Bigg Boss 7 Telugu: షో నుంచి గౌతమ్ ఔట్.. నాగార్జునకు స్పెషల్ రిక్వెస్ట్.. రికార్డు రిపీట్ అవుతుందా!
బిగ్ బాస్.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అస్సలు పరిచయం అవసరం లేని షో ఇది. అంతలా ఇది ఏడేళ్లుగా అందరినీ అలరిస్తూ నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది. ఎప్పుడు ప్రసారం అయినా భారీ రెస్పాన్స్‌ను దక్కించుకుంటూ సాగిపోతోంది. ఇప్పుడు ఏడో సీజన్ కూడా అదే రీతిలో ముందుకు సాగుతోంది. ముఖ్యంగా ఇది ఉల్టా పుల్టా కాన్సెప్టుతో నడుస్తుండడంతో నిర్వహకులు దీన్ని సరికొత్త అంశాలతో నడుపుతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఒకేసారి ఇద్దరిని ఎలిమినేట్ చేసేశారు. ఆ సంగతులేంటో మీరే కూడా చూసేయండి మరి!
ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుతో నడిచే సీజన్ కావడంతో ఏడో దానిపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే కంటెంట్‌ను చూపిస్తున్నారు. ఇక, ఇందులోకి మొత్తం 14 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. వీరిలో నాలుగు వారాల్లో కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతికా రోజ్‌లు ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.

బిగ్ బాస్ ఐదో వారం నామినేషన్‌లో ఏడుగురు కంటెస్టెంట్లు ఎలిమినేషన్ జోన్‌లోకి వెళ్లారు. అందులో టేస్టీ తేజ, ప్రిన్స్ యావర్, ప్రియాంక, శివాజి, శుభశ్రీ రాయగురు, గౌతమ్ కృష్ణ, అమర్‌దీప్‌లు ఉన్నారు. వీరిలో ఆదివారం ఎపిసోడ్ ప్రారంభం అయిన కొద్ది సేపటికే శుభశ్రీ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. దీంతో ఆమె ఐదు వారాలకే పరిమితం అయిపోయి షో నుంచి వెళ్లిపోయింది.
శుభశ్రీ రాయగురు ఎలిమినేట్ అయిన తర్వాత హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లలో ఎవరు టాప్ ప్లేయర్ అనే నాగార్జున ప్రశ్నించడంతో అందరూ తలో ఒక పేరును చెప్పారు. ఇందులో ఎక్కువ ఓట్లు శివాజికి వచ్చాయి. ఆ తర్వాత స్టేజ్ మీద కుండలు పగలగొట్టిన నాగార్జున శివాజితో పాటు ప్రియాంక జైన్ సేఫ్ అయినట్లు తెలిపాడు. అనంతరం ప్రిన్స్ యావర్‌ను కూడా సేఫ్ చేసేశాడు.
ఇక, చివర్లో ముగ్గురు మిగలగా అందులో అమర్‌దీప్ సేఫ్ అవగా.. టేస్టీ తేజ, గౌతమ్ కృష్ణలు తక్కువ ఓట్లు పడిన కంటెస్టెంట్లుగా ఉన్నారు. ఇక, వీళ్లిద్దరిలో కంటెస్టెంట్‌గా ఉండడానికి ఎవరు అనర్హుడు అనే టాస్క్ పెట్టగా.. గౌతమ్‌కు ఎక్కువ ఓట్లు పడ్డాయి. దీంతో వాళ్ల అభిప్రాయం ఆధారంగా చేసుకుని అతడినే ఎలిమినేట్ చేస్తున్నట్లు నాగార్జున ప్రకటించాడు.
ఎలిమినేట్ అయిన తర్వాత గౌతమ్ కృష్ణ కాస్త ఎమోషనల్‌గానే స్టేజ్ మీదకు వచ్చాడు. హౌస్‌లో ఉన్న వారిలో ఫేక్ ఎవరు? రియల్ ఎవరు? అని అతడితో నాగార్జున ఓ ఆటను ఆడించాడు. అనంతరం గౌతమ్‌ను బయటకు పంపించేశాడు. అంతలోనే అతడిని వెనక్కి పిలిచి మరీ నీకు మరో ఛాన్స్ ఇస్తున్నా అని చెప్పాడు. అనంతరం గౌతమ్‌ను సీక్రెట్ రూమ్‌లోకి పంపించాడు.
ఇదిలా ఉండగా.. గతంలో వచ్చిన చాలా సీజన్లలో సైతం సీక్రెట్ రూమ్‌లోకి పలువురు కంటెస్టెంట్లు వెళ్లారు. అందులో రాహుల్ సిప్లీగంజ్, అఖిల్ సార్థక్, సోహెల్, ఆరియానా వంటి వాళ్లు ఫినాలేలోకి అడుగు పెట్టారు. ఇప్పుడు గౌతమ్ కూడా అదే రికార్డును రిపీట్ చేస్తాడేమో చూడాలి.


Click it and Unblock the Notifications











