‘రాజీవ్ కనకాలను అలా ఇష్టపడ్డా... సుమకు భర్తయితే అన్నా అని పిలవాలా’
తెలుగునాట స్టార్ యాంకర్‌గా వెలుగొందుతున్నారు సుమ కనకాల. సినిమా అయినా, టీవీ అయినా, ఏ ఈవెంట్ అయినా సుమదే డామినేషన్. మాటలు, పంచ్‌లు, సెటైర్లు, చలాకీతనంతో 25 ఏళ్లుగా ఇండస్ట్రీని ఏలుతున్నారు సుమ. ఆవిడతో పాటు కెరీర్ ప్రారంభించిన వారు ఫేడ్ అవుట్ అయిపోగా సుమ మాత్రం ఇప్పటికీ దూసుకెళ్తున్నారు. ఇండస్ట్రీకి ఎంతోమంది యాంకర్లు వస్తారు.. పోతారు.. నేను శాశ్వతం అని నిరూపించారు సుమ. ఆమె బలం కుటుంబమే. భర్త రాజీవ్ కనకాల, అత్తమామలు, పిల్లల సహకారంతోనే అటు ఫ్యామిలీని, ఇటు కెరీర్‌ని బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు సుమ.
ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే రాజీవ్ కనకాలతో ప్రేమలో పడి పెద్దల అంగీకారంతో ఆయనను పెళ్లాడారు సుమ. వీరికి ఓ కూతురు, కొడుకు సంతానం. కుమారుడు రోషన్ హీరోగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజీవ్ కనకాల సైతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బాగా బిజీ అయ్యారు. ఇటీవల వచ్చిన వెబ్ సిరీస్‌లు, సినిమాలు ఇలా ఏదైనా సరే రాజీవ్ కనకాలే కనిపిస్తున్నారు. రాజీవ్ - సుమల వ్యక్తిగత జీవితంపై పలుమార్లు రూమర్స్ వచ్చినా అవన్నీ గాలివార్తలే అయ్యాయి. ఇప్పటికీ చిన్నపిల్లల్లా కొట్టుకుంటూ, తిట్టుకుంటూ తమ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు సుమ- రాజీవ్ కనకాల.

ఇదిలాఉండగా రాజీవ్ కనకాలపై షాకింగ్ కామెంట్స్ చేశారు నటి, యాంకర్ గాయత్రి భార్గవి. బుల్లితెరపై యాంకర్‌గా అలరిస్తూనే కొన్ని సినిమాల్లో సహాయ పాత్రలు చేస్తున్నారు గాయత్రి. దిగ్గజ దర్శకుడు బాపుకి ఆమె స్వయంగా మనవరాలు. అయినప్పటికీ తన సొంత కష్టంతోనే ఈ స్థాయికి చేరుకున్నారు. తెలుగు బుల్లితెరపై తొలితరం యాంకర్లలో ఆమె కూడా ఒకరు. ఈటీవీ, జెమినీతో పాటు పలు ఛానెల్స్‌లో పనిచేశారు. ఆమె భర్త విక్రమ్.. ఆర్మీలో ఉన్నతాధికారి. దేశసేవలో ఉన్న భర్తకు అన్ని రకాలుగా అండగా ఉంటూ.. కుటుంబాన్ని, పిల్లల బాధ్యతను తీసుకున్నారు గాయత్రి. అలాగే కెరీర్‌ను కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు ఈ టాప్ యాంకర్.
తాజాగా గాయత్రి నటిస్తోన్న మూవీ డాటరాఫ్ ప్రసాదరావు కనబడుట లేదు వెబ్ సిరీస్ ఈ నెల 27 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో స్ట్రీమింగ్ కానుంది. రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్, హిమబిందు తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. సౌతిండియా స్క్రీన్స్ బ్యానర్‌పై కేవీ శ్రీరామ్ ఈ వెబ్‌సిరీస్‌ను నిర్మించగా.. కృష్ణ పోలారు దర్శకత్వం వహించారు. శ్రీరామ్ మద్దూరి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించగా... చంద్రశేఖర్ జీవీ ఎడిటింగ్, రామ్ కే మహేశ్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు.
తాజాగా ఈ మూవీ గ్రాండ్ ప్రివ్యూ ఈవెంట్ ఫిబ్రవరి 23న హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా నటి గాయత్రి భార్గవి మాట్లాడుతూ.. ఈ సినిమాలో నేను చిన్నపాత్ర చేస్తున్నాను. నన్ను ఫస్ట్ టైం అప్రూవ్ చేసింది రాజీవ్ గారే. ఈ అమ్మాయి టెలివిజన్ ఇండస్ట్రీకి పనికొస్తుందన్నది ఆయన ద్వారానే. నాకు బాగా గుర్తు.. ఫస్ట్ టైం రాజీవ్ గారు, బెన్నం గారు ఒక బైక్‌పై వచ్చారు. ఆ టైంలో నేను కాలేజీలో కంప్యూటర్స్ ఏవో నేర్చుకుంటుంటే నా ఫోటో చూసి ఈ అమ్మాయి ఓకే అని వెళ్లిపోయారు. కట్ చేస్తే రాఘవేంద్రరావు గారి యాడ్స్ చేయడానికి రాజీవ్ గారు అప్రూవ్ చేశారు. అప్పటి నుంచి రాజీవ్ గారు నాకు తెలుసు అని గాయత్రి తెలిపారు.
మేము దూరదర్శన్‌లో రకరకాల ప్రోగ్రామ్స్‌లో చూసిన రాజీవ్ గారు నాకు ఫస్ట్ క్రష్ అప్పట్లో. అందుకనే సుమ అక్క, రాజీవ్ బావగారు అంటాం. అసలు అన్నా, గిన్నా లాంటివి అనం. రాజీవ్‌గారితో చాలా చేశాం కానీ .. ఇందులో ఓ మంచి పాత్ర చేశాం. ఉదయభాను గారు నాకు గ్రేట్ ఇన్స్‌పిరేషన్. ఈటీవీలో ఆవిడ ప్రోగ్రామ్స్ చాలా చూసేదానిని. ఇందులో ఆమె మంచి పాత్ర చేశారు. తెలుగువారిని తీసుకుని అవకాశాలు ఇచ్చినందుకు శ్రీరామ్ గారికి థ్యాంక్స్. మేమంతా ఆర్టిస్ట్‌లుగా మంచి ఆకలి మీద ఉన్నాం.. మంచి మంచి పాత్రలు చేద్దామని, మీలాంటి వాళ్లు అవకాశం ఇస్తే తినేస్తాం. మేం కూడా ఉన్నామని గుర్తించండి. విమానమెక్కి రానక్కర్లేదు.. లోకల్‌లో కార్‌లో, ట్రైన్‌లో వచ్చినా కూడా మేం చేస్తాం. త్వరలో తెలుగు భాషా దినోత్సవం వస్తోంది. ఈ సందర్భంగా తెలుగువారితో ఇలాంటివి చేస్తున్నందుకు జీ5కి కృతజ్ఞతలు తెలిపారు గాయత్రి భార్గవి. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











