బిగ్ బాస్‌పై గీతామాధురి కామెంట్.. శ్రీముఖి ఫోటో షేర్ చేస్తూ! ఇన్‌డైరెక్ట్‌గా చెప్పేసింది

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోంది. నాగార్జున హోస్ట్‌గా కొనసాగుతున్న ఈ షోలో జులై 21వ తేదీన ప్రారంభమై ఆడియన్స్‌కి మంచి కిక్కిస్తోంది. విజయవంతంగా పద్నాలుగో వారం ఫినిష్ చేసుకున్న ఈ షో ఈ వారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ విన్నర్ ఎవరు కానున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎవరికి వారు బిగ్ బాస్‌ కంటిిస్టెంట్స్‌కి తమతమ సపోర్ట్ అందిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా గీతా మాధురి పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది.

కేవలం ఐదుగురు.. అందరివీ విశ్వ ప్రయత్నాలు

కేవలం ఐదుగురు.. అందరివీ విశ్వ ప్రయత్నాలు

15 మంది కంటిస్టెంట్లతో మొదలైన బిగ్ బాస్ షోలో ఐదుగురు మాత్రమే టైటిల్ రేసులో నిలిచారు. అందులో రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి, బాబా భాస్కర్, అలీ రెజా, వరుణ్ సందేశ్ ఉన్నారు. బిగ్ బాస్ టైటిల్ గెలుచుకునేందుకు ఈ ఐదుగురు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటింగ్, సపోర్టింగ్ లతో గట్టి పోటీ కనబర్చుతున్నారు.

రష్మీ గౌతమ్, రామ్ ప్రసాద్ బాటలో గీతా మాధురి

రష్మీ గౌతమ్, రామ్ ప్రసాద్ బాటలో గీతా మాధురి

కాగా ఈ ఐదుగురిలో టైటిల్ విన్నర్ ఎవరు కానున్నారనే దానిపై సోషల్ మీడియాలో జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఇప్పటికే రష్మీ గౌతమ్, జబర్దస్త్ కమెడియన్ రామ్ ప్రసాద్ లాంటి వారు తమ సపోర్ట్ శ్రీముఖికే అని తెలపగా, తాజాగా గీతా మాధురి కూడా స్పందించింది. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టి సంచలనం సృష్టించింది.

సీజన్ 2 రన్నరప్‌ సపోర్ట్ ఆ ఇద్దరికే!

సీజన్ 2 రన్నరప్‌ సపోర్ట్ ఆ ఇద్దరికే!

బిగ్‌బాస్ సీజన్ 2లో రన్నరప్‌గా నిలిచిన గీతామాధురి.. ఈ ఐదుగురికి ఆల్ ది బెస్ట్ చెబుతూ సోషల్ మీడియాలో సందేశం పోస్ట్ చేసింది. అయితే ఈ సందేశంతో పాటు శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్ లతో తాను దిగిన పిక్స్ షేర్ చేసింది. దీంతో ఈ పిక్స్ చూసి.. గీతామాధురి సపోర్ట్ ఈ ఇద్దరికే అని, ఆమె ఇలా ఇన్‌డైరెక్ట్‌గా చెప్పేసిందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

రాహుల్, శ్రీముఖి టీమ్స్.. సోషల్ మీడియాను ఊపేస్తూ

మరోవైపు రాహుల్, శ్రీముఖి టీమ్స్ పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేస్తున్నాయి. ఓటు వేయండంటూ సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి ఈ టీమ్స్. ఈ నేపథ్యంలో ఎక్కువా మంది వీరిద్దరి వైపే మొగ్గు చూపుతున్నారనే టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి చివరకు టైటిల్ విన్నర్ ఎవరు అవవుతారనేది.

Recommended Video

Rashmi Gautam Supports Sreemukhi || శ్రీముఖి కి రష్మీ సపోర్ట్ !
బిగ్ బాస్ ఫైనల్ సర్‌ప్రైజ్

బిగ్ బాస్ ఫైనల్ సర్‌ప్రైజ్

ఇదిలా ఉంటే బిగ్ బాస్ ఫైనల్ సర్‌ప్రైజ్ ఒకటుందనే వార్త బుల్లితెర ఆడియన్స్‌లో ఆత్రుత రెట్టింపు చేసింది. ఈ షో ఫైనల్ ఎపిసోడ్‌లో మెగాస్టార్ చిరంజీవి సందడి చేయబోతున్నారని తెలిసి ఖుషీ అవుతున్నారు జనం. ఆయన చేతుల మీదుగానే బిగ్ బాస్ విన్నర్ అనౌన్స్‌మెంట్ జరగనుందని తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X