‘నన్ను అనుభవించాలని అలాంటి స్కెచ్... ఆ ప్రొడ్యూసర్ గంటసేపు దారుణంగా’

చిత్ర పరిశ్రమలో హీరోయిన్లపై జరిగే దారుణాలపై నిత్యం ఎక్కడో ఒక చోట వార్తలు వస్తూనే ఉన్నాయి. హీరోయిన్లు, మహిళా నటులు తాము ఎదుర్కోన్న ఇబ్బందులు, వేధింపుల గురించి చెబుతూనే ఉన్నారు. కానీ వీటికి శాశ్వత పరిష్కారం మాత్రం దొరకడం లేదు. ఆరోజుకు వార్తల్లో వైరల్ కావడం.. మరుసటి రోజుకు అందరూ మరిచిపోవడం జరుగుతోంది. తాజాగా తనకు ఓ నిర్మాత చేతిలో ఎదురైన అనుభవాన్ని బయటపెట్టింది నటి గాయత్రి గుప్తా. ఈ వివరాల్లోకి వెళితే..

Also Read
40 ఏళ్లు దాటాక వెంటాడుతున్న ఆ డేంజర్... నటి ప్రియ ఎమోషనల్
40 ఏళ్లు దాటాక వెంటాడుతున్న ఆ డేంజర్... నటి ప్రియ ఎమోషనల్

గతంలో మీటూ ఉద్యమం సమయంలో క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో చిత్ర పరిశ్రమను షేక్ చేసింది గాయత్రి గుప్తా. సినిమాలపై ఆసక్తితో తొలుత షార్ట్ ఫిలిమ్స్‌తో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ అనంతరం టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఫిదా, కొబ్బరి మట్ట, ఐస్ క్రీం తదితర చిత్రాలతో ఆకట్టుకుంది. సినిమాలతో కంటే వ్యక్తిగత విషయాలు, వివాదాలతోనే గాయత్రీ ఎక్కువగా వార్తల్లో నిలిచింది. కొద్దిరోజుల క్రితం తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని.. దాతలు తనకు సాయం చేయాలని కన్నీటి పర్యంతమైంది. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గాయత్రి మాట్లాడుతూ.. తనను ఓ నిర్మాత లైంగికంగా ఇబ్బంది పెట్టాడని బయటపెట్టింది.

Gayathri Gupta Shocking Allegations Against Tollywood Producer

నాకు కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి.. సాక్షి ఛానెల్‌లో జాయిన్ అయిన ఫస్ట్ డే ఎగ్జయిటయ్యా. నాకు ఇష్టమైన జాబ్.. నేను సొంతంగా తెచ్చుకున్నానని గర్వపడ్డాను. చిన్నప్పటి నుంచి నువ్వు దేనికీ పనికిరావు, నువ్వు చచ్చిపో అని మా ఇంట్లో మాటలు పడుతూ పెరిగిన మనిషిని.. నేను వేస్ట్ కాదు. ఏదో ఒకటి చేయగలను అని నిరూపించా. ఫస్ట్ డే స్టెప్స్ ఎక్కుతున్నా.. నడవలేకపోతున్నా. కాలు తీస్తే బ్యాక్ సైడ్ నుంచి మంటలు వచ్చేస్తున్నట్లుగా అనిపించింది. పై వాళ్లకు ఫోన్ చేస్తే వచ్చి పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేశారు. కానీ నాకేం అర్ధం కావడం లేదు. అప్పటికీ నా షో స్టార్ట్ కాలేదు.. తర్వాత పిలుస్తామని చెప్పడంతో ఇంటికి వచ్చేశా. అప్పటి నుంచి నా హెల్త్ పాడవటం స్టార్ట్ అయ్యింది. నా హెల్త్ ఎందుకు పాడైంది అంటే ఈ టెన్షన్, ఆందోళన వల్లేనని గాయత్రి గుప్తా అన్నారు.

Recommended For You
Ustaad Bhagat Singh Day 2 Collections: ఉస్తాద్ కలెక్షన్స్‌పై ధురంధర్ 2 దెబ్బ.. పవన్ మూవీకి ఎన్ని కోట్లంటే?
Ustaad Bhagat Singh Day 2 Collections: ఉస్తాద్ కలెక్షన్స్‌పై ధురంధర్ 2 దెబ్బ.. పవన్ మూవీకి ఎన్ని కోట్లంటే?

