‘బిగ్ బాస్’పై మరో కేసు: గాయిత్రి గుప్తా ఫిర్యాదుతో ముదిరిన వివాదం

Recommended Video

Bigg Boss Telugu 3 : Case Filed On Bigg Boss Telugu By Gayathri Gupta || Filmibeat Telugu

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. ఇప్పటికే ఈ షోపై జర్నలిస్ట్, యాంకర్ శ్వేతా రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా... తాజాగా నటి గాయిత్రి గుప్తా కూడా ఇదే తరహాలో కంప్లయింట్ చేశారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో గాయిత్రి గుప్తా కేసు పెట్టారు.

పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో గాయిత్రి గుప్తా... బిగ్ బాస్ టీమ్ నుంచి వచ్చిన కొందరు తనతో ఇండీసెంటుగా ప్రవర్తించారని, వారు అడిగిన కొన్ని విషయాలు తేడాగా ఉన్నాయని తెలిపారు. దీంతో 'బిగ్ బాస్' సెలక్షన్ వెనక ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనేది హాట్ టాపిక్ అయింది.

అగ్రిమెంట్ అయిన తర్వాత నో చెప్పారు

అగ్రిమెంట్ అయిన తర్వాత నో చెప్పారు

బిగ్ బాస్ మూడో సీజన్ కోసం తనను ముగ్గురు వ్యక్తులు సంప్రదించారని, ఈ షోలో కంటెస్ట్ చేయడానికి తనకు ఆసక్తి ఉందని చెప్పినట్లు గాయిత్రి గుప్తా తెలిపారు. వెంటనే తనతో అగ్రిమెంట్ చేసుకున్నారని, అయితే తర్వాత తనను సెలక్ట్ చేయలేదని సమాచారం ఇచ్చారని వెల్లడించారు.

బాస్‌ను ఎలా సంతృప్తి పరుస్తావని అడిగారు

బాస్‌ను ఎలా సంతృప్తి పరుస్తావని అడిగారు

తనను సంప్రదించిన సమయంలో వారు తనను ఓ విషయం అడిగారని, నీకు అవకాశం వస్తే ‘బిగ్ బాస్'ను ఎలా సంతృప్తి పరుస్తావని అడిగినట్లు తెలిపారు. తన నుంచి వారు ఏదో ఊహించారని, వారు అనుకున్నగా నేను స్పందించక పోవడంతోనే రిజక్ చేసినట్లు తెలిపారు.

ఇంతకీ బిగ్ బాస్ అంటే ఎవరు?

ఇంతకీ బిగ్ బాస్ అంటే ఎవరు?

గత రెండు సీజన్లు పరిశీలిస్తే ‘బిగ్ బాస్' అంటే వ్యక్తి కాదు. కేవలం తెర వెనక వినిపించే వాయిస్. అయితే కంటెస్టెంట్లను ఎంపిక చేసే క్రమంలో కో ఆర్డినేటర్లు ‘బిగ్ బాస్'ను ఎలా సంతృప్తి పరుస్తావని అడుగుతుండటంతో రకరకాలుగా అర్థం చేసుకుంటున్నారు. బిగ్ బాస్ పేరుతో ఈ షోకు చెందిన కొందరు కమిట్మెంట్ అడుగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇంతకీ షో ఎప్పుడు మొదలవుతుంది?

ఇంతకీ షో ఎప్పుడు మొదలవుతుంది?

ఓ వైపు ‘బిగ్ బాస్' చుట్టూ వివాదాలు రాజుకుంటున్న నేపథ్యం, పోలీస్ కంప్లయింట్స్.... వెరసి ఈ షో ఎలా మొదలు కాబోతోందనేది ఆసక్తిగా మారింది. నాగార్జున హోస్ట్ చేయబోతున్న ఈ షో జులై 21న మొదలు కానుంది. 14 మంది కంటెస్టెంట్లతో 100 రోజులు ఈ షో జరుగనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X