For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అనసూయ హాట్ షోపై డైరెక్టర్ షాకింగ్ రియాక్షన్.. అమెనలా చూడడం ఇష్టం అంటూ!

  |

  తెలుగు బుల్లితెరపై సుదీర్ఘ కాలంగా సందడి చేయడంతో పాటు సినిమాల్లోనూ అద్భుతమైన పాత్రలతో అలరిస్తూ తన మార్కును చూపిస్తూ దూసుకుపోతోంది గ్లామర్ క్వీన్ అనసూయ భరద్వాజ్. ఆకట్టుకునే అందం.. అద్భుతమైన నటన.. అదిరిపోయే హావభవాలు.. మెప్పించే హోస్టింగ్‌తో అలరిస్తోన్న ఈ బ్యూటీ.. వరుసగా ఆఫర్లను అందుకుంటూ ముందుకు సాగుతోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సైతం సంపాదించుకుంది. అదే సమయంలో అనసూయ బుల్లి బట్టలతో హాట్ షో చేస్తూ హైలైట్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ టాలీవుడ్ డైరెక్టర్ ఆమె డ్రెస్సింగ్‌పై స్పందించారు. ఈ మేరకు ఆయన కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. అసలేం జరిగిందో మీరే చూడండి!

  అనసూయ కెరీర్‌ సక్సెస్‌ఫుల్‌గా

  అనసూయ కెరీర్‌ సక్సెస్‌ఫుల్‌గా

  అనసూయ సినిమా నటిగా కెరీర్‌ను ఆరంభించి.. ఆ తర్వాత న్యూస్ యాంకర్‌గా మారి.. అనంతరం బుల్లితెరపైకి హోస్టుగా ఎంట్రీ ఇచ్చింది. జబర్ధస్త్ షో ద్వారా తన ప్రయాణాన్ని మొదలు పెట్టిన ఈ బ్యూటీ.. చాలా తక్కువ సమయంలోనే ఊహించని రీతిలో ఫేమస్ అయింది. అదే సమయంలో వరుసగా ఆఫర్లను అందుకుంటూ కెరీర్ పరంగా సూపర్ సక్సెస్ అయిపోయింది.

  Bigg Boss 6: బిగ్ బాస్‌లోకి టాలీవుడ్ వారసుడు.. అందుకోసమే ఒప్పుకున్న యంగ్ హీరో

  వరుస సినిమాలు.. హిట్లే హిట్లు

  వరుస సినిమాలు.. హిట్లే హిట్లు


  సుదీర్ఘ కాలంగా బుల్లితెరపై సత్తా చాటుతోన్న అనసూయ భరద్వాజ్.. సినిమాల్లోనూ తనదైన శైలి నటనతో మాయ చేస్తోంది. 'సోగ్గాడే చిన్ని నాయన'తో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత 'క్షణం', 'రంగస్థలం', 'యాత్ర', 'కథనం', 'థ్యాంక్యూ బ్రదర్', 'ఖిలాడీ', 'పుష్ప' సహా ఎన్నో చిత్రాల్లో మంచి పాత్రలు చేసింది. అలాగే, స్పెషల్ సాంగ్స్‌లో మెరుస్తోంది.

  భారీ ప్రాజెక్టుల్లోనూ అనసూయ

  భారీ ప్రాజెక్టుల్లోనూ అనసూయ

  గతంతో పోల్చుకుంటే ఈ మధ్య కాలంలో అనసూయ భరద్వాజ్ పెద్దగా షోలు చేయడం లేదు. దీనికి కారణం ఆమె సినిమాలనే ఎక్కువగా ఒప్పుకోవడమే. ఇప్పటికే ఆమె 'రంగమార్తాండ', 'వేదాంతం రాఘవయ్య', 'గాడ్ ఫాదర్', 'హరిహర వీరమల్లు', 'పుష్ప 2', 'భోళా శంకర్' వంటి భారీ చిత్రాల్లో భాగమైంది. తద్వారా తన హవాను చూపిస్తూనే ఉంటోంది.

  యాంకర్ ప్రదీప్ క్యారెక్టర్ బయట పెట్టిన ఢీ డ్యాన్సర్.. ఫోన్ చేస్తే అలా అన్నాడంటూ ఎమోషనల్

  అందులో అందాలను ఆరబోసి

  అందులో అందాలను ఆరబోసి

  వరుస పెట్టి షోలు, సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న అనసూయ భరద్వాజ్.. సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో తన అప్‌డేట్లను ఇవ్వడంతో పాటు హాట్ ఫొటోలు, వీడియోలను కూడా వదులుతోంది. ఫలితంగా తరచూ హైలైట్ అవుతోంది. అదే సమయంలో ఆమె డ్రెస్సింగ్‌పై చాలా మంది విమర్శలు కూడా చేస్తున్న విషయం తెలిసిందే

  అనసూయ డ్రెస్సింగ్‌పై డైరెక్టర్

  అనసూయ డ్రెస్సింగ్‌పై డైరెక్టర్

  తెలుగులో ప్యూర్ లవ్ స్టోరీలతో సినిమాలు చేసి ఫేమస్ అయిన దర్శకులలో గీతాకృష్ణ ఒకరు. అయితే, ఆయన తెరకెక్కించిన సినిమాలు కమర్షియల్‌గా సక్సెస్ అవ్వకపోవడంతో చాలా కాలంగా సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్నారు. ఇక, కొంత కాలంగా సంచలన ఇంటర్వ్యూలతో గీతాకృష్ణ కలకలం రేపుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన అనసూయ గురించి మాట్లాడారు.

  ఉల్లిపొర లాంటి బట్టల్లో దిశా పటానీ రచ్చ: అవి కూడా కనిపించేలా.. ఆమెనిలా చూస్తే!

  ఆమె అద్భుతంగా నటించింది

  ఆమె అద్భుతంగా నటించింది

  అనసూయ యాక్టింగ్ గురించి గీతాకృష్ణ మాట్లాడుతూ.. 'రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో అనసూయ చాలా అద్భుతంగా నటించింది. పుష్ప సినిమాలో అయితే అనసూయను గుర్తుపట్టలేకపోయాను. అనసూయ ఎంతో అద్భుతంగా నటిస్తుంది. ఆమె నటనను చూసి కొందరు అసూయ పడుతూ ఆమెను ట్రోల్స్, నెగిటివ్ కామెంట్స్ చేస్తుంటారు' అని చెప్పుకొచ్చారు.

  ఆమె డ్రెస్సింగ్ నాకు ఇష్టమని

  ఆమె డ్రెస్సింగ్ నాకు ఇష్టమని

  అనసూయ డ్రెస్సింగ్ గురించి గీతాకృష్ణ స్పందిస్తూ 'అనసూయ భరద్వాజ్ డ్రెసింగ్ సెన్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఆమె ఫ్యాషన్ సెన్స్ కొత్తగా ఉంటుంది. ట్రెండీగా ఉండే అనసూయ డ్రెస్సింగ్ నాకు చాలా ఇష్టం. అయితే, దీన్నే చాలా మంది ఇష్టం లేక ట్రోల్స్ చేస్తుంటారు. కానీ, అనసూయను అలా చూడడమే చాలా మందికి నచ్చుతుంది' అంటూ షాకింగ్‌గా మాట్లాడారు.

  English summary
  Host and Actress Anasuya Bharadwaj Dressing Hot Topic In Telugu States Very Long Time. Recently Director Geetha Krishna Praises on Her Dressing.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X