Bigg Boss Buzz:బిగ్‌బాస్‌ బజ్‌లో కంటెస్టెంట్లను వాయించే ప్రశ్నలు రాసిచ్చింది అతడేనట.. తొలిసారి రివీల్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గురించి అందులో పాల్గొన్న కంటెస్టెంట్ల గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తం 19 మంది కంటెస్టెంట్లు హౌస్ లో అడుగు పెట్టగా... ఒక్కో వారం ఒక్కొక్కరూ ఎలిమినేట్ అయిపోగా.. చివరగా టాప్ 6 మిగిలారు. వీరిలో ఒకరు విన్నర్, మరొకరు రన్నర్ గా నిలిచారు. ఇలా 105 రోజుల పాటు అద్భుతంగా సాగిన ఈ గేమ్ లోంచి ఒక్కొక్కరూ వెళ్లిపోతూ బయటకు రాగా.. బిగ్ బాస్ బజ్ షోలో గలాటా గీతూ అలియాస్ గీతూ రాయల్ ఇంటర్వ్యూ చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే.

ఎవరూ అడగని, ఎవరూ తప్పు పట్టని విషయాలను కూడా చెబుతూ.. మొహం మీదే అడిగేస్తూ రచ్చ చేసిందీ క్యూట్ బ్యూటీ. ఒక్కో కంటెస్టెంట్ ను రఫ్ఫాడిస్తూ రచ్చే చేసిన ఈ ముద్దుగుమ్మనే ఈ షోకు సంబంధించిన ప్రశ్నలను ప్రిపేర్ చేసుకుందని అనుకున్నారు. కానీ ఆ ప్రశ్నలు రాసింది ఆమె కాదట. అలా అని బిగ్ బాస్ బజ్ 7 వాళ్లే అనుకుంటున్నారేమో. వాళ్లు కూడా కాదట. స్టార్ మా బ్యాచ్ కు ఈ ప్రశ్నలకు, ముఖ్యంగా బిగ్ బాస్ టీం నిర్వాహకులకు కూడా దీనితో ఏమాత్రం సంబంధం లేదట. ఒంటి చేత్తో యాంకరే ఈ షోను నడిపించాలనేది అసలు రూల్ అట.

Geethu Royal Revealed Who Wrote Questiions For Bigg Boss Buzz Telugu 7 Show

కానీ గీతూ రాయల్ కు ఈ షో ప్రారంభం అయిన మొదటి వారం నుంచి అనేక సమస్యలు వచ్చాయట. ముఖ్యంగా మొదటగా కాకినాడలో ఉన్న తల తల్లికి అనారోగ్య సమస్యలు రావడంతో అక్కడే ఉండి.. కేవలం షూటింగ్ సమసంయలో మాత్రమే హైదరాబద్ కు వచ్చేదట. అలా ఓ రెండు మూడు వారాలు కాగానే తన ఇంట్లో ఉన్న పిల్లి పిల్ల.. గీతూ పెంచుకుంటున్న ఆమె పెట్ క్యాట్ ఓరియో అనారోగ్యం పాలైందట. ఇలా ఇన్ని టెన్షన్ల మధ్య ఆమె కనీసం బిగ్ బాస్ షో కూడా చూడలేదట. ప్రశ్నలు ప్రిపేర్ చేసుకోవాల్సిన ఆమే షో చూడడం కుదరకపోవడంతో వేరే వాళ్ల సాయం తీసుకుందట.

ముఖ్యంగా ప్రశ్నలు రాసివ్వమంటూ తన కో కంటెస్టెంట్, గతంలో అంటే బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో పాల్గొన్న ఆదిరెడ్డిని సాయం కోరిందట. కర్నూలులో ఉండి సొంత ఇళ్లు కట్టుకుంటూ, బిగ్ బాస్ రీవ్యూలు చేసుకుంటూ, సెలూన్ ప్రారంభించుకున్న అతడు ఎంత బిజీగా ఉన్నా సరే గీతూ కోసం ప్రశ్నలు రాసిచ్చేవాడట. అలాగే ఫణి అనే మరో అబ్బాయి.. ఇంకో ఇద్దరు ముగ్గురు స్నేహితులు సాయం చేసే వాళ్లట. అలా వాళ్లంతా కలిపి పంపిన ప్రశ్నల్లోంచి కొన్ని సెలెక్ట్ చేసుకుని ఈమె కంటెస్టెంట్లను రఫ్ఫాడించేదట.

Geethu Royal Revealed Who Wrote Questiions For Bigg Boss Buzz Telugu 7 Show

ఆదిరెడ్డి రీవ్యూలు చేస్తుండడంతో ప్రితిరోజూ.. ముఖ్యంగా 24 గంటలు షోను చూస్తూ ఫాలో అయ్యేవాడట. ఇలా రోజూ షో చూడడం వల్ల ప్రశ్నలు రాసివ్వడం పెద్దగా కష్టమయ్యేది కాదని.. కాకపోతే ఆ ప్రశ్నలు తన వద్దకు వచ్చేవరకు మాత్రం చాలా ఆలస్యం అయ్యేదని.. ఇంటర్య్వూ స్టార్ట్ అవుతుందన్న గంట ముందు ఆ ప్రశ్నలు రావడం వాటిని తాను చూసి వెంటనే అడిగేయడం చేసే దాన్నంటూ అసలు సీక్రెట్ రివీల్ చేసింది గలాటా గీతూ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X