Bigg Boss Telugu 6: నాగార్జున మామ.. అఖిల్ బావ అంటే ఇష్టం.. గీతు రాయల్ టాలెంట్ మామూలుగా లేదుగా
సోషల్ మీడియాతో ఫుల్ పాపులర్ అయింది గీతూ రాయల్. చిత్తూరు యాసలో మాట్లాడుతూ విపరీతమైన క్రేజ్ సంపాందించుకుంది. ఐటీ ఎంప్లాయిగా, ఆర్జేగా, రివ్యూవర్‌గా వర్క్ చేసిన గీతూ రాయల్ ఇంతకుముందు బిగ్‌బాస్‌పై సమీక్షలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఏ బిగ్‌బాస్‌పై రివ్యూలు చేసిందో ఆ బిగ్‌బాస్ షోలోనే పార్టిస్పేట్ చేయడానికి ఎంట్రీ ఇచ్చింది. తనకు జరిగిన యాక్సిడెంట్, ఇన్సెక్యూరిటీస్, బాడీ షేమింగ్ వంటి తదితర విషయాలను పంచుకుంది గీతూ రాయల్.
బిగ్‌బాస్ షోపై రివ్యూలు చేసి పాపులర్ అయింది గలాట్టా గీతూ రాయల్. సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి గీతూ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిత్తూరు యాసలో మాట్లాడుతూ, అద్భుతమైన మోటివేషనల్ కోట్స్‌తో సూపర్ పాపులర్ అయింది ఈ చిత్తూరు చిరుత. ఇక బిగ్‌బాస్ ఆరో సీజన్ హౌజ్‌లో 8వ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది గీతూ రాయల్.

అదే పెద్ద బ్రేక్..
తన పర్సనల్ లైఫ్‌లో జరిగిన విషయాలు చెబుతూ ప్రారంభించిన గీతూ రాయల్ ఆకట్టుకుంది. అయితే ఆమెకు 2014లో ఒక యాక్సిడెంట్ జరిగిందని, తన లైఫ్‌లో అదే పెద్ద బ్రేక్ అని చెప్పింది. అలా బస్‌లో నుంచి కిందపడ్డ తర్వాత అప్పుడప్పుడు గజినీలా చేస్తానని వీడియోలో చెప్పుకొచ్చింది. ఆ తర్వాత తన జీవితంలో మరో మర్చిపోలేని విషయం తన భర్త అని తెలిపింది.

పూర్తి పేరు ఇదన్నమాట..
ఇక స్టేజ్‌పైకి చిత్తూరు చిరుత అంటూ గీతూ రాయల్‌ను ఆహ్వానించాడు నాగార్జున. స్టేజ్‌పైన తన పూర్తి పేరు కొవూరి గ్రీష్మ గీతిక లేఖ రాయలు అని చెప్పింది గీతూ రాయల్. అయితే గ్రీష్మ అని ఉంటే లక్ కలిసిరాలేదని, అది తీసేసి గీతూ రాయల్ అని పెట్టగానే బీభత్సమైన లక్ కలిసి వచ్చిందని చెప్పుకొచ్చింది గీతూ.

మర్చిపోతుంటాను..
ఇక వీడియోలో చెప్పినట్లుగానే తనకు యాక్సిడెంట్ గురించి వివరించింది. అప్పుడప్పుడు కొన్ని విషయాలు మరచిపోతుంటానని తెలిపింది. దీంతో బిగ్‌బాస్‌ను కూడా మరిచిపోతావా? అని నాగార్జున అడిగిన ప్రశ్నకు.. లేదు అని ఆన్సర్ ఇచ్చింది. అయితే అవసరమైనవి మర్చిపోవన్నమాటా అని నాగార్జున అంటాడు.

బాడీ షేమింగ్ చేసేవారు..
తర్వాత ఈ షోకి రావడానికి మూడు కారణాలు ఉన్నాయని గీతూ రాయల్ చెబుతుంది. మొదటిది తనకున్న ఇన్సెక్యూరిటీస్ను పోగెట్టుకునేందుకని, తనను చిన్నప్పటి నుంచి బాడీ షేమింగ్ చేసేవారని తెలిపింది. ఎన్నిసార్లు బిగ్‌బాస్ ఆఫర్ వచ్చే కొంచెం సన్నం అయి వెళ్దామ్లే అని అనుకున్నా. కానీ ఎన్నిసార్లు ఆపరేషన్ చేయించుకున్న సన్నం కావట్లేదు. అని చెప్పింది. ఇక రెండో రీజన్ వచ్చేసి బిగ్‌బాస్ రివ్యూలు ఇచ్చేదానివి కదా ఓసారి వెళ్లి పార్టిస్పేట్ చేస్తే తెలుస్తుంది అని చాలా మంది అన్నారు.. నాకు కూడా ఓసారి దగ్గరి నుంచి చూడాలనిపించి వచ్చాను.

బేబీ వాయిస్‌లో..
మూడో రీజన్‌ను టాప్ 5 ప్లేస్‌కు వెళ్లాక చెబుతానని గీతూ రాయల్ తెలిపింది. తర్వాత బేబీ వాయిస్‌లో బాగా మాట్లాడతవటా కదా అని నాగార్జున అడగ్గా.. అవును మామయ్య.. నాకు అఖిల్ బావ అంటే చాలా ఇష్టం. అమల అత్తయ్య అంటే చాలా ఇష్టం. నాకు అమల అత్తయ్యలాగే కుక్కపిల్లలు, పిల్లి పిల్లలు అంటే చాలా ఇష్టం అని చిన్న పిల్లల వాయిస్‌లో అదరగొట్టింది గీతూ రాయల్.


Click it and Unblock the Notifications











