Bigg Boss Elimination: బిగ్ బాస్ షోలో పెను సంచలనం.. 9వ వారం టైటిల్ ఫేవరెట్ ఎలిమినేట్
బిగ్ బాస్.. సరికొత్త నేపథ్యంతో ప్రసారం అవుతోన్నా.. ప్రేక్షకుల మన్ననలు అందుకుని.. అతి తక్కువ సమయంలోనే దేశంలోనే నెంబర్ వన్ షోగా ఎదిగిపోయింది. ఇండియాలోని చాలా భాషల్లోకి ఎప్పుడో వచ్చినా.. తెలుగులోకి మాత్రం ఆరేళ్ల క్రితమే ఇది పరిచయం అయింది. ఆరంభంలోనే ప్రేక్షకుల మనసు దోచుకుని సక్సెస్‌ను అందుకుంది. ఆ తర్వాత ప్రతి సీజన్ కూడా ఒకదానికి మించి ఒకటి విజయం సాధించాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో సీజన్ కూడా జనరంజకంగా సాగుతోంది. ఇక, ఇందులో పెను సంచలనం నమోదైందని తెలిసింది. వివరాల్లోకి వెళ్తే...

ఏం చేసినా రేటింగ్ పెరగట్లేదు
సాధారణంగా బిగ్ బాస్ షో ఎప్పుడు వచ్చినా తెలుగులో సూపర్ సక్సెస్ అవుతుంది. అందుకు అనుగుణంగానే ఆరో సీజన్‌కు కూడా భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతుందని అంతా భావించారు. కానీ, ఊహించని విధంగా దీనికి ఆదరణ అంతగా రావడం లేదు. అయినప్పటికీ నిర్వహకులు చాలా ప్రయోగాలు చేస్తున్నారు. కానీ, రేటింగ్‌ను మాత్రం ఆశించినట్లుగా పెంచలేకపోతున్నారు.

ఎనిమిది మంది ఎలిమినేషన్
తాజా సీజన్‌లోకి గీతూ రాయల్, అభినయ శ్రీ, కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, శ్రీ సత్య, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావ్, అర్జున్ కల్యాణ్, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, రేవంత్‌లు వచ్చారు. వీరిలో షానీ, అభినయ, నేహా, ఆరోహి, చంటి, సుదీప, ఆర్జున్, సూర్యలు వెళ్లారు.

ఈ సారి షాకింగ్ ఎలిమినేషన్స్
బిగ్ బాస్ షోలో అత్యంత ముఖ్యమైన ప్రక్రియల్లో ఎలిమినేషన్ ఒకటన్న విషయం తెలిసిందే. ఆరో సీజన్‌లో ఎలిమినేషన్స్ అన్నీ ఎవరూ ఊహించని విధంగా సాగుతున్నాయి. అందుకే ఇప్పటికే చాలా మంది స్ట్రాంగ్ ప్లేయర్లు బయటకు వెళ్లిపోయారు. దీంతో అసలు ఈ సీజన్‌లో ఏ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియక ప్రేక్షకులు, ఫ్యాన్స్ అయోమయానికి గురి అవుతున్నారు.

తొమ్మిదో వారంలో పది మంది
గతంలో కంటే బిగ్ బాస్ ఆరో సీజన్‌లో నామినేషన్స్ టాస్కులో ఎన్నో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గత సోమవారం జరిగిన తొమ్మిదో నామినేషన్స్ టాస్కు కూడా రచ్చ రచ్చగానే సాగింది. ఇక, ఈ వారంలో ఇనాయా సుల్తానా, బాలాదిత్య, ఆది రెడ్డి, గీతూ రాయల్, కీర్తి భట్, శ్రీ సత్య, రేవంత్, జబర్ధస్త్ ఫైమా, మెరీనా అబ్రహం, రోహిత్ సాహ్నీలు నామినేట్ అయిపోయారు.

ఎలిమినేషన్‌పై ఊహాగానాలు
బిగ్ బాస్ ఆరో సీజన్‌లో తొమ్మిదో వారానికి జరుగుతోన్న ఓటింగ్ చాలా ట్విస్టులతో సాగినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అనుకున్న వాళ్లే ఈ సారి ఎలిమినేషన్ ప్రమాదంలో పడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. అంటే.. ఈ సారి టాప్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే కొన్ని పేర్లు కూడా తెరపైకి వచ్చాయి.

షో నుంచి గీతూ రాయల్ ఔట్
వీకెండ్‌కు సంబంధించిన రెండు ఎపిసోడ్లను శనివారం ఉదయమే షూట్ చేస్తారన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తొమ్మిదో వారానికి సంబంధించిన షూట్ కూడా ఇప్పటికే దాదాపుగా ముగిసినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం ప్రకారం.. తొమ్మిదో వారంలో టైటిల్ ఫేవరెట్ గీతూ రాయల్ షో నుంచి ఎలిమినేట్ అయినట్లు తెలిసింది.

సీక్రెట్ రూమ్ ఉంటుందా అని
బిగ్ బాస్ షో నుంచి గీతూ రాయల్ ఎలిమినేట్ అయిందన్న వార్త ఇప్పటికే బుల్లితెర వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. దీంతో ఈ వార్తలో నిజం ఉండదని చాలా మంది అనుకుంటున్నారు. అదే సమయంలో ఆమెను సీక్రెట్ రూమ్‌లోకి పంపినా పంపొచ్చని అభిప్రాయపడుతున్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. గీతూ షో నుంచి నిజంగానే ఎలిమినేట్ అయిందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











