Bigg Boss 5 నుంచి మరో కంటెస్టెంట్ పేరు లీక్: అల్లరి నరేష్ హీరోయిన్ ఎంట్రీ.. మరింత ఫన్ గ్యారెంటీ!

తెలుగు బుల్లితెరపై సంచలనాలకు, రికార్డులకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తోన్న ఏకైక షో బిగ్ బాస్. ఏమాత్రం అంచనాలు లేకుండానే మొదలైన ఈ షో.. మన ప్రేక్షకుల మనసు దోచుకుని సూపర్ డూపర్ హిట్ అయింది. అందుకే ఏకంగా నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఐదో సీజన్‌ను కూడా కొద్ది రోజుల్లో ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో అందులో పాల్గొనబోయే కంటెస్టెంట్ల వివరాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న మరో సెలెబ్రిటీ పేరు తాజాగా లీక్ అయింది. ఇంతకీ ఎవరా కంటెస్టెంట్? వివరాల్లోకి వెళ్తే...

నాలుగూ.. నాలుగు రేంజ్‌లో సక్సెస్

నాలుగూ.. నాలుగు రేంజ్‌లో సక్సెస్

బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో నాలుగు సీజన్లను పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. అందులో ఒక్కో షో ఒక్కో రేంజ్‌లో హిట్ అయింది. మొత్తానికి ప్రతీది ఒకదానికి మించి ఒకటి అన్నట్లుగా సక్సెస్ అయ్యాయి. మరీ ముఖ్యంగా రేటింగ్‌లో రికార్డులు క్రియేట్ చేశాయి. అందుకే మన బిగ్ బాస్ దేశ వ్యాప్తంగా గుర్తింపును అందుకుంది. ఈ సక్సెస్ వెనుక హోస్ట్‌ల పాత్ర ఉంది.

ఐదో సీజన్ ఇలా.. ఆరోజునే మొదలు

ఐదో సీజన్ ఇలా.. ఆరోజునే మొదలు

ఇప్పటి వరకూ వచ్చిన సీజన్లు సక్సెస్ అవడంతో బిగ్ బాస్ ఐదో సీజన్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకే త్వరలోనే రాబోయే దాని కోసం మంచి ప్లానింగ్ చేస్తున్నారు. ఇక, ఐదో సీజన్ సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆగస్టులో దీనికి సంబంధించిన కొన్ని ప్రోమోలు, లోగో విడుదల కాబోతున్నాయని ప్రచారం జరుగుతోంది.

కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియపై అప్‌డేట్

కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియపై అప్‌డేట్

కరోనా ప్రభావం కారణంగా బిగ్ బాస్ షో ఈ ఏడాది ప్రసారం అయ్యేది కష్టమే అన్న టాక్ వినిపించింది. కానీ, దీని వెనుక గ్రౌండ్ వర్క్‌ను మాత్రం నిర్వహకులు ఎప్పుడో ప్రారంభించేశారు. ఇందులో భాగంగానే కంటెస్టెంట్ల ఎంపిక కోసం దాదాపు వంద మందితో చర్చలు జరిపారట. అందులో కొందరిని ఎంపిక చేసి జూమ్ మీటింగ్ ద్వారా వాళ్లతో ఇంటర్వ్యూలు చేసి కొందరిని ఎంపిక చేశారని టాక్.

ఇప్పటి వరకూ ఫైనల్ అయింది వీళ్లే

ఇప్పటి వరకూ ఫైనల్ అయింది వీళ్లే

వచ్చే సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్ల విషయంలో ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే చాలా మంది పేర్లు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే సిరి హన్మంత్, నవ్య స్వామి, శ్రీహాన్ ఫైనల్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. వీళ్లతో పాటు షణ్ముక్ జశ్వంత్, హేమచంద్ర, మంగ్లీ, జబర్ధస్త్ నరేష్, రఘు మాస్టర్ సహా పలువురి పేర్లు ఈ సారి లిస్టులో ఉన్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి.

బిగ్ బాస్‌ షోలోకి తెలుగు హీరోయిన్

బిగ్ బాస్‌ షోలోకి తెలుగు హీరోయిన్

బిగ్ బాస్ షోకు సంబంధించినంత వరకూ ప్రతి విషయాన్ని ఎంతో రహస్యంగా ఉంచాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ, అవి ముందే బయటకు వస్తుంటాయి. ఈ క్రమంలోనే ఐదో సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్ల పేర్లు ఒక్కొక్కటిగా లీక్ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మరో పేరు బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. అల్లరి నరేష్ హీరోయిన్‌ షోలోకి ఎంట్రీ ఇస్తుందట.

Recommended Video

Ikshu Movie Official Promo
ఈ సీజన్‌లో మరింత కామెడీ గ్యారెంటీ

ఈ సీజన్‌లో మరింత కామెడీ గ్యారెంటీ

తెలుగులో పలు సినిమాల్లో కామెడీ పాత్రలు చేసి.. అల్లరి నరేష్ హీరోగా నటించిన 'కితకితలు'లో లీడ్ రోల్ చేసిన గీతా సింగ్ బిగ్ బాస్ ఐదో సీజన్‌కు ఎంపికైందట. ఇప్పటికే షో నిర్వహకులతో ఆమె ఒప్పందం కూడా జరుపుకుందని అంటున్నారు. చాలా కాలంగా కనిపించని ఈ భామ.. షో ద్వారా రీఎంట్రీ ఇస్తుందట. ఆమె కనుక షోలోకి ఎంట్రీ ఇస్తే మరింత ఫన్ ఉండడం గ్యారెంటీ అని చెప్పొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X