హంతకురాలు గీతా మాధురి.. కౌశల్ చాప్టర్ క్లోజ్‌కు రంగం సిద్ధం.. పాపం గణేష్!
Recommended Video

బిగ్‌బాస్ రియాలిటీ షో ముగింపుకు చేరుకుంటున్న నేపథ్యంలో సెలబ్రిటీల మధ్య పోటీ పెరిగింది. ఆయా వ్యక్తుల నిజ స్వరూపాలు బయటపడుతున్నాయి. తమను తాము రక్షించుకొనేందుకు ఇంటి సభ్యులు ఎవరికి వారే వ్యూహాలు పన్నుతున్నారు. మర్డర్ టాస్క్ 81వ రోజు ముగిసింది. అనంతరం కెప్టెన్సీ టాస్క్ మొదలైంది. ఈ టాస్క్ 82వ రోజు కూడా కొనసాగే అవకాశం ఉండటంతో పోటీ ఆసక్తికరంగా మారింది.

మర్డర్ టాస్క్‌లో
మర్డర్ టాస్క్‌లో గురువారం విచారణ జరిగింది. అనుమానాస్పద వ్యక్తులను బోనులో నిలచోబెట్టి డిటెక్టివ్ గీతా మాధురి, పోలీస్ రోల్ రైడా విచారించారు. గత రెండు రోజుల్లో జరిగిన ఐదు హత్యలు చేసిన హంతకుడి పేరు చెప్పాలని గణేష్, రోల్ రైడాకు సూచించారు.

తప్పుగా అంచనా
రోల్ రైడా, గణేష్ విచారణ అనంతరం ఓ నిర్ణయానికి వచ్చి తనీష్ పేరు చెప్పారు. దాంతో వారు తప్పుగా అంచనా వేశారని, హంతకురాలు గీతా మాధురి అని చెప్పడంతో రోల్ రైడా, గణేష్, ఇతర సభ్యులు షాక్ గురయ్యారు.

గీతా మాధురి ఎలిమినేషన్
మర్డర్ టాస్క్‌లో గెలిచిన గీతా మాధురి ఎలిమినేషన్ నుంచి తప్పించుకొన్నారు. ఈ టాస్క్‌లో ఓడిన తనీష్, సామ్రాట్, శ్యామల, దీప్తి తదితరులు వచ్చే వారం కూడా నామినేట్ అయ్యారు.

మర్డర్ టాస్క్‌లో గీతా గెలిచి
మర్డర్ టాస్క్‌లో గెలిచినందున గీతా మాధురికి ఓ ప్రత్యేకంగా పవర్ ఇచ్చారు. దాని ప్రకారం కౌశల్‌ను గీత ఈ సీజన్ మొత్తానికి నామినేట్ చేయడం జరిగింది. దాంతో కౌశల్ కొంత అసహానానికి గురయ్యాడు.

కెప్టెన్సీ టాస్క్ కోసం
అనంతరం కెప్టెన్సీ టాస్క్‌కు నూతన్, రైడా, తనీష్‌లు ఎంపికయ్యారు. కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా వాళ్లు సైకిల్ తొక్కాల్సి ఉంది. ఎవరైతే ఎక్కువ సేపు అలిసిపోకుండా తొక్కి చివరి వరకు నిలుస్తారో వారే ఈ వారం కెప్టెన్‌గా ఎంపికవుతారు.

సైకిల్ ఎక్కి తొక్కడం
నూతన్, రైడా, తనీష్ సైకిల్ ఎక్కి తొక్కడం ప్రారంభించారు. అలాగే నూతన్‌కు కౌశల్, రైడాకు దీప్తి, తనీష్ సామ్రాట్ మద్దతుగా నిలిచారు. ఈ టాస్క్ ఫలితం 82వ రోజు తేలనుంది.

గణేష్ మనస్తాపానికి
ఇప్పటి వరకు సామ్రాట్, తనీష్, గీతా బ్యాచ్‌లో సభ్యుడైన గణేష్‌కు వాళ్లు షాకిచ్చారు. కెప్టెన్సీ టాస్క్ ఎంపిక కోసం గీత, రైడా తన పేరు చెప్పకపోవడంతో గణేష్ మనస్తాపానికి గురయ్యాడు. తన వాళ్లు అనుకొన్న వాళ్లు కూడా తనకు మద్దతు తెలుపలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.


Click it and Unblock the Notifications











