జరిగేది కాదు. యంగ్ టాలెంట్‌కు మీరు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి మీరు ఎలిమినేట్ అవ్వాలని నామినేట్ చేస్తున్నా' అంటూ శివాజికి షాకిచ్చాడు. దీనికతడు 'లాస్ట్ వీక్ గెలవడానికి కారణం నేను కూడా అని అందరూ అన్నారు. నువ్వేమి గెలిచావు' అని ప్రశ్నించాడు.

శివాజి ప్రశ్నకు గౌతమ్ 'నా పాయింట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఒక్క గేమ్ కాదు.. ఏడు గేమ్‌లూ ఆడాను. మేం విన్ అయ్యాం.. నీకంటే బెటర్‌గా ఆడాను' అని అన్నాడు. దీనికి ఆయన 'మరి నువ్వు పవర్ అస్త్ర గెలిచావా? అసలు హౌస్‌మేట్ అయ్యావా' అని అడిగాడు. దీంతో తడబడ్డ గౌతమ్ రూట్ మార్చేసి వేరే టాపిక్‌లను తీసుకు రావడం మొదలు పెట్టాడు.

 Gautham Krishna Unexpected Words on Sivaji in Bigg Boss Telugu 7 Show

గౌతమ్ మాటలకు శివాజి 'నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా వర్కౌట్ కాదు తమ్ముడూ' అన్నాడు. దీనికతడు 'తలకిందులుగా ఎందుకు ఉండాలి? మీరు 96 సినిమాలు చేసిని అనుభవం ఇదేనా' అంటూ వ్యక్తిగత జీవితాన్ని టచ్ చేశాడు. దీంతో శివాజికి కోపం వచ్చి 'తమ్ముడూ నీ పరిస్థితి ఇదే. నువ్వు ఏమీ చేయలేవు. నీవల్ల అస్సలు కాదు' అని కూల్‌గా అన్నాడు.

అనంతరం గౌతమ్ 'అసలు మీరు ఎవరన్నా? వర్కౌట్ అవుతుందో లేదో నాకు తెలుసు. ఏడు వారాలు నేను వర్కౌట్ చేసుకున్నా. నాకు ఎవడూ హెల్ప్ చేయలేదు. నేను కొత్తోడినే. నాకు ఇండస్ట్రీలో ఎవడూ తెలియదు. నా దగ్గర డబ్బుల్లేవు. మీరు 96 సినిమాలు చేశారు కదా. అయినా మీతో 7 వారాలు ఉన్నాను కదా' అంటూ రెచ్చిపోయాడు. దీంతో శివాజి ఇవన్నీ ఎందుకు వచ్చి కొట్టు అని గొడవకు పుల్‌స్టాప్ పెట్టాడు.

ఇక, శివాజిని నామినేట్ చేసిన పాయింట్ తనకు నచ్చలేదంటూ ప్రిన్స్ యావర్.. గౌతమ్‌ను నామినేట్ చేశాడు. కానీ, దీనికి అతడు ఒప్పుకోలేదు. అప్పుడు తన దగ్గర చాలా పాయింట్లు ఉన్నాయని వాటిని వివరించాడు. అలాగే, శోభాను కెప్టెన్సీ టాస్కు నుంచి ఎలిమినేట్ చేయాలని గౌతమ్ చేసిన కుట్రను ప్రిన్స్ రివీల్ చేశాడు. దీంతో అతడి బండారం బట్టబయలు అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X