Bigg Boss Telugu 6: చివర్లో బిగ్ బాస్ ట్విస్ట్.. మరో ఎలిమినేషన్.. తొలిసారి అది చూడాల్సి వచ్చిందే!

ఎన్నో అనుమానాలతో తెలుగు బుల్లితెరపైకి పరిచయం అయినా.. చాలా అంటే చాలా తక్కువ సమయంలోనే సక్సెస్‌ఫుల్ షోగా పేరు తెచ్చుకుంది బిగ్ బాస్. కొత్త కాన్సెప్టుతో నడిచేదే అయినా దీనికి ప్రేక్షకులు భారీ స్థాయిలో స్పందనను అందించారు. ఫలితంగా దేశంలోనే ఇది నెంబర్ వన్ షోగా మారిపోయింది. దీంతో ఇప్పుడు ఆరో సీజన్‌ను కూడా ఎంతో ఉత్సాహంతో నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో హోస్ట్ అక్కినేని నాగార్జున అదిరిపోయే సర్‌ప్రైజ్‌తో షాకిచ్చాడు. అసలేం జరిగింది? దీనికి సంబంధించిన వివరాలు మీకోసం!

ఏం చేసినా రేటింగ్ రావట్లే

ఏం చేసినా రేటింగ్ రావట్లే


బిగ్ బాస్ షో ఎన్నో భాషల్లో ప్రసారం అవుతున్నా.. తెలుగులో మాత్రమే అత్యధిక రేటింగ్‌ను సొంతం చేసుకుంటూ రికార్డులు క్రియేట్ చేసింది. దీంతో ఆరో సీజన్‌ను నిర్వహకులు రెట్టించిన ఉత్సాహంతో సరికొత్తగా నడుపుతున్నారు. కానీ, దీనికి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. ఫలితంగా దీనికి చాలా తక్కువగానే రేటింగ్ దక్కుతోంది. ఇది టీమ్‌కు నిరాశనే మిగుల్చింది.

21మందిలో డైనమిక్‌గానే

21మందిలో డైనమిక్‌గానే

బిగ్ బాస్ ఆరో సీజన్‌ కోసం కంటెస్టెంట్ల ఎంపిక విషయంలో నిర్వహకులు ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. మరీ ముఖ్యంగా పాపులర్ అయిన వాళ్లనే ఎక్కువగా తీసుకున్నారు. ఇలా మొత్తంగా ఈ సీజన్‌లో 21 మంది కంటెస్టెంట్లను ఒకేసారి ఇంట్లోకి పంపారు. అందులో రాయలసీమ భామ గీతూ రాయల్ ప్రత్యేకమైన శైలితో బాగా హైలైట్ అవుతూ అందరి దృష్టిని ఆకర్షించింది.

అన్నింట్లోనూ ఉంటోంది

అన్నింట్లోనూ ఉంటోంది


చాలా ఏళ్లుగా అటు బుల్లితెరపై, ఇటు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్న.. గీతూ రాయల్ చాలా మందికి సుపరిచితురాలు అయింది. దీంతో ఆమెకు కొంత మేర క్రేజ్ కూడా దక్కింది. ఈ క్రమంలోనే ఇటీవలే బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. తనదైన ఆటతీరుతో అందరి మనసులు దోచుకుంటోంది. అదే సమయంలో మాటతీరుతోనూ నిత్యం హైలైట్ అవుతూ ఉంటోంది.

శనివారం నాగార్జున క్లాస్

శనివారం నాగార్జున క్లాస్

గత శనివారం జరిగిన ఎపిసోడ్‌లో అక్కినేని నాగార్జున.. గీతూ రాయల్‌ ఆటతీరుపై బాగా కోప్పడ్డాడు. మరీ ముఖ్యంగా ఆమె 'చేపల చెరువు' టాస్కులో ఆడిన తీరు.. సంచాలకురాలిగా చేసిన ఓవర్‌తో నాగార్జునకు మండిపోయింది. వీటిని ప్రస్తావిస్తూ ఆమెను బాగా తిట్టాడు. దీంతో బిగ్ బాస్ ఆరో సీజన్‌లో గీతూ రాయల్ తొలిసారి ఏమీ మాట్లాడకుండానే ఏడుస్తూ ఉండిపోయింది.

ఆదివారమూ ఎలిమినేషన్

ఆదివారమూ ఎలిమినేషన్

శనివారం జరిగిన ఎపిసోడ్‌లోనే ఆర్జే సూర్య ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ అక్కినేని నాగార్జున అనౌన్స్ చేశాడు. అలాగే, ఆదివారం ఎపిసోడ్‌లోనూ మరో ఎలిమినేషన్ ఉంటుందని ఆయన వెల్లడించి అందరికీ కోలుకోలేని షాక్‌ను ఇచ్చాడు. అందుకోసం ఇద్దరేసి సభ్యులను సేఫ్ అయినట్లుగా ప్రకటిస్తూ వచ్చాడు. దీంతో ఎపిసోడ్ చివరి వరకూ ఎంతో ఆసక్తికరంగా సాగింది.

తొలిసారి అలాంటి సీన్

తొలిసారి అలాంటి సీన్

ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో హోస్ట్ అక్కినేని నాగార్జున 13 మంది సభ్యులను (సూర్య ఎలిమినేషన్ తర్వాత మిగిలిన కంటెస్టెంట్లు) సేఫ్ చేస్తూ వచ్చాడు. అందులో చివరికి ఆది రెడ్డి, మెరీనాలు మాత్రమే మిగిలారు. వీళ్లిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారని నాగార్జున చెప్పాడు. దీంతో ఆది రెడ్డికి బాగా క్లోజ్ అయిన గీతూ రాయల్ ఈ సీజన్‌లోనే తొలిసారి ఓ రేంజ్‌లో ఏడ్చేసి షాకిచ్చింది.

వెళ్లొద్దు ఆది రెడ్డి అంటూ

వెళ్లొద్దు ఆది రెడ్డి అంటూ


ఆది రెడ్డి ఎలిమినేట్ అవుతాడని అనుకున్న గీతూ రాయల్ 'ఆది రెడ్డి నువ్వు వెళ్లిపోవద్దు. ఈ హౌస్‌లో నాకు సపోర్ట్ చేసే వాళ్లు ఉండరు. ప్లీజ్ నన్ను వదిలి వెళ్లొద్దు' అంటూ వెక్కి వెక్కి ఏడ్చేసింది. కానీ, చివర్లో నాగార్జున మాత్రం ఆది, మెరీనా ఇద్దరూ సేఫ్ అయ్యారని చెప్పి సర్‌ప్రైజ్ చేశాడు. మొత్తానికి ఎంతో స్ట్రాంగ్ అనుకున్న గీతూ ఏడవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X