బిగ్‌బాస్ ద్వారా నేను మాట్లాడింది బయటకు కనిపించింది. బాండ్ సైన్ చేశాం కాబట్టి, ప్రూఫ్స్ వున్నాయి కాబట్టి ధైర్యం చేసి మాట్లాడా. ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నా మీద ఎన్ని రేప్ అటెంప్ట్‌లు అయ్యాయి, ఎంతమంది నన్ను వేధించారు అనేదానికి ప్రూఫ్‌లు లేవు. చాలా అమాయకంగా తిరిగా. నా తెలుగు ప్రజలు అనేవాళ్లు సేఫ్టీ. ఇంజనీరింగ్‌లో ఉన్నప్పుడు నా సీనియర్స్ ఆ టైప్ వీడియోలు చూపించారు. అప్పుడు నాకు గుండెదడ వచ్చింది. హాలీవుడ్‌కు వెళితే.. ఇవన్నీ ఉంటాయా? మన తెలుగుజాతి బెటర్ అని నమ్మి.. ముందు ఇక్కడ పీకి చూపిద్దామని అనుకున్నా. కానీ వెళ్లిన ప్రతి దగ్గరా కమిట్‌మెంట్ అడగటం.. రేప్ అటాక్‌లు చేసేవాళ్లు అని గాయత్రి గుప్తా గుర్తుచేసుకున్నారు.

You May Also Like
Dhurandhar 2: ఆ రక్తపాతానికి నోబెల్ ప్రైజ్ పక్కా... ధురంధర్ 2పై స్టార్ హీరోయిన్ షాకింగ్ రివ్యూ
Dhurandhar 2: ఆ రక్తపాతానికి నోబెల్ ప్రైజ్ పక్కా... ధురంధర్ 2పై స్టార్ హీరోయిన్ షాకింగ్ రివ్యూ

ఒక సినిమాకు సంబంధించి సగం నుంచి నన్ను ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారు. దాంతో జాగ్రత్తగా ఉంటూ వస్తున్నా, ఎక్కడికి వెళ్లినా నా ఫ్రెండ్‌ని వెంట పెట్టుకునే దానిని. ఓ టాప్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ కలిసి నా మీద చాలా వేధింపులకు గురిచేశారు. ట్రైలర్ హిట్ అయ్యిందని పార్టీ ఏర్పాటు చేసి మందు తాగమని బలవంతం చేశారు. నాకు మొహమాటం ఎక్కువ. చిన్నప్పటి నుంచి ప్రేమ లేకుండా పెరిగిన అమ్మాయిని కదా? నలుగురితో కలవాలి, నా గురించి పాజిటివ్‌గా తీసుకోవాలనే ప్రెజర్‌లో మొహమాటం ఎక్కువ వచ్చేస్తుంది. నో చెప్పలేక బలవంతం చేస్తే మందు తాగేశా. నాకు హెల్త్ ఇష్యూ ఉండటం వల్ల మందు తాగితే పెయిన్ వచ్చేస్తుంది. మందు తాగడం అనేది నాకు ఇష్టం ఉండదు. తాగను అని చెప్పినా బలవంతంగా నోట్లోకి తోసేశారు. దాంతో ఔటైపోయానని గాయత్రి గుప్తా తెలిపారు.

Ranveer Singh: ధురంధర్ 2 హీరోకి చేదు అనుభవం... రణ్‌వీర్‌ సింగ్‌కి హీరోయిన్ చెంపదెబ్బ
Ranveer Singh: ధురంధర్ 2 హీరోకి చేదు అనుభవం... రణ్‌వీర్‌ సింగ్‌కి హీరోయిన్ చెంపదెబ్బ

నా బాయ్‌ఫ్రెండ్‌ని ఎందుకైనా మంచిదని తీసుకెళ్లా. అయితే మా వాడికి ఊరి నుంచి ఏదో కాల్ వచ్చి, నేను అర్జెంట్‌గా వెళ్లాలని చెప్పి అతను వెళ్లిపోయాడు. నేను ఒక్కదానినే ఉండటంతో కారులో డ్రాప్ చేస్తామని చెప్పారు. కారు టైరు రిపేర్ ఉందని ప్రొడ్యూసర్ గారి ఇంట్లో ఉండు.. నేను రిపేర్ చేయించుకుని వస్తామని డైరెక్టర్ వెళ్లిపోయాడు. ఇద్దరం కిందే ఉన్నాం.. ఆ ప్రొడ్యూసర్ ఫోన్ మాట్లాడుతున్నట్లు డ్రామాలు చేసి.. డ్రైవర్ రావడానికి లేటు పడుతుంది, రాత్రి అవుతుంది కదా పైన కూర్చొందామని పైకి తీసుకెళ్లి నా డ్రెస్ లాగడం మొదలుపెట్టాడు. ఆ రోజు నన్ను ఆ డ్రెస్సే కాపాడింది.. పెద్ద గౌను అది, మా డిజైన్ కొంచెం లూజుగా ఉందని కుట్లు వేసింది. మొత్తం డ్రెస్ అంతా పట్టుకుని ఓ మూలన కూర్చొన్నా. గంటసేపు వేధించాడు.. నా ఫోన్ స్విచ్ఛాప్ అయిపోయింది, నేను తాగేసి ఉన్నాను. ఇక వర్కవుట్ కావడం లేదని డైరెక్టర్‌కి ఫోన్ చేసి నన్ను ఇంటి దగ్గర దించేయమన్నారు అని గాయత్రి గుప్తా గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X