సామ్రాట్‌తోనే లింకు ఎందుకు? అమిత్ నా వేలు నోట్లోపెట్టుకొన్నాడు.. కౌశల్‌పై గీతా మాధురి డౌట్
బిగ్‌బాస్ ఇంటిలో 96వ రోజు గణేష్ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇంటి సభ్యులు గణపతి పూజలో పాల్గొన్నారు. ఇంటి సభ్యులు ప్రజలు, కుటుంబ సభ్యులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సామ్రాట్, తన బంధంపై వస్తున్న విమర్శలపై గీతా మాధురి స్పందించింది. కౌశల్ ఇదంతా చేస్తున్నాడా అనే అనుమానం వ్యక్తం చేసింది. అలాగే ఇంట్లోకి స్టార్ మా దత్తత తీసుకొన్న చిన్నపిల్లలు వచ్చారు. ఇంకా ఏం జరిగిందంటే..

రోల్ రైడా గణేష్ పాట
గణేష్ పండుగ సందర్భంగా వినాయకుడిపై రోల్ రైడా పాడిన ర్యాప్ పాటను వినిపించగా ఇంటి సభ్యులందరూ రెచ్చిపోయి డ్యాన్స్ చేశారు. తన పాటను ప్లే చేసినందుకు గానూ బిగ్‌బాస్‌కు రోల్ రైడా థ్యాంక్స్ చెప్పాడు.

సామ్రాట్‌తో రిలేషన్‌పై గీత
ఇక సామ్రాట్‌తో తన లింకుపై గీతా మాధురి ఆవేదన వ్యక్తం చేసింది. నేను అందరితో చనువుగా ఉన్నాను. అమిత్ నా వేలు నోట్లో పెట్టుకొని నాకినాడు. రోల్ రైడాతో సన్నిహితంగా ఉన్నాను. అలాంటివేమీ పట్టించుకోకుండా కేవలం సామ్రాట్‌తోనే ఎందుకు లింక్ పెడుతున్నారు అని దీప్తితో గీతా తన బాధను చెప్పుకొన్నది.

కౌశల్‌పై గీత మాధురి డౌట్
తనకు, సామ్రాట్‌కు ఉన్న బంధాన్ని కౌశల్ ఎందుకు ప్రత్యేకంగా చూస్తున్నాడు. ఇలా జరగడం వెనుక కౌశల్ ఉన్నాడా? కౌశలే ఇదంతా చేస్తున్నాడా అని గీతా మాధురి డౌట్ పడింది. అయినా నందు ఇవేమీ నమ్మకపోవడం నాకు కొంత ఊరట. ఏది ఏమైనా ఇది మంచిది కాదు అని ఆవేదన వ్యక్తం చేసింది.

దీప్తికి జైలుశిక్ష రద్దు
ఇంటి ప్రాపర్టిని ధ్వంసం చేసినందుకుగానూ దీప్తికి విధించిన శిక్షను బిగ్‌బాస్ రద్దు చేశాడు. మరోసారి ఇంటిలో వస్తువులను పాడు చేయకుండా చూసుకోవాలి. ఎవరైనా సరే హద్దు మీర కూడదు అని హెచ్చరించాడు. అందుకు దీప్తి స్పందిస్తూ.. మరోసారి ఇంటిలో ఇలాంటి పనులు చేయనని దీప్తి స్పష్టం చేసింది.

తేజస్వి, సామ్రాట్ రొమాన్స్
గతంలో సామ్రాట్, తేజస్విని ఒక సోఫాలో కూర్చొని రొమాన్స్ చేసేవాళ్లు. తేజస్విని వెళ్లిపోయిన తర్వాత ఆ సోఫాలో సామ్రాట్ కూర్చోకపోవడంపై గీతా మాధురి ఆటపట్టించింది. ఆ సోఫాలో కూర్చో సామ్రాట్ అని సెటైర్లు వేసింది. ఇంటి సభ్యులందరికీ చెబుతూ ఆ సోఫా ఖాళీగా ఉంటుంది అని పేర్కొన్నది.

ఆత్మశుద్దితో గణేష్ పండుగా
ఇంటి సభ్యులను గణేష్ పండుగను ఆత్మశుద్ధితో జరుపుకోవాలని సూచించాడు. ఇంటిలోని కెమెరా నుంచి ప్రజలకు, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. పండుగ సందర్భంగా ఇంటి సభ్యులకు కొత్త బట్టలు పంపించారు. అలా ఇంటిలో పండుగ వాతావరణం ప్రతిబింబించింది.

స్టార్ పిల్లలు వచ్చారు.
ఇంట్లోకి స్టార్ మా దత్తత తీసుకొన్న పిల్లలు వచ్చారు. వారికి బిగ్‌బాస్ సెలబ్రిటీలు సాదరంగా ఆహ్వనించారు. వారితో పలురకాల ఆటలు ఆడారు. వారిపై ప్రేమను కురిపిస్తూ ఆకట్టుకొన్నారు. వారికి స్టార్ మా సర్టిఫికెట్లు వచ్చారు. అనంతరం ఇంటి నుంచి వారు వెళ్లిపోయారు. పిల్లల రాకతో ఇంటి సభ్యుల్లో ఆనందం కనిపించింది.

సభ్యులకు పిండి వంటలు
ఇంట్లో సభ్యులకు పిండి వంటలు చేసుకొమని వస్తువులు పంపించారు. వడ, సేమియా పాయసం, పకోడిలు చేసుకోమని చెప్పాడు. దాంతో ఇంటి సభ్యులు పిండివంటలు చేసుకోవడంలో మునిగిపోయారు. దీప్తి, కౌశల్, తనీష్, అమిత్ వడ, సేమి, పకోడిలు చేశారు. ఆ తర్వాత బిగ్‌బాస్‌కు చూపించి ఇంటి సభ్యులు ఆరగించారు.


Click it and Unblock the Notifications











