బిగ్ బాస్ వివాదం: ఆయనకు మద్దతుగా గీతా మాధురి వీడియో..

బిగ్ బాస్ తెలుగు 3 రియాల్టీ షో ప్రారంభానికి ముందే వివాదాల్లో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ షో కోసం తనను సంప్రదించి, ఎంపిక చేశారని, అగ్రిమెంట్ అయిన తర్వాత... మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలి? మా బాస్‌ను ఎలా సంతృప్తి పరుస్తారు? అంటూ అసభ్యంగా ప్రవర్తించారంటూ జర్నలిస్ట్ శ్వేతా రెడ్డి మీడియాకు ఎక్కడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ షో విషయంలో తనతో రఘు, రవికాంత్, శ్యామ్ సంప్రదింపులు జరిపినట్లు శ్వేతా రెడ్డి తెలిపారు.

కాగా... ఈ వివాదంలో రవికాంత్‌కు మద్దతుగా గీతా మాధురి ఓ వీడియో విడుదల చేశారు. ''రవికాంత్ గారు నాకు 15 సంవత్సరాలుగా తెలుసు. 2004లో నేను స్కూల్ డ్రెస్ వేసుకుని లిటిల్ మ్యూజీషియన్ అకాడమీకి వెళ్లినప్పటి నుంచి పరిచయం. అది మాత్రమే కాదు, నేను యాంకరింగ్ చేసిన సూపర్ సింగర్ 1కు రవికాంత్ గారే దర్శకత్వం వహించారు. సూపర్ సింగర్ 3, 5, 7కు ఆయన డైరెక్షన్ చేశారు. ఆయనతో పని చేయడం చాలా కంఫర్టుగా ఫీలయ్యాను. చాలా డీసెంట్ పర్సన్. ఆయన గురించి ఎవరు మాట్లాడినా కూడా మంచి వ్యక్తి అనే చెబుతారు. ఆయనకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది.'' అని గీతా మాధురి తెలిపారు.

Geetha Madhuri Support To Ravikanth about Bigg Boss 3 Controversy

ఈ వివాదాలు ఉన్నప్పటికీ బిగ్ బాస్ షో ఎలాంటి ఆటంకం లేకుండా ఆదివారం ప్రారంభం అయింది. ఈషోలో కంటెస్టెంట్లుగా వి6 సావిత్రి(శివజ్యోతి), రవికృష్ణ, అషురెడ్డి, జాఫర్, హిమజ, రాహుల్ సిప్లిగంజ్, రోహిణి, బాబా భాస్కర్, పునర్నవి భూపాలం, హేమ, అలీరెజా, మహేష్ విట్టా, శ్రీముఖి, వరుణ్ సందేశ్, వితికా షేరు ఎంటరయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X