బిగ్ బాస్ 2: నెక్స్ట్ కెప్టెన్ ఎవరు.. గీతామాధురి, దీప్తి సునైనా మధ్య హోరాహోరీ!
నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 2 ప్రతిరోజు రసవత్తరంగా మారుతోంది. నేడు జరగబోయే ఎపిసోడ్ లో మరో కీలక ఘట్టం చోటుచేసుకోబోతోంది. బిగ్ బాస్ హౌస్ కు కొత్త కెప్టెన్ ని నియమించబోతున్నారు. ఇప్పటి వరకు హౌస్ కు సామ్రాట్ కెప్టెన్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సారి ఆ అవకాశం ఫిమేల్ కంటెస్టెంట్స్ కు దక్కబోతోంది.

పోటీలో ఆ ఇద్దరూ
బిగ్ బాస్ కెప్టెన్ రేసులో గీతా మాధురి, దీప్తి సునైనా ఉన్నారు. కెప్టెన్ కావడం కోసం వీరిద్దరూ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దానికి సంబందించిన ప్రోమోని నిర్వాహకులు నేడు విడుదల చేసారు.
Recommended Video


ఎలక్షన్ తరహాలో
కెప్టెన్ పదవి కోసం గీతా మాధురి, దీప్తి సునైనా ఎలక్షన్ క్యాంపైనింగ్ తరహాలో ప్రచారం నిర్వహిస్తున్నారు. కెప్టెన్ అయ్యాక తామేం చేస్తామో సభ్యులకు వివరిస్తున్నారు.

ఏది ఏమైనా
ప్రచారం కోసం గీతామాధురి ఎంచుకున్న స్లోగన్ 'ఏది ఏమైనా న్యాయాన్ని, ధర్మాన్ని, నిజాన్ని వదలను'. దీప్తి సునైనా స్లోగన్ ' నీలో ఉన్న మారక చెరుపు.. తీసుకురా మార్పు'. నాకు ఓటేయడం కోసం ఎవరి ద్వారా మీరు ప్రభావం చెందవద్దని గీతామాధురి చెబుతోంది.

బాబు గోగినేని సరదా ప్రశ్న
కెప్టెన్ అయ్యాక మీరు ఎలా ఉంటారు అని గీతా మాధురిని, దీప్తి సునైనాని సరదాగా బాబు గోగినేని ప్రశ్నిస్తున్నారు. కెప్టెన్ టాయిలెట్ మేము వాడుకోవచ్చా అనే ప్రశ్నకు అడగక్కర్లేదు అని గీత సమాధానం ఇచ్చింది. దీనికి సంబందించిన ఎపిసోడ్ నేడు ప్రసారం కానుంది.


Click it and Unblock the Notifications