100 రోజులు సెక్స్ లేకుండా ఉండగలవా? ‘బిగ్ బాస్ షోపై గాయత్రి గుప్తా ఫైర్

Recommended Video

Bigg Boss Telugu 3 : సెక్స్ లేకుండా 100 రోజులు ఉంటావా అని అడిగారు.. గాయత్రి గుప్తా సంచలన వ్యాఖ్యలు!!

తన అందంతో పాటు బోల్డ్ స్టేట్‌మెంట్లు ఇస్తూ తరచూ వార్తల్లో నిలుస్తుంది గాయత్రి గుప్తా. ఈ పేరు చాలా మందికి తెలియకపోవచ్చు.. కానీ, 'ఫిదా' సినిమాలో నటించిన అమ్మాయి అంటే అందరికీ తెలిసిపోతుంది. ఈ సినిమా ద్వారా ఎంత పేరు వచ్చిందో తెలియదు కానీ, తన బోల్డ్ స్టేట్‌మెంట్లతో మాత్రం ఈమె బాగా పాపులర్ అయింది. అలాంటి ఈ తెలుగమ్మాయి పలు సినిమాల్లో సైతం మెప్పించింది.

కాస్టింగ్ కౌచ్ ఈమెతోనే మొదలు

కాస్టింగ్ కౌచ్ ఈమెతోనే మొదలు

తెలుగు సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనే అంశం ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఇది సంచలన నటి శ్రీరెడ్డితోనే మొదలైందని అంతా అనుకుంటారు. కానీ, ఆమె కంటే ముందే ఈ అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చింది గాయత్రి గుప్తానే. తనను అవకాశాలు ఇస్తానని చాలా మంది మోసం చేశారని, అలాగే కొంతమంది ఛాన్స్ కావాలంటే ఏం చేస్తావని ప్రశ్నించారని చెప్పి బాంబు పేల్చింది.

‘బిగ్ బాస్' ఆఫర్

‘బిగ్ బాస్' ఆఫర్

గత సంవత్సరం జరిగిన ‘బిగ్ బాస్' సీజన్ -2లో ఈమెకు అవకాశం దక్కింది అని అప్పట్లో ప్రచారం జరిగింది. అప్పటికే కాస్టింగ్ కౌస్ వివాదంతో పాపులర్ అయిన ఈమెను స్టార్ మా యాజమాన్యం ‘బిగ్ బాస్'లోకి తీసుకోవడానికి ప్రయత్నించింది. కాకపోతే ఎందుకో చివరి నిమిషంలో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుందని వార్తలు వచ్చాయి.

 ‘బిగ్ బాస్' గురించి సంచలన ఆరోపణ

‘బిగ్ బాస్' గురించి సంచలన ఆరోపణ

‘బిగ్ బాస్' ఆఫర్ గురించి తాజాగా ఓ న్యూస్ చానెల్ డిబెట్‌లో మాట్లాడింది గాయత్రి గుప్తా. ‘‘నాకు లాస్ట్ ఇయర్‌లో జరిగిన ‘బిగ్ బాస్' సీజన్ -2లో ఆఫర్ వచ్చిన విషయం నిజమే. అందుకోసం నేను స్టార్ మా వాళ్లతో మాట్లాడడానికి కూడా వెళ్లాను. అప్పుడు నన్ను ‘బిగ్ బాస్' షో వాళ్లు ‘హౌస్‌లోకి వస్తే వంద రోజులు సెక్స్ లేకుండా ఉండగలవా..? నీ సెక్స్ జీవితాన్ని ఎలా మేనేజ్ చేసుకుంటావు..?' అని ప్రశ్నించారు'' అంటూ చెప్పుకొచ్చింది.

నా ఫ్రెండ్స్ చెప్పారు

నా ఫ్రెండ్స్ చెప్పారు

‘‘బిగ్ బాస్' ఆఫర్ క్యాన్సిల్ అయిన తర్వాత హౌస్‌లోకి వెళ్లిన నా ఫ్రెండ్స్‌ను హౌస్‌లో ఎలా ఉంటుంది..? లోపల ఏం జరుగుతుంది..? అని అడిగాను. వాళ్లంతా.. క్యాన్సిల్ అయిందే మంచిదైంది అన్నారు. నేనేమీ రెండు నాళ్కల ధోరణితో ఉండను. నేను బయట ఎలా ఉన్నానో.. అక్కడ కూడా అలాగే ఉంటాను అన్నాను. దానికి వాళ్లు.. నువ్వు అలా అనుకుంటున్నావు. నీకు ఇరిటేషన్ వచ్చి కోపంలో మాట్లాడిన దానినే వాళ్లు ప్లే చేస్తారు. నువ్వు మంచిగున్నవి ఏమీ చూపించరు. అది కూడా వాళ్ల మూడ్‌ను బట్టి ఉంటుంది. అక్కడ ఏం జరిగిందో అది వేయరు.. వాళ్లు ఏం చూపించాలనుకుంటున్నారో అదే ప్లే చేస్తారు. నువ్వు ఎలా ఉన్నావో అది బయటకు వస్తుందన్న గ్యారెంటీ లేదు'' అని చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X