Bigg Boss Telugu 7: రేస్ నుంచి ఐదుగురు ఔట్.. టాప్ కంటెస్టెంట్ చేతిలోకి ఫినాలే అస్త్ర!

బిగ్ బాస్ తెలుగు 7 రియాలిటీ షోను సామాన్య ప్రజలు కూడా ఆదరిస్తున్నారు. బుల్లితెరపై అత్యధిక టీఆర్పీతో ముందుకు వెళ్తోంది. ఇక ఈ గేమ్ షో.. చివరి అంకానికి చేరుకుంటుంది. ఇంకో 2 వారాల్లో ఈ గేమ్ షో ముగియనుంది. హౌస్ లో 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో 7 మంది కంటెస్టెంట్స్ ఈ వారం నామినేషన్స్ లో ఉన్నారు. అయితే హౌస్ లో ప్రస్తుతం టికెట్ టు ఫినాలే పోటీలు జరుగుతున్నాయి. ఈ రేస్ నుంచి ఇప్పటి వరకు ఐదు మంది కంటెస్టెంట్స్ ఔట్ అయ్యారు. ఇక ఆ వివరాల్లోకి వెళితే...

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 సెప్టెంబర్ 3న ప్రారంభం అయి 13వారాలుగా అలరిస్తూ వస్తుంది. హౌస్ నుంచి ఇప్పటి వరకు కిరణ్ రాథోడ్, షకీలా, సింగర్ దామిని, శుభ శ్రీ రాయగురు, రతికా రోజ్, నయని పవని, పూజా మూర్తి, ఆట సందీప్, టేస్టీ తేజ, బోలే షవాలి, రతికా రోజ్, అశ్విని శ్రీ ఎలిమినేట్ అయ్యారు. ఇక హౌస్ లో మిగిలింది 8 మంది కంటెస్టెంట్స్. వారిలో శివాజీ, ప్రశాంత్, యావర్, అమర్, గౌతమ్, అర్జున్, ప్రియాంక, శోభా ఉన్నారు.

Gautham, Sivaji, Shobha, Yawar, Priyanka Out From Ticket To Finale Race Prashanth Top in Bigg Boss Telugu 7 Full Details Here

ఇక ఈ వారం నామినేషన్స్ లో 7 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఒక్క అమర్ దీప్ తప్ప ఈ వారం అందరూ నామినేషన్స్ లో ఉన్నారు. ఇక ఈ వారం టికెట్ టు ఫినాలే పోటీలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు హౌస్ లో 9 టాస్కులు జరిగాయి. ఇక మొదటి రౌండ్ లో ప్రశాంత్ ఔట్ అయినా.. అర్జున్ అంబటి గెలిచాడు. రెండో టాస్కులో ప్రశాంత్ విన్ అయ్యాడు.

ఇక ఆ తర్వాతి టాస్కులో అర్జున్ అంబటి విన్ అవ్వగా... ఇప్పటి వరకు శివాజీ, శోభా శెట్టి, ప్రియాంక, యావర్, గౌతమ్ అవుట్ అయ్యారు. ఇక మిగిలింది ముగ్గురు. ఇప్పటి వరకు నాలుగు టాస్కుల్లో ప్రశాంత్ గెలిచాడు. ఇక అర్జున్ 3 టాస్కులు గెలిచాడు. అమర్ దీప్ 2 టాస్కులు గెలిచాడు. మొత్తంగా హౌస్ లో 9 టాస్కులు నిర్వహించారు.

Gautham, Sivaji, Shobha, Yawar, Priyanka Out From Ticket To Finale Race Prashanth Top in Bigg Boss Telugu 7 Full Details Here

ఇక టాప్ లో పల్లవి ప్రశాంత్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సారి టికెట్ టు ఫినాలే కూడా పల్లవి ప్రశాంత్ చేతిలోకి పోనుందని తెలుస్తోంది. అయితే ఈ టికెట్ టు ఫినాలే అనేది లో కంటెస్టెంట్ చేతికి వెళ్తే ఏమైనా యూజ్ ఉంటుంది. శివాజీ, అమర్, ప్రశాంత్ వీళ్లు టాప్ కంటెస్టెంట్స్. వీళ్లు ఎలాగూ ఫినాలేకి వెళ్తారు.

ఇక ఈ వారం ఓటింగ్ విషయానికి వస్తే.. టాప్ లో ప్రశాంత్, శివాజీ, ప్రియాంక ఉన్నారు. ఇక ఆ తర్వాతి స్థానంలో గౌతమ్, శోభా, యావర్ ఉన్నారు. ఇక చివరి స్థానంలో అర్జున్ ఉన్నారు. ఈ టికెట్ టు ఫినాలే అర్జున్ కానీ,యావర్ కానీ గెలుచుకుని ఉంటే.. టాప్ 5కి వెళ్లే ఛాన్స్ వచ్చేది. యావర్ గ్రాఫ్ రోజు రోజుకు తగ్గుతూ వస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X